Latest Updates
-
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా!
International Labour Day 2022: మే డేకు నాంది పలికింది అక్కడే...
అంతర్జాతీయ కార్మిక దినోత్సవ తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మే డే, లేబర్ డే అంటే కార్మికులందరూ ఒక పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు.

అమెరికాలో మాత్రం ఈరోజును 'లాయల్టీ డే'గా పిలుస్తారు. మే డే రోజున కార్మికులకు హాలిడే ఉంటుంది. ఈ కార్మిక దినోత్సవానికి నాంది పలికింది అమెరికాలోని షికాగోలో. ఈ సంఘటన ఒక్క ప్రాంతానికి.. ఒక దేశానికో పరిమితం కాలేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ ఎనిమిది గంటల పని విధానం గురించి నినదించింది. అందులో భాగంగానే 1886లో మే ఒకటో తేదీన అమెరికాలో కార్మికులు పోరాటం ప్రారంభించారు. షికాగోలోని మార్కెట్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ సమయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించారు.

ప్రపంచాన్ని ముందుకు..
ఈ విశ్వమంతా ప్రతిరోజూ ప్రతి పనిని సక్రమంగా చేయాలంటే.. అందుకు కారణం కార్మికుడే. ఈ విశ్వాన్ని ముందుకు నడిపించే వాడు కార్మికుడే.తన చెమట చుక్కలను, రక్త మాంసాలను కరిగించి పని చేస్తేనే ఈ ప్రపంచం ముందుకు సాగుతుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు ఇస్తూ జరుపుకునే పండుగే కార్మిక దినోత్సవం.మే డే కార్మికుల ఐక్యత, పోరాటాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ సంఘటన జరిగిన అనంతరం 1889 నుండి 1890 వరకు కార్మికులకు మద్దతుగా, అనేక దేశాల్లో ఉద్యమాలు, నిరసన ప్రదర్శనలూ చోటు చేసుకున్నాయి. 1890 సంవత్సరంలో మే 1వ తేదీన బ్రిటన్లోని హైడ్ పార్కులో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు 3 లక్షల మంది కార్మికులు హాజరయ్యారు. వారందరూ కేవలం 8 గంటలు మాత్రమే పని వేళలు ఉండాలన్నదే వారి ప్రధాన డిమాండ్.

మే 1న ఒప్పందం..
ఆ తర్వాత యూరోపియన్ దేశాల్లో కూడా ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి. దీంతో కార్మికులు, యాజమాన్యాలు ఒప్పందం చేసుకునేందుకు ముందుకొచ్చారు. క్రమంగా షికాగోలో చనిపోయిన వారికి ప్రతీకగా మే ఒకటో తేదీని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం జరిగింది. అనంతరం ప్రపంచ వ్యాప్తంగా మే డే స్వరూపం మారుతూ వచ్చింది. చాలా దేశాల్లో కార్మికుల పోరాటాలూ, నిరసనలు నిరంతరం జరుగుతూ వచ్చాయి. అయితే అప్పటికీ యూరపోయిన్ దేశాల్లో కొన్ని ప్రభుత్వాలు 8 గంటల పని విధానం ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంతో సోషలిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమాలు, ప్రదర్శనలు జరుగుతూ ఉండేవి. అలా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కూడా మే డే రోజు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు కూడా చేపట్టేవారు. ఆ తర్వాత నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు.

కార్మికుల డిమాండ్లు..
కార్ల్ మార్క్స్ (జర్మన్ తత్వవేత్త, జర్నలిస్ట్, సంస్కరణవాది మరియు ఆర్థికవేత్త) రాసిన కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో పారిశ్రామిక కార్మికులపై మరియు దానికి అంకితమైన సంస్థలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని చెబుతారు. 1848 వ సంవత్సరంలో పారిశ్రామిక కార్మికులు తీవ్ర దోపిడీని ఎదుర్కొంటున్నప్పుడు ఈ మ్యానిఫెస్టో రాశారు. అయినప్పటికీ, కార్మికుల డిమాండ్లు కేవలం ఒక రోజులో నెరవేరలేదు.

కార్మిక సంక్షేమ పథకాలు..
వాస్తవానికి, దీనికి కొన్ని సంవత్సరాలు పట్టింది. నిరసన రక్తపాతం కూడా చూసింది. ఇదిలా ఉండగా.. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. అలాగే సంక్షేమ పథకాల అమలుకు మరియు నిరసన ప్రదర్శనలకు మే 1వ తేదీ వేదికగా మారింది. చాలా దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థపై వ్యతిరేక ఉద్యమాలు కూడా ప్రారంభమయ్యాయి.



Click it and Unblock the Notifications
