For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోటప్ప కొండపై చెరగని ముద్ర వేసిన కోడెల..

|

'మానవసేవే మాధవ సేవ అని, సేవకు పదవీ విరమణ అనేది ఎన్నటికీ ఉండదు' అని ఆంధప్రదేశ్ మాజీ స్పీకర్, మాజీ హోం మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోడెల శివప్రసాద్ అనేవారు. 'సచివాలయాన్ని దేవాలయంగా భావించాను. గుడిలో పూజారిగా పని చేశాను' అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనేవారు. పల్నాడులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేక పదవులను అలంకరించారు.

Former Andhra Pradesh Speaker Dr. Kodela Siva Prasad Rao Social Services
 

Image Curtosy

రాజకీయాల్లోకి రాకముందే వైద్యుడిగా అనేక సేవలందించారు. కోటప్ప కొండ అభివృద్ధికి, సత్తెనపల్లిలో స్మశానాలు, మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఆయన విశేషమైన సేవలు అందించారు.

1) పల్నాడులో మంచి వైద్యుడిగా..

1) పల్నాడులో మంచి వైద్యుడిగా..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రావెల వెంకట్రావు అనే డాక్టర్ దగ్గర కొద్దిరోజులు అప్రెంటీస్ గా ప్రాక్టీస్ చేశారు. అప్పట్లో అతని దగ్గరకు గ్రామీణులే అధికంగా వచ్చేవారు. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కోడెల శివప్రసాద రావు తాను చదివిని వైద్య విద్యతో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందించాలనే తపనతో తన సొంత ఆసుప్రతిని గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్థాపించారు. ఇక అక్కడి గ్రామీణ ప్రజల అభిమానంతో పల్నాడులో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ వ్యవధిలోనే ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపటమే కాకుండా మంచి మందులను ఇస్తూ, నమ్మకమైన సేవలందించాడు. మంచి సర్జన్ గా మనసున్న మారాజుగా మన్ననలు పొందాడు. అలా అతను డాక్టర్ కోడెల గా గుర్తింపు పొందారు.

2) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు..

2) లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులు..

2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికైన కోడెల అక్కడ మరుగుదొడ్లు, పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారించారు. అక్కడ కార్యక్రమాలను ప్రారంభించే ముందు మరుగుదొడ్ల నిర్మాణాలపైనే కాకుండా స్మశానాలపైనా ప్రజలను చైతన్యపరిచారు. ఇలా కేవలం మూడు నెలల కాలంలోనే సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో 20 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 21 వేలకు పైగా మరుగుదొడ్లను నిర్మించేలా చేశారు.

3) స్మశానాల ఆధునికీకరణ
 

3) స్మశానాల ఆధునికీకరణ

Image Courtesy

ఈ నాలుగు మండలాతో పాటు నకరికల్లు, రొంపిచర్ల మండలాల్లోనూ 398 స్మశానాలను ఆధునికీకరించారు. దీంతో అక్కడి స్మశానాల రూపురేఖలే మారిపోయాయి. హిందూ స్మశానాలకు స్వర్గపురి అనే నామకరణం కూడా చేశారు. దీన్నే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ జాతీయ స్థాయిలో ఒక రికార్డుగా నమోదు చేసింది. అంతేకాదు యునిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రయోగాన్ని అధ్యయనం చేయటానికి ప్రతినిధులను ప్రచారం లేకుండా పంపాయి. విదేశీ దౌత్యాధికారులు సైతం ఇందుకు చాలా ఆసక్తి చూపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సైతం దీన్ని గుర్తించింది.

4) మూడు నెలల్లోనే..

4) మూడు నెలల్లోనే..

కేవలం మూడున్నర నెలల వ్యవధిలో సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు ఇరవై ఒక్క వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఈ నాలుగు మండలాలూ, ఇంకా నరసరావుపేట, రొంపిచర్ల మండలాలలోనూ 398 శ్మశానాలను ఆధునికీకరించారు. శ్మశానాల రూపురేఖలు మారిపోయాయి. హిందూ శ్మశానాలకు స్వర్గపురాలని పేరుపెట్టారు. అంతేకాదు మన ఊరిని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రజలలో శుభ్రతపై అవగాహన తీసుకొచ్చారు.

5) కోటయ్యపై కోడెలకు అపారమైన భక్తి..

5) కోటయ్యపై కోడెలకు అపారమైన భక్తి..

Image Courtesy

కోడెల శివప్రసాదరావుకు కోటప్పకొండపై వెలసిన త్రికోటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆయన హయాంలోనే ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోయాయి. ఒకప్పుడు నిర్జీవ ప్రదేశంగా ఉండే ఈ కొండ ప్రాంతాన్ని కోడెల ప్రముఖ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దేందుకు ఎంతో శ్రమ పడ్డారు. దీనివల్ల పర్యాటకులు స్వామి వారిని దర్శించుకునేందుకు సులువుగా ప్రయాణం సాగించేవారు.

6) ఎన్టీఆర్ హయాంలో..

6) ఎన్టీఆర్ హయాంలో..

Image Courtesy

1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలోనే నరసరావుపేటలో కోటప్ప కొండపైకి ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం పట్టుబట్టారు. స్వయంగా ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అప్పట్లోనే 66 లక్షల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేయించారు. తర్వాత పరిస్థితులు మారిపోయి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి.

7) చంద్రబాబు హయాంలో..

7) చంద్రబాబు హయాంలో..

Image Courtesy

తర్వాత మరోసారి 1997లో మళ్లీ యువ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలకు పైగా నిధులతో రోడ్డు పనులను ప్రారంభించారు. 1999లోనే పూర్తి చేయించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు త్రికోటేశ్వర స్వామి ఆలయం, మహారాజ గోపుర నిర్మాణం కూడా నిర్ణీత సమయంలోపే పూర్తి చేయిచి చంద్రబాబు నాయుడితోనే ఆవిష్కరింపజేశారు. క్యూకాంప్లెక్స్, అభిషేక మండపాలు, కాటేజీలు, ప్రసాద తయారీ కేంద్రం, ధ్యాన మందరం, యాగశాల, నవగ్రహ మండపం ఇలా ఒక యాత్ర స్థలానికి కావాల్సిన సకల సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. వయసు పైబడిన వారి కోసం రెండు లిఫ్టులను సైతం ఏర్పాటు చేయించారు.

8) పక్షుల అభయారణ్యం..

8) పక్షుల అభయారణ్యం..

Image Courtesy

కోటప్ప కొండ ప్రాంతం అంటేనే మనం పుస్తకాల్లో చదువుకున్నట్టు అదొక చిట్టడవిని తలపించేది. కానీ దాని రూపురేఖలన్నీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అది ఏకంగా ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రదేశంగా మారింది. చుట్టుపక్కల ఊళ్ల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు సెలవు రోజుల్లో స్వామి వారిని దర్శించుకుని వెళతారు. కాసేపు హాయిగా సేద తీరుతారు. ఇలా ముందుచూపుతో కోడెల చేయించిన పనుల్లో ఇదొకటి. అంతేకాదు పక్షుల అభయారణ్యాన్ని కూడా ఏర్పాటు చేయించారు.

9) బసవతారకం ఆస్పత్రి ఏర్పాటులో కీలకపాత్ర..

9) బసవతారకం ఆస్పత్రి ఏర్పాటులో కీలకపాత్ర..

Image Courtesy

డాక్టరుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నపుడే హైదరాబాద్ లో ఇండో - అమెరికన్ బసవ తారకం ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ద్వారా అంతర్జాతీయ వైద్య సేవలను అతి తక్కువ ధరకే క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు కీలకపాత్ర పోషించారు. ఈ ఇన్ స్టిట్యూట్ ను అప్పటి ప్రధానమంత్రి వాజ్ పేయి ప్రారంభించారు.

English summary

Former Andhra Pradesh Speaker Dr. Kodela Siva Prasad Rao Social Services

Ravela Venkatrao, a doctor at Sattenapalli, Guntur district, practiced as an apprentice for a few days. The villagers came to him at the time. Raised in the rural area, Kodela Sivaprasada Rao set up his own hospital in Narasaraopeta, Guntur district, in the quest to provide better medical care to the villagers with medical education. He became a good doctor in Palnadu with the fondness of the rural people.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more