Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
Same Sex Marriage: స్వలింగ వివాహాల పిటిషన్లు కొట్టేయండి, చట్టసభలకే వదిలేయండి: కేంద్రం
స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లను కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశాన్ని ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధుల నిర్ణయానికి వదిలేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతను ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

కోర్టులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి:
స్వలింగ వివాహ బంధాలను ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్ర సర్కారు అభిప్రాయం వ్యక్తం చేసింది. స్వలింగ వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేసింది.
స్వలింగ వివాహాలపై ముందుగా చట్టబద్ధత రావాలి:
వివాహం చట్టబద్ధత అనేది ఒక సామాజిక-చట్టపరమైన వ్యవస్థ అని రాజ్యాంగం ప్రకారం, దీనిని చట్ట సభలు సృష్టించాయని తన కౌంటర్ లో పేర్కొంది. దాని ప్రకారమే వివాహానికి చట్టబద్ధత రావాలని తెలిపింది. వివాహాలకు చట్టబద్ధతను ఇచ్చే అంశంలో పార్లమెంట్ అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని కేంద్రం వెల్లడించింది.
గ్రామీ, సెమీ-రూరల్, పట్టణ, నగర ప్రాంత ప్రజల అభిప్రాయాలు, మతపరమైన అంశాలు, ఆచారాలు అన్నింటినీ పరిశీలించిన తర్వాతే చట్టాలను రూపొందిస్తారని పేర్కొంది. కొత్త బంధాలను గుర్తించడం, ఆ బంధాలకు చట్టబద్ధత కల్పించడం వంటివి కూడా చట్ట సభ్యులే నిర్ణయించాలని, అంతేకానీ ఇది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదంటూ తన కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది.
అందుకే ఈ అంశంలో కోర్టులు దూరంగా ఉండాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సున్నిత సమతౌల్యత పూర్తిగా దెబ్బతింటుందని కేంద్రం ఈ సందర్భంగా పేర్కొంది.
కేంద్ర పిటిషన్‌పైనా విచారణ:
సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసం ఏప్రిల్ 18 నుండి విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కేంద్ర పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. దీనిపై కూడా ఏప్రిల్ 18న విచారణ జరుపుతామని పేర్కొంది.



Click it and Unblock the Notifications
