Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
దేవుడు ఉన్నాడురా: 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్తను కుంభమేళాలో కలుసుకున్న మహిళ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. నిత్యం కోట్లాది మంది భక్తులు ప్రయాగరాజ్ లో కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. అయితే కుంభమేళాలో ఎన్నో అద్భుతాలు జరగ్గా తాజాగా జరిగిన ఓ అద్భుతం చాలా హైలెట్ అయింది. 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన తన భర్తను కుంభమేళాలో ఓ మహిళ కలుసుకుంది. ఆ తర్వాత వారి కుటుంబసభ్యులు మొత్తం కుంభమేళాకు చేరుకున్నారు.
అసలేం జరిగింది
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ స్టర్ గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి 1998లో తన భార్య ధన్వదేవి, పిల్లలను వదిలి పాట్నా వెళ్లి ఆ తర్వాత కనబడకుండా పోయాడు. ఆ సమయంలో అతని పెద్ద కొడుకు కమలేష్ వయసు కేవలం రెండు సంవత్సరాలు కాగా, చిన్న కొడుకు విమలేష్ ఇంకా పుట్టలేదు. అప్పటినుంచి అతని కుటుంబం అతని కోసం వెతకని చోటు లేదు. గంగాసాగర్ అదృశ్యం అతని కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా కుంగదీసింది. అతని భార్య ఒంటరిగా ఇద్దరు చిన్న పిల్లల బాధ్యతను మోయవలసి వచ్చింది.

బుధవారం ప్రయాగరాజ్ లో మహాకుంభమేళాకు వచ్చిన వీరి బంధువు ఒకరికి గంగాసాగర్ యాదవ్ అఘోరిగా కనిపించాడు. దీంతో వెంటనే అతను ఫొటో తీసి గంగాసాగర్ కుటుంబసభ్యులకు పంపించాడు. దీంతో తన తమ్ముడు మురళీ యాదవ్, గంగా సాగర్ కుటుంబంతో కలిసి కుంభమేళాకు చేరుకున్నారు.
అఘోరిగా మారిన గంగాసాగర్ నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి ఇతను తన భర్తేనని ధన్వా దేవి గుర్తించింది. అయితే వారితో ఇంటికి వచ్చేందుకు గంగాసాగర్ యాదవ్ నిరాకరించాడు. తనకు ఎవరూ లేరని ఇప్పుడు తాను గంగాసాగర్ యాదవ్ ను కాదని వారణాసికి చెందిన బాబా రాజ్‌కుమార్ సాధువు అని చెప్పుకున్నాడు. ఆయన వెంటనే ఓ సాధ్వి కూడా ఉంది.
ఆ కుటుంబం మాత్రం ఆయన గంగాసాగరే అని పట్టుబట్టింది. అతడి నిజస్వరూపాన్ని నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ధన్వా దేవి,గంగాసాగర్ సోదరుడు డిమాండ్ చేశారు. కుంభమేళా ముగిసే వరకు మేము వేచి ఉంటాము. అవసరమైతే డీఎన్ఏ పరీక్ష కోసం పట్టుబడతామని తెలిపారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా, మరికొందరు ఆయనను గమినిస్తూ అక్కడే ఉన్నారు.



Click it and Unblock the Notifications