Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
Mahakumbh mela: కుంభమేళాకి వచ్చిన పాకిస్తానీలు..ఏమన్నారంటే..
యూపీ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో పాకిస్తానీలు పాల్గొన్నారు. పాకిస్తాన్ లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన 68 మంది హిందూ యాత్రికుల బృందం గురువారం కుంభమేళాలో పాల్గొని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. తమ పూర్వీకులు అస్థికలు కూడా త్రివేణి సంగమంలో కలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. తమకు కుంభమేళాకు హాజరయ్యేందుకు త్వరితగతిన వీసాలు అందించింనందుకు మోదీ ప్రభుత్వానికి పాక్ హిందూ యాత్రికుల బృందం థ్యాంక్స్ చెప్పింది. పాకిస్తాన్ కు చెందిన భక్తులకు వీసాలను మంజూరు చేయడాన్ని భారత ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆశిస్తున్నట్లు చెప్పారు.
కుంభమేళాలో వివిధ క్యాంప్ లను సందర్శించి ఆథ్యాత్మిక గురువులను కలిసినట్లు పాకిస్తాన్ కు చెందిన గోవింద్ రామ్ మకాజియా మీడియా తెలిపారు. కుంభమేళా ఏర్పాట్లకు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనని ప్రశంసించారు. తాము కుంభమేళాలో పాల్గొంటామని ఎన్నడూ ఊహించలేదన్నారు. తమ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు.

ఈ 68 మంది పాక్ హిందూ యాత్రికుల్లో 50 మంది మొదటిసారిగా కుంభమేళాను సందర్శించారు. భారత్ కు మొదటిసారి వచ్చానని,చాటా గ్రేట్ ఫీలింగ్ ఉందని పాక్ కు చెందిన ప్రియాంక తెలిపారు. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు.మ రో వ్యక్తి మాట్లాడుతూ.. గత కొన్నినెలల నుంచి కుంభమేళా గురించి వింటున్నానని,ఎప్పటికైనా ఇక్కడికి రావాలనే కోరిక ఉండేదని చెప్పారు. తాము ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాకు రాకముందు.. హరిద్వార్‌కు వెళ్లామని చెప్పారు.
దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళాకు హాజరవుతున్నవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క హిందువులే కాకుండా అనేక ఇతర మతాలకు చెందిన వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో కుంభమేళాలకు హాజరవుతుండటం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 33 కోట్లమందికి పైగా భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది.



Click it and Unblock the Notifications
