Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
చిన్నారికి Z+ సెక్యూరిటీ!.. వైరల్ అవుతున్న హార్ట్ టచ్చింగ్ వీడియో..చూస్తే మాత్రం..
సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని మాత్రమే హృదయానికి హత్తుకునేలా ఉండి, తెలియని ఓ అనుభూతిని పంచుతాయి. అలాంటి ఓ వీడియోనే ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. వీధి కుక్కలతో రోడ్డపై ఓ చిన్నారి ఆడుకుంటున్న హార్ట్ టచ్చింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో.. ఆ పసిదానికి, వీధి శునకాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహాన్ని, అచంచలమైన నమ్మకాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో..బిజీగా ఉన్న రోడ్లమీద ఓ చిన్నారి వీధి కుక్కలతో కేరింతలు కొడుతూ ఆడుకోవడం, వాటిపై సరదాగా స్వారీ చేయడం, ఆ కుక్కపైనే కూర్చుని ధైర్యంగా రోడ్డు దాటడం వంటి కనిపిస్తోంది. "ఈ సున్నితమైన శునకాలు ఆమెతో ఆడుకుంటాయి, పరుగులు తీస్తాయి. ఆమె వాటికి ఓ చిన్నారి యువరాణిలా ముద్దుగా వాటిపై స్వారీ చేస్తుంది" అనే టైటిల్ తో ఈడియోని @tivvvvy అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేశారు.

"ఆ చిన్నారికి, ఆ శునకాలకు మధ్య ఉన్నది కేవలం స్నేహం కాదు అంతకు మించిన ఓ అందమైన అనుబంధం. అవి కలిసి ఆడుకుంటాయి, ఆనందంతో గంతులేస్తాయి, ఒక్క క్షణం కూడా ఆ చిన్నారిని విడిచిపెట్టవు. ఆ మూగజీవాలు చిన్నారిని తమ సర్వస్వం అన్నట్లుగా స్వచ్ఛమైన ప్రేమతో, కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. వారు కలిసి గడిపే ప్రతి క్షణం నవ్వులతో, నమ్మకంతో, మాటల్లో చెప్పలేని ఆప్యాయతతో నిండి ఉంటుంది" అంటూ షేర్ చేసిన ఈ వీడియోకు భారీగా వ్యూస్,లైక్స్,కామెంట్స్ తో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.
ఓ నెటిజన్..ఆమెను దేవుడు ఎన్నుకున్నాడు, అందరూ దీనికి అర్హులు కాదంటూ కామెంట్ చేశారు. పులి అయినా చిరుత పులి అయినా కూడా ఆ చిన్నారిని తాకలేవని తనకి Z+ భద్రత ఉందంటూ చమత్కరిస్తూ మరో నెటిజన్ ఈ వీడియోకి కామెంట్ చేశారు. ఆ చిన్నారికి ఖరీదైన బొమ్మలు అక్కర్లేదు..తన దగ్గరే నిజమైనవి ఉన్నాయంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.



Click it and Unblock the Notifications