Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
Hyderabadi: హైదరాబాదీలు ఎక్కువగా ఆర్డర్ చేసేది ఇవే.. టాప్ బిర్యానీ కాదు!
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ భోజన ప్రియులే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎదో ఒకటి తింటూనే ఉంటారు. టిఫిన్స్, బిర్యానీలు తెగ లాగించేస్తారు. కుదిరితే ఇంట్లో వండుకొని తింటారు. అదే కుదరకపోతే ఆర్డర్ పెట్టుకుంటారు. అయితే 2024లో మన హైదరాబాదీలు ఎక్కువగా ఏం తిన్నారు? ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారు అనే లిస్ట్‌ను స్విగ్గి విడుదల చేసింది. దాని గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఉదయం ఉల్లి దోశ
మన హైదరాబాద్ వాసులు బిర్యానీలు మాత్రమే కాదు టిఫిన్స్ కూడా తెగ ఆర్డర్ చేస్తున్నారని స్విగ్గి వెల్లడించింది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా ఉల్లి దోశను మాత్రమే ఇష్టపడుతున్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉదయం పూట ఎక్కువగా దోశలు ఆర్డర్ చేసింది కూడా హైదరాబాద్ వాసులే అని వెల్లడించింది. హైదరాబాద్ వాసులకు ఎక్కువగా దోశ ఇస్తామని దీని ప్రకారం వెల్లడైంది. మరి మీరు కూడా దోశ ఆర్డర్ చేశారా?

బిర్యానీలు
హైదరాబాద్ అంటే బిర్యాని, బిర్యానీ అంటేనే హైదరాబాద్ అని చెప్తుంటాము. అందుకు తగ్గట్టుగానే హైదరాబాద్ వాసులు బిర్యానీలను కూడా అమితంగా ఆర్డర్ చేసేస్తున్నారు. కేవలం 2024లోనే కోటి యాభై లక్షలకు పైగా బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గి వెల్లడించింది. అందులో కేవలం చికెన్ బిర్యానీ మాత్రమే కాదు.. పనీర్ బిర్యాని, వెజ్ బిర్యాని, రొయ్యల బిర్యాని, ఎగ్ బిర్యానీ, పుట్టగొడుగుల బిర్యానీ, గుడ్డు బిర్యాని కూడా ఉంది.
హైదరాబాద్ వాసులు ప్రతీ నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నట్లు స్విగ్గి వెల్లడించింది. మనం దేశంలో నిమిషం నిమిషానికి ఇంతలా బిర్యాని ఆర్డర్ చేసే నగరం మరేదీ లేదని వెల్లడించింది. హైదరాబాదీలకు బిర్యాని అంటే ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అలాగే టీ20 వరల్డ్ కప్ సమయంలో అత్యధికంగా ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు పేర్కొంది. ఇదే ఆల్ టైం హైయెస్ట్ అని చెప్పుకొచ్చింది.
పిజ్జాలు కూడా..
హైదరాబాద్ వాసులు కేవలం ఉల్లి దోశ, బిర్యానీలు మాత్రమే కాదు పిజ్జాలు కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారు. 2023తో పోలిస్తే 2024లో పిజ్జాలు ఎక్కువగా ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది. అలాగే స్వీట్స్ కూడా ఎక్కువగా కొనుక్కున్నట్లు చెప్పుకొచ్చింది. స్వీట్స్ ఎక్కువగా డబల్ కా మీఠా ఆర్డర్ చేశారని తెలిపింది. మొత్తం రెండు లక్షలకు పైగా స్వీట్స్‌కు సంబంధించిన ఆర్డర్స్ వస్తే అందులో ఎక్కువగా డబల్ కా మీఠా ఉందని తెలిపింది. అలాగే మదర్స్ డే రోజున ఎక్కువగా కేక్‌లు ఆర్డర్ చేశారని, ఆరోజు ప్రతి నిమిషానికి 5 కేక్‌లు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.



Click it and Unblock the Notifications