Latest Updates
-
సన్ స్క్రీన్ ఎంత రాయాలో తెలుసా? చర్మ నిపుణులు చెబుతున్న సీక్రెట్ ఇదే! -
కొబ్బరి నీళ్లు స్ట్రాతో నేరుగా తాగుతున్నారా? అయితే ఈ ప్రాణాంతక నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
భార్యా భర్తలు పక్కపక్కన కూర్చుని ఫోన్లు చూస్తున్నారు ఈ దృశ్యం మీ ఇంట్లోనూ ఉందా? -
చికెన్ లవర్స్ కు పండుగే.. రెండు రకాల సాస్ లతో అదరగొట్టే బ్యాంగ్ బ్యాంగ్ చికెన్.. -
బయట దొరికేలాగే.. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రెడ్ సాస్ పాస్తా ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు! -
బాధ పెడుతున్నా వదిలిపెట్టలేకపోతున్నారా? మనస్తత్వ శాస్త్రం చెప్పే కారణం ఇది -
నోరూరించే రొయ్యల కొబ్బరి గ్రేవీ.. రెస్టారెంట్ స్టైల్ రుచితో ఇంట్లోనే సులభంగా! -
యుక్త వయసులోనే వేధిస్తున్న తెల్ల జుట్టు సమస్య.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
ముఖానికి విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడుతున్నారా?.. ఈ స్కిన్ టోన్ ఉన్నవారు జాగ్రత్త.! -
దేవుడు మీకు సంకేతాలు ఇస్తున్నాడా? ఈ సూచనలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Martyrs' Day 2022:గాంధీ వర్ధంతి రోజునే ‘షాహిద్ దివాస్’ ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
అమరవీరుల దినోత్సవం 2022:మహాత్మ గాంధీ వర్థంతి రోజున ‘షాహిద్ దివాస్’ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
Martyrs' Day 2022:భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో నాయకులు, సాధారణ ప్రజలు మరణించారు.

వారందరి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మార్చి 23వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే 1931 సంవత్సరంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవులను ఆంగ్లేయులు ఉరి తీశారు. అందుకే ఈరోజు స్వతంత్ర పోరాటంలో తనువు చాలించిన వారందరినీ తలచుకుంటారు.

వారి పోరాటాల గురించి నేటి తరం వారికి తెలియజేసేందుకే ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అమరవీరుల దినోత్సవాన్ని 'షాహీద్ దివాస్' అని కూడా పిలుస్తారు. మన దేశంలో మొత్తం ఆరు తేదీల్లో అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

అందులో ముఖ్యమైనది మార్చి 23వ తేదీన భగత్ సింగ్ టీమ్ చనిపోయిన సందర్భంగా, జనవరి 30వ తేదీన మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా కూడా 'షాహీద్ దివాస్'గా జరుపుకుంటారు. దీంతో పాటు ఇతర అనేక సంఘటనలకు వేదికైన నాలుగు తేదీలను ఆయా రాష్ట్రాలు అమరవీరుల దినోత్సవంగా ప్రకటించాయి. ఇదిలా ఉండగా.. జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్ముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

ప్రపంచ దేశాలకు పాఠంగా..
‘ఈ భూమి మీద కేవలం రక్తమాంసాలు ఉండే శరీరంతో మనుగడ సాగించిన గొప్ప వ్యక్తి మహాత్మ గాంధీ'అని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ గాంధీనుద్దేశించి అన్నారు. ఆయన జీవితం గురించి తెలుసుకున్న వారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులకు ఈ మాటలు ఏ మాత్రం అతిశయోక్తిగా అనిపించవు. కేవలం సత్యం, అహింస అనే నినాదాలతో ప్రపంచానికి కొత్త దారి చూపిన మహాత్ముడు గాంధీజీ. అందుకే గాంధీయిజం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పాఠంగా మారిపోయింది. అందుకే మహాత్ముడు మన దేశానికి ‘జాతి పిత'గా మారారు.

ఎంతో ధైర్యంతో..
రవి అస్తమించని ఆంగ్లేయుల సామ్రాజ్యాన్ని సత్యాగ్రహం, అహింస, శాంతి అనే ఆయుధాలతో బెంబేలెత్తించాడు. 20వ శతాబ్దంలోనే మానవాళిని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన నాయకుల్లో గాంధీజీ ప్రథముడిగా నిలిచాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతేకాదు చేతిలో ఓ కర్రను పట్టుకుని, నూలు బట్టలు ధరించి.. మురికి వాడలను శుభ్రం చేస్తూ.. అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పారు. సత్యాగ్రహం, అహింస వంటివి పాటించేందుకు ఎంతో ధైర్యం కావాలని నిరూపించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.

గాడ్సే గన్ తో..
మన దేశానికి ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగించడంలో మహాత్మ గాంధీ కీలకపాత్ర పోషించారు. అయితే అంతటి గొప్ప మహాత్ముడిని 1948వ సంవత్సరంలో జనవరి 30వ తేదీన అత్యంత దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీని తన తుపాకితో కాల్చి చంపాడు. అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 30న గాంధీ వర్ధంతిని జరపనున్నారు.

భావితరాలకు బాటగా..
అప్పటినుంచి గాంధీజీ చూపిన సత్యం, అహింసా, శాంతి మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాంధీజీ తను నమ్మిన సిద్ధాంతాలను అనునిత్యం ఆచరించాడు. అందుకే భారతదేశంతో పాటు ప్రపంచ చరిత్రలోనే తనదైన గుర్తింపు పొందారు. ప్రపంచంలోనే గొప్ప మహాత్ముడిగా అవతరించారు. అందుకే ఆయన జన్మించిన అక్టోబర్ రెండో తేదీన ఐక్య రాజ్య సమితి ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం'గా ప్రకటించింది.

అందరికీ స్ఫూర్తిదాయకం..
గాంధీజీ సిద్ధాంతాలు అప్పటితరం వారికే కాదు.. నేటి తరం ప్రజలకు, పాలకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఎందుకంటే ‘అహింసే అత్యున్నత కర్తవ్యం. మనం దాన్ని పూర్తి స్థాయిలో ఆచరించకపోయినా.. దాని గొప్పతనాన్ని కనీసం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. సాధ్యమైనంత వరకు హింసా మార్గానికి దూరంగా ఉండాలి' మహాత్మ గాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు పలువరు ప్రముఖులు తెలియజేశారు.
మన దేశానికి ఆంగ్లేయుల నుండి విముక్తి కలిగించడంలో మహాత్మ గాంధీ కీలకపాత్ర పోషించారు. అయితే అంతటి గొప్ప మహాత్ముడిని 1948వ సంవత్సరంలో జనవరి 30వ తేదీన అత్యంత దారుణంగా హత్య చేశారు. ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనా మందిరానికి వెళ్తున్న సమయంలో నాథూరామ్ గాడ్సే గాంధీజీని తన తుపాకితో కాల్చి చంపాడు. అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 30న గాంధీ వర్ధంతిని జరపనున్నారు.



Click it and Unblock the Notifications