Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
World Earth Day 2022 : భూమి తిరగడం అకస్మాత్తుగా ఆగిపోతే?
ప్రస్తుతం భూమి పరిరక్షణ గురించి పట్టించుకోకుండా, మనం ఏమీ నేర్చుకోకపోతే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
భూమి తన చుట్టూ తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తిరగడం ఆపదని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే మనలో చాలా మందికి అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన సందేహాలు తలెత్తుతుంటాయి.

ఎప్పుడూ తన చుట్టూ తాను తిరిగే భూమి అకస్మాత్తుగా ఆగిపోతే ఏమవుతుంది? ఆ సమయంలో జీవకోటి రాశికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? అనే ప్రశ్నలెన్నో మన మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలన్నింటికీ ధరిత్రీ దినోత్సవం (ఎర్త్ డే) సందర్భంగా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1970 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి (UNO)తీర్మానం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్ డే జరుపుకుంటున్నాం.

భూమి ఒక కక్ష్యలో తిరగడం గురించి కాలం మారే కొద్దీ మనకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండిపెండేట్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు నాసా వంటి పరిశోధనా సంస్థలు భూమి అకస్మాత్తుగా తిరగడం ఆపివేస్తే ఏమవుతుందో తెలిపే ప్రయత్నం చేశాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

తన చుట్టూ తిరిగేందుకు...
భూమి ఎల్లప్పుడూ ఒంపులు ఒంపులుగా తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకనే మనకు గురుత్వాకర్షణ అనేది కచ్చితంగా ఉంటుందట. సాధారణంగా భూమి తన చుట్టూ తాను తిరగడానికి సుమారు 24 గంటలు పడుతుంది. వీటి వల్లనే మనకు రాత్రి మరియు పగలు అనేవి ఏర్పడతాయట.

రాత్రి, పగలు ఉండవట..
భూమి తిరగడం అనేది అకస్మాత్తుగా ఆగిపోతే అతి పెద్ద వినాశనం జరుగుతుందట. రాత్రి, పగలు అనే తేడా ఎప్పటికీ ఉండదట. ఈ సందర్భంలో కొన్ని దేశాలు ఎప్పటికీ సూర్యుడినే చూడాల్సి వస్తుందట. అదే సమయంలో మరి కొన్ని దేశాలు కేవలం చీకట్లోనే ఉండిపోతాయట. ఎందుకంటే రాత్రి, పగలు అనేవి ఏర్పడటానికి భూమి తిరగడంపైనే ఆధారపడి ఉంటుందట.

కాలాల ప్రక్రియ
అదే విధంగా భూమి తిరగడం గనుక ఆగిపోతే ప్రస్తుతం ఉన్న మాదిరిగా కాలాల ప్రక్రియ కూడా ఉంటుందట. శీతాకాలం, వేసవి కాలం, వర్షకాలం అనేవి అస్సలు ఉండవట. ఇవి విశ్వంపై చాలా దుష్ప్రభావాలను చూపుతాయట.

భయంకరమైన వేడి...
భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాలన్నీ అతి భయంకరమైన వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందట. అదే విధంగా భూమధ్య రేఖకు దూరంగా ఉండే దేశాలన్నీ అత్యంత భయంకరమైన చలికి గజగజ వణికిపోతాయట.

అయస్కాంతక్షేత్రం నాశనం..
ఇంకో విషయం ఏమిటంటే భూమి తిరగడం ఆగిపోతే గనుక అయస్కాంత క్షేత్రం నాశనమైపోతుందట. అలాగే భయంకరమైన రేడియేషన్ వెలువడుతుందట. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రపంచ వినాశనం జరుగుతుందట.

కరోనా నెగిటివ్ వచ్చినా?
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో అంతరించిపోయినా, అనేక దేశాల్లో లాక్ డౌన్ ఎత్తివేసినా? అందరి జీవితాలు సజావుగా సాగుతాయని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మనం ఏమీ నేర్చుకోనట్టేనని లియత్ ఓలెనిక్, అలెజాండ్రో దాల్ బాన్ అంటున్నారు.

భవిష్యత్తు ఏమిటో?
సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ వార్మింగ్ ను నిరాకరిస్తూ, పర్యావరణ హిత చట్టాలన్నీ బలహీనపడేలా వ్యవహరిస్తున్నాడని, ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు, సునామీ బీభత్సాల తర్వాత ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎందరో ప్రాణాలను తీసేసింది. అంతేకాదు కోట్లాది మంది జీవనోపాధిని కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో మన భవిష్యత్తు ఏమిటో ప్రశ్నించుకోవాలంటున్నాడు లియత్.

తమ వంతు ప్రయత్నం..
అందుకే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్ి పర్యావరణానికి మేలు జరిగేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని, తమ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు మేలు చేస్తామని, సరిగ్గా 50 ఏళ్ల క్రితం ఇదే కారణంతో సుమారు 2 కోట్ల మంది వీధుల్లోకి నిరసన చేశారని గుర్తు చేశారు. అందుకే మనం కరోనా బారి నుండి కాపాడుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమై ఉన్నాం. ఇదే నిబద్ధతతో ఈ భూగోళాన్ని కాపాడుకోవడానికి ఇంటి నుండే మన వంతు ప్రయత్నం చేద్దాం.



Click it and Unblock the Notifications