For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బతకడానికి బడిపంతులు కాదు.. బతికించడానికే బడిపంతులు..

|

ఓనమాలు దిద్దిస్తున్నపుడు తెలియలేదు..

మన జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని..

మనపై కోపగించుకున్నప్పుడు తెలియలేదు..

మనపై బాధ్యతను పెంచుతున్నారని..

మనల్ని బెత్తంతో బాదినప్పుడు తెలియలేదు..

మన చేతికి పదును పెడుతున్నారని..

మనల్ని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు..

ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని..

పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు

మన ఆత్మ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని..

మార్కులు ఇస్తున్నపుడు తెలియలేదు..

మనలో సామర్థ్యం పెంచుతున్నారని..

ఈ క్షణమే తెలుస్తోంది మనలో..

ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని..

ఒక మహాశక్తిగా మనల్ని తయారు చేశారని..

కాలం కాస్త వెనక్కి వెళితే..

మీతో మళ్లీ మళ్లీ దెబ్బలు తింటాం..

మీ ప్రేమానురాగాలకు పాత్రులవుతాం

ప్రతి సంవత్సరం మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే జరుపుకుంటాం. ఎందుకంటే ఆరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. అయితే ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5వ తేదీన జరుపుకుంటారు. మరి మన దేశంలో సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎందుకు జరుపుకుంటారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తమిళనాడు రాష్ట్రానికి చెందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశానికి తొలి ఉపరాష్ట్రపతి అని చాలా మందికి తెలుసు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి అయిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ పదవులను అధిరోహించే ముందు ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఒక విద్యావేత్త. అంతేకాదు గొప్ప ఫిలాసఫర్, మానవతావాది ఆ యన 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడు రాష్ట్రం తిరుత్తణిలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వారు పూర్వీకులది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సర్వేపల్లి. అందుకే ఆయన ఇంటిపేరు సర్వేపల్లిగా మారింది.

సర్వేపల్లి రాధాకృష్ణన్ సనాతన భారతంలో పరమార్థ విషయాలను ప్రపంచానికి సులభవంగా, స్పష్టంగా చెప్పేవారు. ఆధునిక సమాజానికి గురువు ఎలా ఉండాలనే విషయాన్ని తన స్వీయ చరిత్రలో స్పష్టంగా వివరించారు. ''బడి పంతులు బతకడానికి కాదు.. బతికించడానికే బడి పంతులు'' అని సూటిగా స్పష్టంగా చెప్పారు. గురువుకు ఉండాల్సిన లక్షణాలను మన పురాణాల్లోను వివరించారు. గురుశిష్యుల సంబంధాలకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు-అర్జునుడు, చాణుక్యుడు-చంద్రగుప్త మౌర్యుడు, సమర్థ రామదాసు-ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస-వివేకానంద స్వామిలతో పాటు మరెందరో గురుశిష్యుల సంబంధానికి ప్రతీకగా నిలిచారు.

రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసులోనే శివకామును వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కుమారుడి పేరు సర్వేపల్లి గోపాల్. సర్వేపల్లి మద్రాస్ యూనివర్సిటీ నుండి ఫిలాసఫీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాల్లో పాఠాలు బోధించారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీతో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీలో వైస్ ఛాన్స్ లర్ గా సేవలు అందించారు. అనంతరం ఆయన ప్రాముఖ్యతను గుర్తించిన ఆక్స్ ఫర్డ్ ప్రాచ్య మతాల అంశంపై బోధించేందుకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రాధాకృష్ణన్ ను ఆహ్వానించింది. సర్వేపల్లి గొప్ప పండితుడు. అందుకే ఆయన 16 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. 1931లోనే ఆయనకు భారతరత్న అవార్డు వచ్చింది. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని మన దేశ జాతిపిత అయిన మహాత్మ గాంధీ చెప్పారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1962 వరకు తొలి ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. అనంతరం 1962 నుండి 1967 వరకు రాష్ట్రపతిగా సేవలందించారు. అంతేకాదు సర్వేపల్లి మన దేశానికి రెండో రాష్ట్రపతి. ఒక ఉపాధ్యాయుడు దేశ అత్యున్నత పదవిని అధిరోహించడం ఆ వృత్తికే గర్వకారణం. అందుకే 1962వ సంవత్సరం నుంచి ఆయన పుట్టిరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ మారిపోయింది. నిజం చెప్పాలంటే సర్వేపల్లికి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఇష్టం లేదు. అందుకే తన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కోరారు. సమాజానికి సేవలు చేస్తున్న టీచర్లందరికీ ఇది గౌరవంగా ఉంటుందని ఆయన భావించారు.

సర్వేపల్లి అన్నా, ఆయన బోధనలన్నా విద్యార్థులకు ఎంతో ఇష్టం. విద్యార్థులకు ఏ సమయంలో ఎలాంటి సాయం కావాలన్నా సాయం చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. అందుకే టీచర్స్ డేని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అంతేకాదు ఈ ప్రత్యేకమైన రోజున విద్యార్థులు తమ టీచర్లపై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేస్తూ బహుమతులను కూడా అందజేస్తుంటారు.

English summary

Teachers day 2019; significance and importance and facts

Most people know that Dr. Sarvepalli Radhakrishnan of Tamil Nadu is the first Vice President of our country. Then he became the President of India. He was a teacher before he took up those positions. An educator. He was born on the 5th of September, 1888, in the Telugu Brahmin family of the Tamil Nadu State of Thiruthani. They are the ancestors of the present Nellore district of Andhra Pradesh.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more