Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
Samantha-IVIG Treatment: మయోసైటిస్‌కు ఐవీఐజీ చికిత్స.. సమంత ఆరోగ్యంపై క్లారిటీ
మయోటైటిస్ కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ సెషన్ కు హాజరైనట్లు చెప్పింది. ఈ మేరకు తన ఇన్ స్టా స్టేటస్ లో ఫొటోను షేర్ చేస్తూ.. న్యూ నార్మల్ అని పేర్కొంది.
స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస ఆఫర్లతో దూసుకెళ్తూ తన అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. తనతో పాటు కెరియర్ ప్రారంభించిన అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, డేటింగ్, వివాహం.. ఆ తర్వాత విడాకులు ఇలా అన్నీ జరిగిపోయాయి. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా గడిపిన ఈ క్యూట్ బ్యూటీ గత కొంత కాలంగా మయోటైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే చాలా వీక్ అయిపోయి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతోంది.

ఈ వ్యాధికి సంబంధించి చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమలు, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంది. మయోటైటిస్ కు సంబంధించి నెలవారీ ఐవీఐజీ సెషన్ కు హాజరైనట్లు చెప్పింది. ఈ మేరకు తన ఇన్ స్టా స్టేటస్ లో ఫొటోను షేర్ చేస్తూ.. న్యూ నార్మల్ అని పేర్కొంది.

మానవ శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్ ను సమర్థంగా పని చేయించడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. ఇందుకోసం రెండు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. సామ్ ఈ చికిత్సను ఇంట్లోనే తీసుకుంటోంది. చికిత్స తీసుకుంటూనే వ్యాయామం చేస్తోంది.

తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా.. ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా పడింది. సామ్ ప్రస్తుతం సీటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది.



Click it and Unblock the Notifications
