Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2024లో జైలుకు వెళ్లిన టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు వీళ్ళే!
ఇంకో కొన్ని రోజుల్లో 2025 వచ్చేస్తుంది. ఈ సమయంలో చాలా మంది 2024లో జరిగిన వింతలు, మంచి విశేషాలు, సంఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఇండియా వరల్డ్ కప్ సాధించడం నుంచి మోదీ మూడోసారి ప్రధాన మంత్రి అయ్యేంత వరకు చాలానే జరిగాయి ఈ ఏడాది. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఘటనలు, సంఘటనలు చోటు చేసుకున్నాయి.
సాధారణ వ్యక్తి నుంచి సెలెబ్రిటీల వరకు అందరికీ ఈ 2024 గుర్తుండిపోయే సంవత్సరమవుతుంది. ఎంతోమంది సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. అలాగే చాలామంది సినిమా సెలెబ్రిటీలు వివిధ కేసుల్లో ఇరుక్కొని జైలుకెళ్లి వచ్చారు. ఇంతకీ 2024లో ఏ ఏ సెలెబ్రిటీలు కేసుల్లో ఇరుక్కున్నారు? దానికి కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రాజ్ తరుణ్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ ఏడాది మొదట్లో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై లైంగిక ఆరోపణలు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. రాజ్ తరుణ్ తనను లైంగికంగా వాడుకొని పెళ్లి చేసుకోవడం లేదని, పదకొండు సంవత్సరాల పాటు తాము ప్రేమలో ఉన్నామని, ఈ మధ్య వేరే నటితో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోతున్నాడని చెప్పి షాకిచ్చింది. దీంతో రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది.
జానీ మాస్టర్
అటు ఇదే సంవత్సరం ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా కేసుల్లో చిక్కుకున్నారు. తన వద్ద పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వాడుకున్నారని, తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని సదరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అవడంతో పాటు కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు.
రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సంవత్సరం కేసుల్లో చిక్కుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో పాటు, అసభ్యకరమైన సినిమాలు తెరకెక్కించారని ఫిర్యాదు అందాయి. ఈ మేరకు పలువురు టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆయనను విచారణకు హాజరుకావాలని నోటీసులు కూడా ఇచ్చారు.
మోహన్ బాబు కుటుంబం
ఈ ఏడాది చివర్లో ఇండస్ట్రీ నుంచి కేసుల్లో చిక్కుకున్న కుటుంబం మంచు కుటుంబం. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవల కారణంగా.. మనోజ్‌తో పాటు మోహన్ బాబు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తమకు ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.



Click it and Unblock the Notifications