Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
రూపాయి పెట్టుబడి పెట్టకుండా..కుంభమేళాలో భారీగా సంపాదిస్తున్న యువకుడు,ఏం చేస్తున్నాడో వీడియో చూడండి
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా ఘనంగా కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా శివరాత్రి వరకు అంటే ఈ నెల 26 వరకు కొనసాగుతుంది. దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు కుంభమేళాకు హాజరై పవిత్ర సంగమంలో పుణ్యస్నానం చేస్తున్నారు.
కుంభమేళా సందర్భంగా మోనాలిసా,సాధువులు,బుషులు సహా అనేకమందికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు, అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మహాకుంభమేళాలో ఓ యువకుడి ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ సలహా మేరకు ఓ యువకుడు కుంభమేళాలో భారీగా సంపాదిస్తున్నాడు. అయితే ఇంతకీ అతడు ఏం చేసి ఇంత సంపాదిస్తున్నాడని ఆలోచిస్తున్నారా?

గర్ల్ ఫ్రెండ్ ఐడియా సూపర్
కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కి వేప పుల్లలు అమ్ముతూ ఓ కుర్రాడు కనిపించాడు. దీంతో అతడు ఒక్క నిమిషం ఆగి ఆ కుర్రాడిని పలకరించాడు. దీంతో ఆ కుర్రాడు చెప్పిన మాటలు విని షాక్ అవడం అతడి వంతైంది. తన గర్ల్ ఫ్రెండ్ సలహా మేరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా వేప చెట్ల నుంచి వందల సంఖ్యలో పుల్లలు తీసుకు వచ్చి కుంభమేళాకు వస్తున్న భక్తులకు వాటిని అమ్ముతూ రోజూ వేల రూపాయలు సంపాదిస్తున్నట్లు ఆ యువకుడు చెప్పాడు. 5 రోజుల్లో 40 వేల రూపాయల వరకు సంపాదించినట్లు చెప్పాడు.
రూపాయి ఖర్చు లేకుండా వేలు సంపాదించడం చాలా సంతోషంగా ఉందని, కుంభమేళా సాగినన్ని రోజులు ఇవే అమ్ముకుంటానంటూ తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడితో పాటు అతడి ప్రేయసిని ప్రశంసిస్తున్నారు.
ఎలాంటి పెట్టుబడి లేకుండా భారీగా సంపాదిస్తున్నావుగా పో నీ పనే బాగుంది బాసూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు చేసేకంటే కుంభమేళాలో వేప పుల్లలు అమ్ముకోవడం చాలా ఉత్తమం అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications