Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Maha Kumbh: కుంభమేళాలో తీవ్ర విషాదం.. 15 మంది మృతి?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహాకుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈరోజు మౌని అమావాస్య కావడంతో కుంభమేళాలో స్నానం చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో కుంభమేళా వద్ద భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. సెక్టార్ 2లో ఈ తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తుంది. ఈ తొక్కిసలాటలో చాలా మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు 15 మంది మృతి చెంది ఉంటారని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య వెల్లడించనప్పటికీ సుమారు 15 మంది వరకు మృతి చెంది ఉంటారని చెబుతున్నారు. దీంతో పాటు 30 మంది వరకు గాయపడ్డారని, వారి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. మౌని అమావాస్య కారణంగా స్నానం చేసేందుకు ఒక్కసారిగా భక్తులు వచ్చేయడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రధాని మోదీ ఆరా
ఈ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు సహాయక చర్యలు అందించాలని సూచించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా యోగికి ఫోన్ చేసి ఈ ఘటనపై ఆరా తీశారు. దీంతో పాటు సీఎం యోగి కూడా భక్తులకు త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్ద కాకుండా సమీప ప్రాంతాల్లో స్నానాలు చేయాలని సూచించారు.



Click it and Unblock the Notifications