Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
Shivaji Jayanti 2022 : ఛత్రపతి శివాజీ చరిత్ర గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం....
శివాజీ జయంతి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఎవరి పేరు చెబితే మొగలులు బెంబేలెత్తిపోతారో... ఎవరి పేరు చెబితే హిందూ మతంలో ఉత్సాహం ఉరకలెత్తుతుందో.. ఎవరి పేరు చెబితే గెరిల్లా యుద్ధం గుర్తుకొస్తుందో..

ఆయనే మరాఠా మహాయోధుడు ఛత్రపతి శివాజీ... మన భారతదేశ చరిత్రలో శివాజీ రాజాకు మాత్రమే సువర్ణాక్షరాలతో లిఖించబడిన ఘనత దక్కుతుంది. స్వతంత్య్ర సామ్రాజ్య, మరాఠా సామ్రాజ్యానికి 'నాంది' పలికిన వీరుడు.

మొఘలులకు ముచ్చెమటలు పట్టించినా.. అన్ని మతాలను సమానంగా చూసిన గొప్ప మహారాజు ఛత్రపతి శివాజీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మహారాష్ట్రలో..
క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన, వైశాఖ మాసపు, శుక్ల పక్షం తదియ రోజున మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న జునార్ లోని శివనీర్ కోటలో జిజియాబాయి, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు.

పరమత సహనం..
తన తల్లి నుండి.. శివాజీ మహారాజ్ తన తల్లి దగ్గర నుండి పరమత సహనం, మహిళల పట్ల గౌరవంగా ఉండటాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు అతి చిన్న వయసులోనే తను పుట్టిన భూమిపైన, ప్రజలతో ఎలా మెలగాలో శివాజీకి తన తల్లి జిజియాబాయి నేర్పించింది. ఆయన తండ్రి పూనేలోనే జాగీరుగా ఉండేవారు.

సరికొత్త యుద్ధతంత్రాలు..
తన తండ్రి నుండి.. శివాజీ తన తండ్రి దగ్గర నుండి యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. అలాగే రాజనీతి మెళకువలను నేర్చుకుంటూ తన తండ్రి పరాజయాలన్నీ కూడా అధ్యయనం చేసేవాడు. అప్పుడే సరికొత్త యుద్ధతంత్రాలను నేర్చుకొన్నాడు. ఇలా యుద్ధానికి సంబంధించిన అన్ని మెళకువలను నేర్చుకున్నాడు.

హిందూ మత రక్షణకు..
ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు. ఇతర మతాల నుండి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు. అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి కూడా చేశాడు. హిందూ మత రక్షణ కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు.

సైన్యంలో సముచిత స్థానం..
ఛత్రపతి శివాజీ స్నేహితుల్లో కూడా చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. అంతేకాదు సైనిక వ్యవస్థలో ఎందరో ముస్లింలకు సముచిత స్థానం కల్పించారు. బీజాపూర్ సుల్తాన్లను ఓడించేందుకు మొఘల్ రాజు ఔరంగజేబుకు కూడా సహాయం చేశాడు. యుద్ధతంత్రాల్లో శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది. తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన 2 వేల మంది సైనికులను 10 వేల మంది వరకు పెంచుకున్నాడు. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించేవాడు. అందులో ముఖ్యమైనది గెరిల్లా దాడి.

పులి గోళ్లతో..
తన కంటే బలవంతుడైన అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఎంతో చాకచక్యంగా అంతం చేసేశాడు. అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోళ్లను తొడుక్కుని అతడిని హతమార్చాడు. దీంతో శివాజీ మహారాజు మరాఠా యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు.
క్రీస్తు శకం 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన, వైశాఖ మాసపు, శుక్ల పక్షం తదియ రోజున మహారాష్ట్రలోని పూనే జిల్లాలో ఉన్న జునార్ లోని శివనీర్ కోటలో జిజియాబాయి, షహాజీ దంపతులకు శివాజీ జన్మించారు. తను చిన్న వయసు నుండే యుద్ధ మెళకువలు నేర్చుకుని, మహారాజుగా మారేంత వరకు తన వ్యూహాలను చాకచక్యంగా అమలు చేశారు. ముఖ్యంగా మొగలులను బెంబేలెత్తించారు. అయితే అన్ని మతాలను సమానం చేశారు.



Click it and Unblock the Notifications
