Latest Updates
-
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే.. -
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే? -
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా.. -
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి! -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు బెదిరింపుల కలకలం… ప్రయాణికులు ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!
పీరియడ్స్ వేళ సెలవు కోసం సుప్రీంకోర్టులో పిల్, ఏయే దేశాల్లో లీవ్ ఇస్తారో తెలుసా?
భారత్‌లోని విద్యార్థులకు, పని చేసే మహిళలకు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల్లోని కంపెనీలు, పాఠశాలలు, కళాశ
భారత్‌లోని విద్యార్థులకు, పని చేసే మహిళలకు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రాల్లోని కంపెనీలు, పాఠశాలలు, కళాశాలల్లో రుతుక్రమ సెలవులు ఇచ్చే విధానాన్ని అమలు చేసేలే రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఆ సమయంలో గుండెపోటుతో సమానమైన నొప్పి..
న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి తన పిటిషన్‌లో యూనివర్సిటీ కాలేజ్ లండన్ చేసిన అధ్యయనాన్ని ఉటంకించారు. బహిష్టు సమయంలో స్త్రీలకి కలిగే నొప్పి గుండెపోటు సమయంలో అనుభవించే నొప్పికి సమానమని లండన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఇటువంటి నొప్పిని భరిస్తూ ఒక ఉద్యోగి పని చేయలేదని, ఆ ప్రభావం ఉత్పాదకతపై పడుతుందని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టలేరని ఆ అధ్యయనంలో వెల్లడైనట్లు పిటిషనుదారు పేర్కొన్నారు. ఇవిపనాన్, జొమాటో, బైజూస్, స్విగ్గీ, మాతృభూమి, మగ్జ్‌టర్, ఏఆర్సీ, ఫ్లైమైబిజ్, గోజూప్ వంటి కొన్ని భారతీయ సంస్థలు ఇప్పటికే రుతుక్రమ సమయంలో సెలవులు ఇస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
'సెలవు ఇవ్వకపోవడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే'
రుతుక్రమం వేళ సెలవు మంజూరు చేయకపోవడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని పిటిషన్ పేర్కొన్నారు. ఆర్టికల్ 14 అనేది వివక్ష వ్యతిరేక నిబంధన. ఇది చట్టం ముందు ఏ వ్యక్తికి సమానత్వాన్ని, దేశంలోని చట్టాల సమాన రక్షణను రాష్ట్రాలు తిరస్కరించరాని పేర్కొంటుంది.
'ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తున్నారు'
మహిళలు వారి రుతుచక్రాల సమయంలో ఒకే విధమైన శారీరక, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు వేర్వేరుగా వ్యవహరిస్తున్నాయని అది మహిళలను సమానంగా పరిగణించకపోవడం కిందకే వస్తుందని పిటిషన్ పేర్కొన్నారు.

ఉచితంగా ప్యాడ్‌లు, నెలకు 2 రోజుల సెలవు:
2017లో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రవేశపెట్టిన రుతుస్రావం ప్రయోజనాల బిల్లు లేదా మహిళల లైంగిక, పునరుత్పత్తి, రుతుస్రావ హక్కుల బిల్లును ఈ తాజా పిటిషన్ హైలెట్ చేసింది. శశి థరూర్ ప్రవేశపెట్టిన బిల్లులో మహిళలకు వారి పని చేసే చోట ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందుబాటులో ఉంచాలని ఆ బిల్లు పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమ సెలవు ఇవ్వాలని చెప్పింది. అయితే 2022 బడ్జెట్ సెషన్ మొదటి రోజున ఈ బిల్లును సభ అన్‌క్లీన్ టాపిక్ అంటూ కొట్టేసింది.

భారత్‌లో ఏయే కంపెనీలు రుతుక్రమం సెలవులు ఇస్తున్నాయి:
- స్విగ్గీ
- బైజూస్
- జొమాటో
- కల్చర్ మెషీన్
- మాతృభూమి
- మాగ్జ్‌టర్
- వెట్ అండ్ డ్రై
- ఇండస్ట్రీ ఏఆర్సీ
- ఐవిపనన్
- గోజూప్ ఆన్‌లైన్ ప్రై.లి.
- హార్సెస్ స్టేబుల్ న్యూస్
- ఫ్లైమైబిజ్

ఏయే దేశాల్లో రుతుక్రమ సెలవులు ఇస్తున్నారు?
కొన్ని దేశాల్లో మహిళలకు రుతుక్రమ సెలవు తప్పనిసరి. చైనా, జపాన్, తైవాన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, స్పెయిన్ మరియు జాంబియా వంటి దేశాలు ఇప్పటికే పీరియడ్స్ పెయిన్ కోసం మహిళలకు సెలవు అందిస్తున్నాయి. దీని ఆధారంగా ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం రుతుక్రమం సెలవు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రాతినిధ్యంగా పరిగణించాలి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిటిషన్‌కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో, సెంట్రల్ సివిల్ సర్వీస్ (సెలవులు) రూల్స్, 1972 ప్రకారం, రుతుక్రమ సెలవులకు ఎటువంటి నిబంధనలు లేవని పేర్కొన్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఏయే దేశాలు రుతుక్రమ సెలవులను అమలు చేశాయో చూద్దాం..
ఇండోనేషియా
ఇండోనేషియా 2003లో మహిళలకు ముందస్తు నోటీసు లేకుండా నెలకు రెండు రోజులు వేతనంతో కూడిన రుతుక్రమ సెలవులు తీసుకునే హక్కును కల్పిస్తూ చట్టం చేసింది.
జపాన్
జపాన్‌లో, 1947లో రూపొందించబడిన చట్టం ప్రకారం, కంపెనీలు మహిళలు కోరితే వారికి అవసరమైనంత బహిష్టు సెలవు ఇవ్వాలి. కానీ బహిష్టు సెలవు సమయంలో జీతం చెల్లించబడదు.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియా చట్టం ప్రకారం, మహిళలు నెలకు ఒక రోజు వేతనం లేని రుతుక్రమ సెలవుకు అర్హులు. దీన్ని చెల్లించని యజమానులకు 5 మిలియన్ల వరకు జరిమానా విధించాలని చట్టం నిర్దేశిస్తుంది.
తైవాన్
తైవాన్ చట్టం మహిళలకు సంవత్సరానికి మూడు రోజుల ఋతుస్రావం సెలవును మంజూరు చేస్తుంది. 50% జీతంతో నెలలో ఒకరోజు మాత్రమే రుతుక్రమం తీసుకోవచ్చు.
జాంబియా
2015లో, జాంబియా మహిళలకు ఒకరోజు వ్యవధిని ఇచ్చే చట్టాన్ని ఆమోదించింది. కానీ అన్ని కంపెనీలు దీన్ని అమలు చేయడం లేదు.
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్
ఈ దేశాల్లో నిర్దిష్ట చట్టం లేనప్పటికీ, కొన్ని కంపెనీలు రుతుక్రమాన్ని అందిస్తాయి.



Click it and Unblock the Notifications