For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిరు హీరోయిన్ బర్త్ డే : సెకండ్ ఇన్సింగ్స్ లోనూ సక్సెస్ ఫుల్ గా...

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషలతో పాటు వివిధ చిత్రాల్లో ఆమె నటించింది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనే తెగ సందడి చేసింది

|

ఆమె 1990వ దశకంలో టాలీవుడ్ లోని అగ్ర హీరోలతో పాటు చాలా మంది యంగ్ హీరోలతో కలిసి నటించింది. అంతేకాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ ఒక్క ఊపు ఊపింది. అప్పట్లో రిషిబాల నావల్ సినిమా వస్తోందంటే చాలు.. సినిమా థియేటర్లలో టికెట్ల జాతర. అంతలా అదరగొట్టిన రిషిబాల నావల్ అంటే ఎవరనుకుంటున్నారా అనే అనుమానం సినీ ప్రేక్షకులకు రావచ్చు.

Unknown facts about Actress Simran

ఆ పేరు గల హీరోయిన్ ఎవరూ లేరని కూడా కొంత వాదించొచ్చు. అయితే ఆమె నటన కోసం కళ్లు కాయలు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రిషిబాల నావల్ ఎవరు అనుకుంటున్నారా? ఎవరో మనందరికీ తెలిసిన సిమ్రాన్. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఉర్దూ భాషలతో పాటు వివిధ చిత్రాల్లో ఆమె నటించింది. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపైనే తెగ సందడి చేసింది ఈ భామ. మల్టీ టాలెంటెడ్ అయిన ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు ఏప్రిల్ 4వ తేదీ. ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

సిమ్రాన్ జననం..

సిమ్రాన్ జననం..

సిమ్రాన్ అసలు పేరు రిషిబాల నావల్. ఈమె 1976లో ఏప్రిల్ 4వ తేదీన అశోక్ నావల్, శారదా నవల్ దంపతులకు జన్మించింది. అయితే ఈమెది పంజాబీ. ఈమెకు ఇద్దరు సోదరీమణులు మోనాల్, జ్యోతి నావల్ తో పాటు ఓ సోదరుడు సుమిత్ కూడా ఉన్నారు.

సిమ్రాన్ విద్యాభ్యాసం..

సిమ్రాన్ విద్యాభ్యాసం..

సెయింట్ ఆంథోనీ హైస్కూల్ లో చదివిన సిమ్రాన్ ముంబైలో డిగ్రీలో బీకామ్ పూర్తి చేసంది. తనకు పంజాబీతో పాటు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ భాషల్లో కూడా మంచి పట్టు ఉంది. వ్యక్తిగతంగా సిమ్రాన్ కు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆమె భరత నాట్యంలోనూ, ఆధునిక సల్సా డ్యాన్సులో శిక్షణ పొందింది.

చిన్ననాటి స్నేహితుడితో వివాహం..

చిన్ననాటి స్నేహితుడితో వివాహం..

తన సినిమా కెరీర్ ఓ మాంచి రేంజ్ లో ఉన్న సమయంలోనే 2003 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడన దీపక్ బగ్గాని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వెండి తెరకు కొంత విరామం ప్రకటించింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఆదిత్, అదీప్ ఉన్నారు.

మోడలింగ్ అంటే మక్కువ..

మోడలింగ్ అంటే మక్కువ..

సిమ్రాన్ కు డ్యాన్స్ తో పాటు మోడలింగ్ అంటే ఎంతో ఇష్టమట. ఈమె కాలేజీలో చదువుకునే సమయంలోనే ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఎన్నో కలల్ని కనిందట. వాటిని నిజం చేసుకుంటూ సినీ తారగా తళుక్కున మెరిసింది.

1995లో సినిమా ఎంట్రీ..

1995లో సినిమా ఎంట్రీ..

1995లో బాలీవుడ్ లో అడుగు పెట్టింది సిమ్రాన్. అయితే తన తొలి సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె కొన్ని హిందీ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. అయితే అదే సమయంలో బుల్లితెరపై సూపర్ హిట్ ముఖబ్లా షోకి యాంకర్ గా వ్యవహరించింది.

ఆ సినిమాతో తెలుగులోకి..

ఆ సినిమాతో తెలుగులోకి..

సిమ్రాన్ దక్షిణాదిన తొలుత కేరళలో అడుగు పెట్టింది. ‘ఇంద్రప్రస్థం‘ అనే సినిమా ద్వారా పరిచయమైంది. అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ ‘అబ్బాయి గారి పెళ్లి‘తో టాలీవుడ్ లో సైతం అడుగు పెట్టింది. ఆ తర్వాత సిమ్రాన్ వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు టాలీవుడ్ ను వదులుకోవడానికి ఏ హీరోయిన్ అంతగా ఇష్టపడరు. అవకాశాలు వస్తే అలా దూసుకెళ్తారు. ఇందుకు సిమ్రాన్ మినహాయింపు కాదు.

అగ్ర హీరోలందరితో..

అగ్ర హీరోలందరితో..

తనకు తెలుగులో వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. టాలీవుడ్ లోని అగ్ర కథనాయకులతో నటించి అందరినీ మెప్పించింది. బాలక్రిష్ణ తో ‘సమరసింహారెడ్డి‘లో నటించిన ఈమెకు తెలుగులో ఒక్కసారిగా స్టార్ డమ్ వచ్చి పడింది. ఆ తర్వాత చిరంజీవితో అన్నయ్య, డాడీతో పాటు నాగార్జునతో ‘నువ్వు వస్తావని‘ ‘బావ నచ్చాడు‘ వెంకటేష్, మహేష్ బాబుతో పాటు ఇంకా ఎందరో హీరలో ప్రేమ వంటి సినిమాల్లో నటించింది.

వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా..

వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా..

సిమ్రాన్ కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను చక్కగా వినియోగించుకుంది. తను సినిమాల్లో ఓ రేంజ్ లో ఉన్నప్పుడు కొన్ని వాణిజ్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించింది. ముఖ్యంగా కొన్ని కూల్ డ్రింక్స్ కు, సబ్బులకు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించింది.

సెకండ్ ఇన్సింగ్స్..

సెకండ్ ఇన్సింగ్స్..

సిమ్రాన్ చాలా కాలం విరామం తర్వాత గత ఏడాది రజనీకాంత్ తో కలిసి వెండి తెరపై మరోసారి అడుగుపెట్టింది. ఇందులోనూ ఈమె నటకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పటికీ ఆమె 40 ఏళ్ల వయసు ఉన్న ఆమె కనిపించడం లేదు.

ఎన్నో అవార్డులు..

ఎన్నో అవార్డులు..

సిమ్రాన్ చిత్ర రంగంలో చేసిన సేవకు గుర్తింపు ఆమెకు అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులు లభించాయి. ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.

ముందుగా సిమ్రాన్ బగ్గాకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

English summary

Unknown facts about Actress Simran Bagga

Here we talking about unknown facts about actress simran bagga. Read on
Story first published:Saturday, April 4, 2020, 18:42 [IST]
Desktop Bottom Promotion