Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
World Elephant day 2021 : ఏనుగుల సంరక్షణ మనందరి బాధ్యత...
ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఏనుగుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ప్రతి సంవత్సరం ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం(World Elephants Day) జరుపుకుంటారు. థాయిలాండ్ లోని 'ఎలిఫ్యాంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్' దీన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏనుగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని.. ఏనుగుల సంరక్షణకు మనమందరూ పాటుపడాలనేదే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ నేపథ్యంలో మన తెలుగు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఏనుగుల సంరక్షణకు తాను బాధ్యత వహిస్తానంటు ముందుకొచ్చింది. చెప్పడమే కాదు.. ఏకంగా ఒక ఏనుగును కూడా దత్తత తీసుకుంది.

దాని ఆలనపాలన చూసుకునేందుకు ఆర్థికంగా ఎంత ఖర్చయినా తానే భరిస్తానంటూ చెప్పింది. వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యతగా భావించాలని ఉపాసన చెప్పారు. జంతువులను దత్తత తీసుకోవడానికి చాలా మంది ముందుకు రావాలని కోరారు. దీంతో ఆమెను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా ఏనుగులు ఎలాంటి సేవలు చేస్తాయి.. వాటి వల్ల మనకు ఏమిటి ప్రయోజనాలనే విషయాలతో పాటు గజరాజుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

జంతు ప్రేమికుల ఆందోళన..
ఏనుగులను ఎక్కడికైనా దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే ట్రక్కులో తరలిస్తారు. ఆ సమయాల్లో అవి ఎంతటి వేడిని అయినా తట్టుకుని నిలబడటానికి చాలా ఇబ్బంది పడతాయి. సహజంగా ఏనుగు ఆకలిని తట్టుకోలేదు. భారీ శరీరం కావడంతో దానికి నీళ్లు ఎక్కువ కావాలి. చల్లటి గాలి కూడా తగలాలి. టూరిజం, మతం పేరుతో ఏనుగుల్ని ఈరకంగా హింసించకూడదని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏనుగులను అద్దెకు..
మన దేశంలో ఎక్కడైనా దేవాలయాల్లో జరిగే కొన్ని ఉత్సవాలకు ఏనుగులను సొంతంగా సంరక్షించలేక అద్దెకు తెచ్చుకుంటారు. అయితే అద్దెకు తెచ్చుకున్నప్పుడు ఆదాయం సంగతి ఎలా ఉన్నా.. ఆ సమయంలో అవి మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూస్తాయి. ర్యాలీలు, ఉత్సవాలు, లౌడ్ స్పీకర్లతో చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తారు. మరో పక్క టపాసులు కాలుస్తారు. దీంతో ఏనుగులు ఒక్కోసారి విసుగు చెంది మావటిల అదుపు తప్పుతాయి. అంతేకాకుండా వాటిని దగ్గరి ఊళ్లకు తారు రోడ్లపైనే తీసుకెళ్తారు.

ఏనుగులతో ఆ పనులు..
మన దేశంలో కేరళ, అస్సాం రాష్ట్రాలలో ఏనుగులు ఎక్కువగా ఉన్నాయి. కేరళలో ఏనుగులను ఎక్కువగా మచ్చిక చేసుకుని, వాటి ద్వారా అనేక పనులు చేయించుకుంటున్నారు. ఆలయ ఊరేగింపులు మాత్రమే కాకుండా, మసీదులు, చర్చిల్లో జరిగే వేడుకల్లోనూ ఏనుగులు పాల్గొంటున్నాయి. కేరళ వంటి రాష్ట్రంలో అయితే టింబర్ యార్డుల్లో ఏనుగులతో దుంగలు మోయిస్తుంటారు.

ఏనుగులకు పోషణ..
ఏనుగులుకు సంబంధించిన ఏదైనా ఆనందించదగ్గ విషయం ఉందంటే వాటి పోషణను కొన్ని దేవాలయాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నాయి. తిరుపతితో పాటు శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లో ఏనుగుల్ని పోషిస్తారు. హిందువులే కాకుండా అనేక దేశాల్లోని బౌద్ధులు సైతం ఏనుగును అతి పవిత్రంగా భావిస్తారు. అందుకే వారి దేవాలయాలకు, ఇళ్ల ముందు గజరాజుల విగ్రహాలు లేదా నిర్మాణాలు కనిపిస్తుంటాయి.

గజరాజులకు హింస..
దేవుడి సేవలో ఉండే ఏనుగులను మావటీలు బాగా హింసిస్తారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏనుగుకు ఇద్దరు మావటీలు ఉంటారు. వీళ్లలో దాదాపు 60 శాతం మంది తాగుబోతులే.. ఏనుగుల్ని మచ్చిక చేసుకోవడం కోసం వాళ్ల దగ్గరుండే అంకుశాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతుంటారని అనిమల్ వెల్ఫేర్ బోర్డు ఓ నివేదికలో వెల్లడించింది.

ఏనుగులకు సమస్యలు..
మానవుల మాదిరిగానే ఏనుగులకు కూడా 20 నుండి 40 ఏళ్ల వయసు వరకు చాలా బలంగా ఉంటాయి. ఈ సమయంలో ఏనుగులతో విపరీతంగా పని చేయించడం, ఇష్టమొచ్చినట్లు తిప్పడం, విశ్రాంతి ఇవ్వకుండా గంటలకొద్దీ నిలబెట్టి వాయిద్యాల హోరుతో ఉత్సవాలు జరపడం చేస్తుంటారు. దీని వల్ల అవి అనారోగ్యానికి గురవ్వడమే కాదు.. ఒత్తిడికి గురవుతాయి. దీంతో అవి పేగు సంబంధిత వ్యాధులకు గురై, చిన్న వయసులోనే చనిపోతున్నాయి.



Click it and Unblock the Notifications