Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఉద్యోగం వచ్చిన వెంటనే సీనియర్లకు సినిమా చూపిస్తున్న ట్రైనింగ్ లేడీ ఐఏఎస్ పూజా
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై పూణే నుంచి వాషిమ్‌కు బదిలీ అయిన మహారాష్ట్ర ప్రొబేషనరీ (టైనింగ్) ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాస్ కావడానికి నకిలీ వైకల్యం సర్టిఫికెట్ తో పాటు ఇతరుల వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్‌లను సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
రెడ్-బ్లూ బీకాన్ లైట్, వీఐపీ నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ ఆడి కారును వినియోగించినందుకు ఖేడ్కర్‌ను విచారించగా ఆమె ఓబీసీ, దృష్టి లోపం ఉన్న కేటగిరీల కింద సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యిందని, మానసిక రుగ్మత సర్టిఫికెట్ కూడా సమర్పించినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. పూజా ఖేడ్కర్ తన వైకల్య ధృవీకరణ పత్రం పరిశీలన కోసం 2022 ఏప్రిల్ లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి రిపోర్టు చేయవలసిందిగా కోరారు.

అయితే కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా పూజా ఖేడ్కర్ చెకప్‌కు హాజరు కాలేదు. తరువాత ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తీసుకున్న ఎంఆర్ఐ( MRI) స్కానింగ్ సర్టిఫికేట్ అందించారు. తరువాత పూజా ఖేడ్కర్ ఐఏఎస్ నియామకం నిర్ధారణ కొరకు ఆమోదించబడింది.
పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ మాజీ రాష్ట్ర ప్రభుత్వ అధికారి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో దిలీప్ ఖేడ్కర్ ఆస్తుల విలువ రూ. 40 కోట్లు అని ప్రకటించారు.
అయితే పూజా ఖేడ్కర్ ఓబీసీ కేటగిరీ కింద సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పరిమితి తల్లిదండ్రులకు సంవత్సరానికి రూ. 8 లక్షల రూపాయలు. అయితే పూజా ఖేడ్కర్ తండ్రి కోటీశ్వరుడు అయినప్పటికీ ఓబీసీ సర్టిఫికెట్ పొందారని విచారణ అధికారులు తెలిపారు.
పూణేలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన అనంతరం పూజా ఖేడ్కర్ ఆడి కారు కోసం వీఐపీ నంబర్ ప్లేట్‌తో సహా పలు డిమాండ్లు చేశారు. వాహనంపై రెడ్ లైట్ వేశారు.
తనకు ప్రత్యేక కార్యాలయం, కారు, నివాసం ఉండటానికి గృహాలు, ప్రత్యేక ప్యూన్ కావాలని ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ డిమాండ్ చేసినట్లు పుణె కలెక్టర్ సుహాస్ దివ్సే సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి సమర్పించిన నివేదికలో తెలిపారు.
జూన్ 3వ తేదీన పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు పూజా ఖేడ్కర్ పూణే జిల్లా కలెక్టర్‌తో వాట్సాప్ సంభాషణ ద్వారా ఈ డిమాండ్‌లు చేశారు.

ఈ అసాధారణ డిమాండ్లను కలెక్టర్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి తెలియజేశారు.
తన నివేదికలో పూజా ఖేడ్కర్ శిక్షణను పూణేలో కొనసాగించడం మంచిది కాదని, అది పరిపాలనాపరమైన చిక్కులకు దారితీస్తుందని పేర్కొన్నారు. పూజా ఖేడ్కర్ కు ప్రత్యేకంగా ఓ గది ఇచ్చారు. అయితే ఆ గదిలో బాత్‌రూమ్ లేకపోవడంతో ఆ గది తీసుకోవడానికి పూజా ఖేడ్కర్ నిరాకరించినట్లు సమాచారం. అనంతరం పూజా తన తండ్రి దిలీప్ ఖేడ్కర్‌తో కలిసి పూణే కార్యాలయాన్ని సందర్శించారు. మైనింగ్ శాఖ పక్కనే ఉన్న వీఐపీ హాల్‌ను తన క్యాబిన్‌గా ఉపయోగించుకోవాలని ప్రతిపాదించారు.
ముఖ్యంగా ప్రొబేషన్ సమయంలో ఈ సౌకర్యాలను పొందడానికి ట్రైనింగ్ లో ఉన్న పూజా ఖేడ్కర్ కు అర్హత లేదని ప్రొబేషనరీ అధికారికి తెలియజేయడంతో పాటు ఆమెకు వసతి మాత్రం కల్పిస్తామని తెలియజేశారు.
పూజా ఖేడ్కర్ ఎవరు? అంటూ ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు.
మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి ఈ పూజా ఖేడ్కర్, మహారాష్ట్ర మాజీ ప్రభుత్వ అధికారి దిలీప్ ఖేడ్కర్ కుమార్తె పూజా ఖేడ్కర్. 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై దిలీప్ ఖేడ్కర్ పోటీ చేశారు.
ప్రజాసేవలో నిమగ్నమైన ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన పూజా ఖేడ్కర్ UPSC పరీక్షలో 841వ ర్యాంక్ సాధించారు.
అయితే పూజా ఖేడ్కర్ తన ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. పూజా ఖేడ్కర్ ఓబీసీ కేటగిరీ కింద సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యారు. క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పరిమితి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు అని ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు నకిలీ అంగవైకల్యం పత్రాన్ని కూడా సమర్పించారని ఆరోపణలు ఉన్నాయి. పూజా ఖేడ్కర్ తన ప్రైవేట్ ఆడి కారును రెడ్-బ్లూ బీకాన్ లైట్, వీఐపీ నంబర్ ప్లేట్‌తో ఉపయోగిస్తున్నారని అధికారులు విచారణ చేసిన సమయంలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి.



Click it and Unblock the Notifications