For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానసికంగా బలంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..

|

ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి జీవితాంతం కొన్ని లేదా చాలా మార్పులకు గురవుతాడు. కొన్ని సమయాల్లో మానసికంగా బలమైన వ్యక్తిగా, కొన్నిసార్లు బలహీనమైన వ్యక్తిగా మారతారు. అయితే కేవలం ఒక రోజులో బలంగా మాత్రం అవ్వలేరు. అనుభవాలు మరియు పాఠాలు మాత్రమే మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తాయి.

Signs Of An Emotionally Strong Person

కానీ కొన్నిసార్లు మార్పులు అసౌకర్యంగా ఉంటాయి. వాటిని అంగీకరించడానికి కష్టంగా అనిపించవచ్చు. మీరు మానసికంగా బలమైన వ్యక్తిగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంటే, మార్పులను అంగీకరించాల్సిందే. అలాంటప్పుడే ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు సిద్ధంగా ఉంటారు. సో ఈరోజు స్టోరీలో మానసికంగా బలంగా ఉండేవారిలో ఉన్న సంకేతాల గురించి తెలుసుకుందాం.

1) చేసిన తప్పే చేయొద్దు..

1) చేసిన తప్పే చేయొద్దు..

తప్పు చేయటం మానవుని లక్షణం. అంటే మానవులు తప్పు చేయడం కూడా ఒక రకంగా మంచిదే. కానీ, ఆ తప్పులను మళ్లీ చేయడం మంచిది కాదు. మీరు గతంలో చేసిన తప్పుల గురించి మీకు తెలిస్తే, భవిష్యత్తులో మీరు వాటిని పునరావృతం చేయకుండా చేసుకోండి. ఇది మంచి వ్యక్తిగా మారేందుకు మీకు సహాయపడుతుంది.

2) అనవసర సంబంధాలకు చెక్ పెట్టాలనుకుంటారు..

2) అనవసర సంబంధాలకు చెక్ పెట్టాలనుకుంటారు..

మీరు ఈ సమాజంలో రకరకాల వ్యక్తులతో రిలేషన్ షిప్ కలిగి ఉండాలి. కానీ, ప్రతి ఒక్కరూ నిజమైన స్నేహితులు కాదని మీకు తెలియదు. కొంతమంది నిజంగా ప్రతీకారం తీర్చుకోవచ్చు. అందుకే మీరు మీ జీవితం నుండి చెడు ఉద్దేశ్యాలతో ఉన్నవ్యక్తులతో సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ కోసం నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తులను గుర్తించినప్పుడే మీరు బలంగా ఉన్నారని మీకు తెలుస్తుంది. ప్రతిసారీ మిమ్మల్ని నిరాశపరిచి, మీ జీవితం నుండి శాంతిని హరించే వారిని మీరు ఎంటర్ టైన్ చేయకూడదు. మీరు అలాంటి వ్యక్తులతో ఎక్కువ రిలేషన్ పెట్టుకోకుండా అలాంటి వారికి దూరంగా ఉండాలి.

3) మీరు ఎవరిని నమ్మాలంటే..

3) మీరు ఎవరిని నమ్మాలంటే..

అమాయకంగా ఉండటం ఒక ధర్మం. అంటే తెలివితక్కువగా ఉండటం కాదు. మీరు బలమైన వ్యక్తిగా మారినప్పుడు, మీరు దీన్ని బాగా అర్థం చేసుకుంటారు. మంచి స్నేహితులతో స్నేహం చేయడం లేదా ఎవరితోనైనా డేటింగ్ చేసేటప్పుడు మీరు ఎలాంటి వారిని నమ్మాలో మీకే ఒక ఐడియా వస్తుంది. మీ గత అనుభవాలు, మీరు పార్టీలో లేదా సోషల్ మీడియాలో కలుసుకున్న వారిపై మీ నమ్మకాన్ని ఉంచడానికి అనుమతించవు. మీరు నిజమైన మరియు మైండ్ గైమ్స్ ఆడని వ్యక్తులతో మాత్రమే ఉండాలని కోరుకుంటారు.

4) మీ లోపాలను గుర్తిస్తారు..

4) మీ లోపాలను గుర్తిస్తారు..

ఈ ప్రపంచంలో ఏ మానవుడు పరిపూర్ణవంతుడు కాడు. అసలు పరిపూర్ణ మానవులు అనేవారే లేరు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కొన్ని లోపాలు లేదా ఇంకోటి ఉంటాయి. మనం పెరిగేకొద్ది, ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటాము మరియు అంగీకరిస్తాం. ఆ మొటిమల మచ్చలను లేదా మీ దంతాల మధ్య అంతరాన్ని దాచడానికి మీరు ఇకపై పనులు చేయరు. వాస్తవానికి, ఆ లోపాలు మీలో ఒక భాగమని మీరు భావిస్తారు. అందువల్ల, ఎవరైనా మీ లోపాలను ఎత్తిచూపినప్పుడు మీకు సిగ్గు లేదా కోపం కలగదు.

5. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి అర్హులు..

5. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి అర్హులు..

మన జీవితంలో ఆనందానికి మొదటి ప్రాధాన్యత అని మీరు అర్థం చేసుకుంటారు. అందుకే మీ మానసిక శాంతి మరియు ఆనందం యొక్క మార్గంలో ఏది వచ్చినా, మీరు దానిని విస్మరిస్తారు. మీరు కోరుకునే వ్యక్తిలో ఏ లక్షణాలు ఉండాలో చూసుకోండి. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, కష్టసమయాల్లో మద్దతు ఇవ్వడానికి అక్కడ ఉన్న వ్యక్తులతో ఉండాలని మీరు కోరుకుంటారు.

6) మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని ఇవ్వడంలో మీరు వెనుకాడరు..

6) మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని ఇవ్వడంలో మీరు వెనుకాడరు..

మీరు మీ అభిప్రాయాలు చెప్పేటప్పుడు, మీరు మీ నిజాయితీ ఆలోచనలను దాచరు. మీరు ఏమనుకుంటున్నారో అది నిర్మోహమాటంగా చెప్పేస్తారు. పారదర్శకతకు విలువ ఇవ్వడం నేర్చుకుంటారు. అది పనిలో గానీ, రిలేషన్ షిప్ లో గాని ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా అది చెప్పాల్సిన అవసరం ఉందని భావిస్తే మీరు ఏ సంకోచం లేకుండా చెప్పండి.

7) కుంటి సాకులు చెప్పే వ్యక్తులను మీరు ద్వేషిస్తారు..

7) కుంటి సాకులు చెప్పే వ్యక్తులను మీరు ద్వేషిస్తారు..

మీరు ఇప్పుడు మరింత వ్యవస్థీకృతమై ఉన్నారు. మీరు ఎప్పుడూ నిజాయితీ మరియు కష్టపడి పనిచేసే వ్యక్తులనే ఇష్టపడతారు. మీరు మీ పని మరియు వృత్తి లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ సన్నిహితులు కూడా అదే చేయాలని ఆశిస్తారు. కానీ వారి కుంటిసాకులు చెప్పినప్పుడు మీరు వారిని ద్వేషించుకుంటారు.

8) వైఫల్యం నుండి..

8) వైఫల్యం నుండి..

మీరు క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు కొన్ని వైఫల్యాలు ఎదురుకావచ్చు. కానీ మీరు పడిపోయిన ప్రతిసారీ, మీరు నిలబడి బలంగా తయారవ్వడం వంటివి నేర్చుకోవడం మంచిది. ఇలాంటప్పుడు పడి లేచే కెరటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. కలలు చెదిరినప్పుడు ఎలా అనిపిస్తుందో మీకు బాగా తెలుసు. అందువల్ల మేము కష్టపడి పనిచేయడం నేర్చుకుంటాం. మీకు సరైనది ఏది.. తప్పు ఏది అనేది తెలుస్తుంది.

9) మీరు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు..

9) మీరు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉంటారు..

మీరు స్కూలులో లేదా కాలేజీలో లేదా ఆఫీసుతో పాటు ఇంకా ఎక్కడైనా మీరు తప్పు చేస్తే క్షమాపణ చెప్పేందుకు మీరు వెనుకాడరు. ఎందుకంటే మీరు క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని మీరు అర్థం చేసుకుంటారు కనుక. మీకు మరియు మీ ప్రియమైన వారికి మధ్య అపార్థాలను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని మీరు నిర్ధారించుకుంటారు.

10) మనస్తాపం చెందకండి..

10) మనస్తాపం చెందకండి..

ఎవరైనా మీ తప్పులు ఎత్తి చూపితే మనస్తాపానికి గురికాకండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునే మార్గాలను కనుగొనటానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ తప్పులను ఎత్తి చూపినా, మీరు మీ ఆత్మరక్షణ పద్ధతులను మార్చరు. ఇందుకు బదులుగా వారి సలహాలను వినండి. కొత్త ఆలోచనలకు పూర్తిగా సిద్ధంగా ఉండండి. అన్ని పరిస్థితులలోనూ మానసికంగా స్థిరంగా ఉండటం చాలా ప్రాముఖ్యత అని మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం.

11) ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసుకోరు..

11) ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసుకోరు..

మీ జీవితంలో చేయి దాటిపోయిన లేదా పోగొట్టుకున్న వాటి గురించి ఆలోచించి టైమ్ ను, ఎనర్జీని వేస్ట్ చేసుకోరు. మీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన వల్ల అలా చేయి దాటిపోయిందని అర్థం చేసుకుని అడ్జస్ట్ అవుతారు.

12) అణిగిమణిగి ఉండాలనుకోరు..

12) అణిగిమణిగి ఉండాలనుకోరు..

మీరు మానసికంగా బలంగా ఉంటే ఎవ్వరిదగ్గర మీరు అణిగిమణిగి ఉండాలనుకోరు. మీకు ఇష్టమైతేనే ఎవ్వరితోనైనా మాట్లాడతారు. కానీ ఇతరులు బాధపడకుండా హ్యాండిల్ చేస్తారు.

13) రిస్క్ లను ఎదుర్కోవడానికి భయపడరు..

13) రిస్క్ లను ఎదుర్కోవడానికి భయపడరు..

కొంతమంది కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి తెలివితక్కువగా రిస్క్ తీసుకుంటారు. వాటి వల్ల ఎంతటి రిస్క్ ఉందో ఏ మాత్రం ఆలోచించరు. కానీ మానసికంగా బలంగా ఉండే వారు మాత్రం ఆ రిస్క్ వల్ల లాభనష్టాలు ఎలా ఉంటాయన్న విషయం మీద ఎక్కువగా ఆలోచిస్తారు. పూర్తిగా ఆలోచించిన తర్వాత, ప్రయోజనం ఉంటేనే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు.

14) ఇతరుల విజయాలను అభినందిస్తారు..

14) ఇతరుల విజయాలను అభినందిస్తారు..

మానసికంగా బలంగా ఉండే వారు ఎవరైనా ఎందులో అయినా విజయం సాధిస్తే వారిని అభినందించడానికి ఏ మాత్రం సంకోచించరు. ఇంకా వారిని ప్రోత్సహిస్తారు. ఎదుటి వారి విజయాన్ని చూసి జలసీ ఫీల్ అవ్వరు. వారి విజయానికి ముందు చేసిన కష్టాన్ని కూడా గుర్తిస్తారు.

15) ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారు..

15) ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతారు..

మానసికంగా స్ట్రాంగ్ ఉన్నవారు ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే వారికి ఒంటరిగా ఉన్నామన్న భావన ఎప్పటికీ ఉండదు. నిశ్శబ్దానికి ఏ మాత్రం భయపడరు. వారి లోకంలో వారు ఎంజాయ్ చేస్తుంటారు.

English summary

Signs That You Are Really Becoming An Emotionally Strong Person

While you were growing up, you must have made connections with different people. But, hardly you knew back then that not everyone can be a true friend. Some can be really vindictive too. You know that you are becoming stronger when you remove people with bad intentions from your life and are able to identify people who truly care for you. You no more want to entertain anyone who let you down every time and take away the peace from your life. Even if you have been for long with that person, you understand that it is worthless to stay in a toxic friendship/ relationship.
Story first published: Thursday, September 19, 2019, 12:39 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more