Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Women's Day 2023: మహిళా సీనియర్ న్యాయవాదుల సంఖ్య మరీ ఇంత తక్కువా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
దేశంలోని సీనియర్ న్యాయవాదుల హోదాకు సంబంధించి గణాంకాలను బార్ అండ్ బెంచ్ సేకరించింది. సీనియర్ అడ్వొకేట్ అనే హోదా కలిగిన మహిళల సంఖ్య ఎంత తీసికట్టుగా ఉందో ఈ స్టాటిస్టిక్స్ చెబుతున్నారు.
మహిళల అభ్యున్నతి, అభివృద్ధి గురించి మాట్లాడే ప్రతీసారి ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అనేక రంగాల్లో మహిళల భాగస్వామ్యం మరీ అద్వానంగా ఉంటోంది. అందులో న్యాయరంగం కూడా ఉండటం మహిళలకు అవకాశాలు లేకపోవడం, కట్టుబాట్లు అడ్డుపడటం ఎలా ఉందో అద్దం పడుతోంది.

న్యాయవాద వృత్తి భవిష్యత్తు మహిళలదేనని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇటీవల వ్యాఖ్యానించారు. కానీ వాస్తవం మాత్రం మరోలా కనిపిస్తోంది. దేశంలోని సీనియర్ న్యాయవాదుల హోదాకు సంబంధించి గణాంకాలను బార్ అండ్ బెంచ్ సేకరించింది. సీనియర్ అడ్వొకేట్ అనే హోదా కలిగిన మహిళల సంఖ్య ఎంత తీసికట్టుగా ఉందో ఈ స్టాటిస్టిక్స్ చెబుతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసిన వ్యాఖ్యలు సుదూర స్వప్నంగా ఉన్నట్లు ఈ డేటా చెబుతోంది.
అద్వానంగా మహిళా సీనియర్ అడ్వొకేట్ల సంఖ్య:
దేశంలో సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో 3,149 మంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు. అందులో కేవలం 3.4 శాతం లేదా 106 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ డేటాను హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల వెబ్ సైట్ లు, బార్ డైరెక్టరీలతో సహా వివిధ అధికారిక వనరుల ద్వారా సేకరించింది బార్ అండ్ బెంచ్.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 19 మంది మాత్రమే:
సుప్రీం కోర్టు ఇప్పటి వరకు 488 మంది న్యాయవాదులకు సీనియర్ హోదాను ఇచ్చింది. అందులో కేవలం 19 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 1950 లో సుప్రీం కోర్టు ప్రారంభమైంది. అప్పటి నుండి 2013 వరకు కేవలం నలుగురు మహిళలకు మాత్రమే సీనియర్ అడ్వొకేట్ హోదా ఇచ్చింది సుప్రీం కోర్టు. గత 9 ఏళ్లలో 15 మంది మహిళలు సీనియర్ అడ్వొకేట్లుగా గౌను ప్రదానం చేశాయి దేశ అత్యున్నత న్యాయస్థానాలు.
కలకత్తా, బొంబాయి, మద్రాసు లాంటి చార్టర్డ్ హైకోర్టుల్లో కూడా మహిళా సీనియర్ న్యాయవాదుల సంఖ్య తీసికట్టుగానే ఉంది. కలకత్తా హైకోర్టు మొత్తం 422 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ హోదా ఇవ్వగా.. అందులో కేవలం నలుగురు మాత్రమే మహిళలు ఉన్నారు.
రాం జెఠ్మలానీ, ఫాలీ నారిమన్, సోలీ సొరాబ్జీ వంటి దిగ్గజాలకు సీనియర్ హోదాను ప్రదానం చేసిన బాంబే హైకోర్టులో కేవలం 8 మంది మాత్రమే మహిళా సీనియర్ న్యాయవాదులు ఉండటం గమనార్హం. అందులో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఇప్పటికీ ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు.
మద్రాసు హైకోర్టులో మొత్తం 299 మంది సీనియర్ న్యాయవాదులకు కేవలం 10 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.
దక్షిణాది హైకోర్టుల్లో ఇదీ పరిస్థితి:
కేరళ హైకోర్టు 67 మందికి సీనియర్ హోదా కల్పించగా అందులో మహిళలు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. కర్ణాటక హైకోర్టులో 122 మందికి సీనియర్ అడ్వొకేట్ హోదా రాగా.. అందులో కేవలం ఆరుగురు మాత్రమే ఉండటం గమనార్హం. తెలంగాణ హైకోర్టు ఇప్పటి వరకు 68 మందికి సీనియర్ హోదా ఇచ్చింది. అందులో మహిళలు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో 44 మంది పురుషులు ఉండగా.. ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు.
కేరళ హైకోర్టు: పురుషులు-67, మహిళలు-2
కర్ణాటక హైకోర్టు: పురుషులు-122, మహిళలు-6
తెలంగాణ హైకోర్టు: పురుషులు-68, మహిళలు-4
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: పురుషులు-44, మహిళలు-3
జస్టిస్ ఇందిరా బెనర్జీ, సుప్రీంకోర్టు మాజీ జడ్జీ:
పితృస్వామ్య మనస్తత్వం ఉంది అది అంగీకరించాల్సిన వాస్తవం. మహిళలు ఎలా ప్రవర్తించాలి, ఎలా పనిచేయాలన్న సాంప్రదాయ ఆలోచనలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి వారు మహిళలు ఎప్పుడూ మర్యాదగా ఉండాలని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ మర్యాదపూర్వకంగా మెలగాలి.
జస్టిస్ సుజాతా మనోహర్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి:
నేడు చాలా కోర్టుల్లో మహిళా న్యాయవాదులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కొంతమందికి కొన్ని నిర్దిష్ట చట్టాల్లో స్పెషలైజేషన్ కూడా ఉంది. మహిళా న్యాయవాదులపై ఉన్న పక్షపాతం నెమ్మదిగా తొలగిపోతున్నట్లు ఇదే చెబుతోంది.
జస్టిస్ మృదులా భట్కర్, బాంబే హైకోర్టు మాజీ జడ్జి:
పితృస్వామ్యం పూర్తిగా లేదని నేను అనడం లేదు. కానీ దానితో పోరాడాల్సిన అవసరం మాత్రం ఉంది. మహిళ ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు తను ఏదో ఒక రకంగా పితృస్వామ్యాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. స్త్రీలపై వివక్ష పూరిత వ్యాఖ్యలు చేయడం, వారు ఎదగకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడం లాంటి వాటిపై మహిళలు పోరాడాలి.



Click it and Unblock the Notifications