Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
National Doctor's Day Special : ఇండియాలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరో తెలుసా...
డాక్టర్స్ డే సందర్భంగా ఇండియాలో తొలి మహిళా డాక్టర్ ఎవరో తెలుసుకుందాం.
మన దేశంలో వైద్యులను భగవంతునితో సమానంగా భావిస్తారు. కరోనా వంటి కష్టకాలంలోనూ మన జీవితాల్లో వెలుగులు నింపేది ఒక్క డాక్టర్ మాత్రమే.

అందుకే డాక్టర్లను కనిపించే ప్రత్యక్ష దేవుళ్లుగా భావిస్తారు. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు మన దేశంలో మహిళలు కేవలం ఇంటి పట్టానే ఉండేవారు. అయితే ఆరోజుల్లోనే అంటే దాదాపు 150 ఏళ్ల క్రితమే మన భారతదేశం తరపున తొలి మహిళా వైద్యురాలిగా అర్హత సాధించింది ఓ మహిళా.

అయితే ఆ మహిళా ఎవరు? ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆమె ఎక్కడ పుట్టారు? మహిళలందరై డాక్టర్లుగా మారేందుకు ఆమె ప్రేరణగా ఎలా నిలిచారనే ఆసక్తికరమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆనందీ బాయి గోపాల్ జోషీ..
మన దేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఆనందీ బాయి గోపాల్ జోషీ. ఈరోజున ఈమెకు సంబంధించి 153వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈమె 1865 సంవత్సరం మార్చి 31న మహారాష్ట్రలోని థానే జిల్లాలోని కళ్యాణ్ లో జన్మించారు. ఆమె పుట్టిన సమయంలో, ప్రస్తుత మహారాష్ట్రను బొంబాయి ప్రెసిడెన్సీ అని పిలిచేవారు. ఆనందీ జోషికి మొదట ‘యమునా'అని పేరు పెట్టారు.

పెళ్లి తర్వాత..
ఆమె పెళ్లి అయిన తర్వాత తన పేరు మారిపోయింది. ఆమె గోపాల్ రావ్ జోషీని పెళ్లి చేసుకున్నారు. మన దేశంలో అత్తారింటికి వెళ్లినప్పుడు ఇంటి పేరు ఎలా మార్చుకుంటారో.. అలాగే తన పేరు కూడా ‘ఆనందీ'గా మారిపోయింది. ఆనందీ గోపాల్ జోషీ బ్రిటీష్, రాజుల కాలంలో చాలా సంవత్సరాలుగా కుటుంబం, భూస్వాములుగా ఉండేవారు.

19వ శతాబ్దంలో..
19వ శతాబ్దంలో మన దేశంలో అమ్మాయిలకైనా.. అబ్బాయిలకైనా చాలా త్వరగా పెళ్లిళ్లు చేసేవారు. అలాగే తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల ఆనందీ జోషికి కూడా తొమ్మిదేళ్ల వయసులోనే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమెకు అసలైన కష్టాలు ప్రారంభమయ్యాయి. తనకు పుట్టిన బిడ్డ వెంటనే చనిపోవడంతో ఆమె తీవ్రంగా బాధపడింది. అందరిలా ఆమె అక్కడితో ఆగిపోలేదు.

డాక్టర్ అవ్వాలని..
తాను కూడా డాక్టర్ కావాలని నిర్ణయించుకుంది. ఆ వెంటనే బొంబాయి ప్రెసిడెన్సీ నుండి రెండేళ్ల వైద్య రంగం డిగ్రీ గ్రాడ్యుయేట్ పట్టా అందుకుంది. అనంతరం యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని పెన్సిల్వేనియాలోని తొలి మహిళా మెడికల్ కాలేజీగా పేరొందిన డ్రెక్సెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుండి వైద్యశాస్త్రంలో విద్యనభ్యసించారు
ఆనంది.

వైద్యురాలిగా పట్టా..
అలా అమెరికాలో భారతదేశం తరపున వైద్యురాలిగా ఆనందీ బాయి గోపాల్ జోషీ మొట్టమొదటి మహిళా కొత్త రికార్డు నెలకొల్పారు. తన చదువు పూర్తయిన తర్వాత కొల్హాపూర్ రాజు ఆమెను ఘనంగా సన్మానించారు. అంతేకాదు అల్బర్ట్ ఎడ్వర్ట్ హాస్పిటల్స్ లో మహిళల వార్డు ఇన్ చార్జ్ గా నియమించారు.

ఎందరికో ప్రేరణగా..
1886 సంవత్సరంలో డాక్టర్ గా పట్టా పుచ్చుకున్న ఆమె 1887 సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన, తన పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందుగానే టిబి వ్యాధి కారణంగా మరణించారు. ఆమె మరణంతో భారతావని అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఆమె మహిళా వైద్యురాలిగా సాధించిన విజయాలు ఎందరో భారతీయ మహిళలకు ప్రేరణగా నిలిచాయి. మన దేశంలో కూడా మహిళా వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని కలలు కన్న మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా ఆమె గుర్తించబడ్డారు. ప్రస్తుతం మన దేశంలో చాలా వైద్య కళాశాలలు ఉన్నాయి. ఈ రంగంలో ఎందరో మహిళలు ముందుకు సాగుతున్నారు.



Click it and Unblock the Notifications
