Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అతిలోక సుందరిని అస్సలు మరచిపోలేనంటున్న జాన్వీ కపూర్...
శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో తన తల్లి ఒడిలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసుకున్నారు.
టాలీవుడ్.. బాలీవుడ్.. సౌత్.. నార్త్ ఎక్కడైనా ఆమె వెండి తెరతో పాటు నిజ జీవితంలోనూ అతి లోక సుందరిగా అందరి మన్ననలు అందుకుంది. ఆమెతో నటించేందుకు అగ్ర హీరోలందరూ తెగ పోటీ పడేవారు. అయితే ఆమె ప్రస్తుతం మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అప్పుడే ఆ అతిలోక సుందరి శ్రీదేవి మరణించి రెండేళ్లు పూర్తయ్యింది.

ఈ విషయాన్ని అభిమానులెవరూ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం సందర్భంగా దుబాయ్ కి వెళ్లిన శ్రీదేవి అక్కడే ఓ హోటల్ లో ఓ బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఫిబ్రవరి 24వ తేదీ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ తన కూతురు జాన్వీ కపూర్ ''మిస్ యు రోజూ'' అని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకా తన తల్లితో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పాత ఫొటోలను జత చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి...

‘నా గుండె ఎప్పుడూ భారంగా..‘‘
శ్రీదేవి మరణించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో తన తల్లి ఒడిలో కూర్చున్న ఫొటోలను షేర్ చేసుకున్నారు. దీనికి ఆమె క్యాప్షన్ ఇలా ఇచ్చారు. ‘నా గుండె ఎప్పుడూ భారంగా ఉంటుంది. అయితే నేను ఎప్పుడూ నవ్వూనే ఉంటాను. ఎందుకంటే అది మీలో ఉంది.‘‘ అని షేర్ చేసింది.

తీరని లోటు..
అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటు అని, ఎంతమంది నూతన హీరోయిన్లు వచ్చినా.. శ్రీదేవి స్థాయిని ఎవ్వరూ అందుకోలేరు. అంతేకాదు ఆమెకు కనీసం సగం కూడా పోటీ ఇవ్వలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు.

బాల నటిగా..
శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోని అడుగు పెట్టింది. ఆమె కేవలం తమిళం, తెలుగు సినిమాలతో ఆగిపోకుండా.. బాలీవుడ్ లోనూ పాగా వేసింది.

తల్లి ప్రోత్సాహంతోనే..
తన తల్లి ప్రోత్సాహంతోనే శ్రీదేవి చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నతనంలో బాలనటిగా ఆమె నటించిన హీరోలతోనే తర్వాత హీరోయిన్ గా నటించారు. తన తల్లిని ఆదర్శంగా తీసుకుని ఇటీవలే జాన్వీ కపూర్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

వివిధ కార్యక్రమాలకు..
ప్రముఖ కథానాయిక మహేశ్వరి శ్రీదేవి బంధువు. వారిద్దరూ కలిసి ఎన్నో కార్యక్రమాలకు హాజరయ్యేవారు. వీరితో పాటు తన కూతుళ్లను కూడా శ్రీదేవి వెంటబెట్టుకుని వెళ్లేది.

పిల్లలంటే ఇష్టం..
అలనాటి తార శ్రీ దేవికి పిల్లలంటే ఎంతగానో ఇష్టం. తల్లి తోడుగా లేకపోతే తన జీవితమే లేదు. తల్లి కాకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు అని శ్రీదేవి చెప్పేవారట.

జాన్వీ అంటే ఇష్టమట..
తన పిల్లలు ఇద్దరిలోనూ జాన్వీ అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. ఖుషి చాలా బలమైనది. కానీ జాన్వీ మాత్రం తనలాగే ఎంతో సున్నిత మనస్కురాలు అని శ్రీదేవి చెబుతుండేదట. ఆమెను అన్ని వేళలా కాపాడేందుకు ప్రయత్నం చేసేదట. పిల్లలకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండేందుకు ఎక్కువ ఇష్టపడే వారట.



Click it and Unblock the Notifications