Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
LK Advani: బిగ్ బ్రేకింగ్..అద్వానీకి తీవ్ర అస్వస్థత!
భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడు ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఉదయం ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు. డాక్టర్లు అద్వానీకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని కుటుంబసభ్యులు చెప్తున్నారు.
అయితే అద్వానీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. కాగా,గతంలో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ అద్వానీ హాస్పిటల్ లో చేరిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పాకిస్తాన్ లోని కరాచీలో 1927 నవంబర్ 8న ఎల్ కే అద్వానీ జన్మించారు. 1947లో దేశవిభజన తర్వాత ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. తన 14వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో చేరిన ఎల్ కే అద్వానీ..జాతీయ స్థాయిలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంలో ముఖ్య పాత్ర పోషించారు. 1980 లో భారతీయ జనతా పార్టీ ని స్థాపించిన సమయంలో వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా అద్వానీ ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం లక్ష్యంగా ఆయన చేపట్టిన రథ యాత్ర,తదనంతర పరిణామాలు బీజేపీని 'చాలామందికి దగ్గర చేశాయి.
1984 సార్వత్రిక ఎన్నికలలో కేవలం రెండు స్థానాలు గెలుచుకున్న స్థాయి నుంచి ఇప్పుడు కేంద్రంలో మూడు సార్లు అధికార పక్షంగా ఉండేంతలా బీజేపీ ఎదగడానికి ప్రధాన కారణం అద్వానీ నాయకత్వమే. 2002 నుంచి 2004 వరకు కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో ఉప ప్రధానిగా,హోం మంత్రిగా అద్వానీ పనిచేశారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అద్వానీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది.



Click it and Unblock the Notifications