Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఫ్లైట్లో వందల దొంగతనాలు.. మహిలళే టార్గెట్.. గెస్ట్‌హౌస్ ఓనర్ నిర్వాకం..!
జేబు దొంగతనాలు పోయి హైటెక్ దోపిడీలు పెరిగాయ్. మనకు తెలియకుండానే క్షణాల్లో మన ఫోన్‌లోంచి డబ్బు మాయమైపోతుంది. డిజిటల్ మనీకు కూడా గ్యారెంటీ లేదు. సినిమాల్లో హీరోలు కూడా ఇదే వృత్తులతో కనిపించి అలరించడం విశేషం. రోజూ జరుగుతున్న దోపిడీల్లో కొన్ని వింతలు చూసి మనం ఆశ్చర్యపోయి జాగ్రత్తపడ్డం తప్ప ఏమీ చేయలేము. తాజాగా ఢిల్లీ పోలీసులు ఒక దొంగను పట్టుకొని అతడు చేసిన దొంగతనాలు చూసి షాక్ అయ్యారు. 100 రోజుల్లో 200ల సార్లు ఫ్లైట్ ఎక్కి దొంగతనాలు చేశారు. ఇలాంటి వారి నుంచి మనం అప్రమత్తంగా లేకపోతే జేబు ఖాలీ అయి బాధపడ్డం తప్ప తరువాత ఏమీ చేయలేము.
ఏయిర్ పోర్టుల వద్ద దొంగతనాలు చేయడం రాజేష్ కపూర్‌కు వెన్నెతో పెట్టిన విద్యా. అలా ఏయిర్‌పోర్టుల్లోనే వందల దొంగతనాలు సునాయాసంగా చేశారు. అత్యంత భద్రతతో కూడిన ఢిల్లీ ఏయిర్‌పోర్టుల్లో ఇతగాడు దొంగతనాలు చేశారు. రాజేష్ కపూర్ ఎక్కువగా కనెక్టింగ్ ఫ్లైట్లు ఎక్కేవారినే టార్గెట్‌గా చేసుకునేవాడు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ గుండా అమెరికా వెళ్లేవారిని ఇలా కనెక్టింగ్ ఫ్లైట్లు ఎక్కేవారినే లక్ష్యంగా చేసుకొని దొంగలించేవాడు.

మహిళలు, వయసు ఎక్కువగా ఉన్నవారినే టార్గెట్‌గా చేసుకొని ముందుగా వారి ప్రవర్తనను కదలికలను గమనించేవాడు. మెల్లగా వారి వెనకాలే వెళ్తూ వారిని అనుసరించి వాళ్ల బ్యాగ్‌పై ఉన్న స్లిప్‌ను చదివి బ్యాగ్‌లో ఏయే వస్తువులు ఉన్నాయో తెలుసుకునేవాడు. రాజేష్ కపూర్ చేసే దొంగతనాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయ్.
ఫ్లైట్‌లోకి ఎక్కగానే ఫ్లైట్ అటెండెంట్‌కు తన సీటును మార్చమని చెప్పేవాడు. ఇలా తాను టార్గెట్ చేసుకున్న వారి పక్కనో లేక వారి దగ్గరో ఫ్లైట్ లోపల కూర్చునేవాడు. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా వారి సీటు పక్కనే ఇతని సీటు బుక్ అయి వుండేది. అలా వారి దగ్గర కూర్చున్న తరువాత సీటు అడ్జెస్ట్ చేసుకుంటున్నాననే నెపంతో టార్గెట్ చేసుకున్న వారి బ్యాగులోంచి ఆభరణాలను దొంగలించేవాడు. ఇలా రాజేష్ కపూర్ 2023 వ సంవత్సరంలో 110 విమానాలు ఎక్కి 200లకు పైగా దొంగతనాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏయిర్‌పోర్టు వారికి ఇచ్చిన ఫోన్‌నంబర్లు కూడా నకిలీవేనని తరువాత తెలిసింది. వేరే వారి పేర్లతో రిజిస్టర్ అయిన నంబర్లను తాను ఏయిర్‌పోర్టు వారికి ఇచ్చినట్లు కనుగ్గొన్నారు. ఇలా తన పై ఎలాంటి అనుమానం రాకుండా, గుర్తులు లేకుండా జాగ్రత్త పడేవాడని పోలీసులు చెబుతున్నారు.
సీసీటీవీ కెమెరా వీడియోల ఆధారంగా రాజేష్ కపూర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఢిల్లీ పహర్‌గంజ్‌లో ఢిళ్లీ రైల్వే స్టేషన్ సమీపంలో స్వంతంగా గెస్ట్ హౌస్ ఉన్నట్లు తెలిపింది. మూడవ ఫ్లోర్లో ఇతను ఉంటూ మిగతావి రెంట్‌కు ఇచ్చాడు. ఇదే కాకుండా రాజేష్‌కు ఒక మొబైల్ రిపేర్ షాపు, మనీ ఎక్స్‌చేంజ్ బిజినెస్ ఉన్నట్లు కనుగ్గొన్నారు. తాను దొంగతనం ఎక్కువగా మహిళల బ్యాగుల్లోంచే చేసేవాడినని చెప్పాడు. దొంగతనానికి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, చంఢీగడ్, బెంగళూరు, ముంబై, అమృత్‌సర్ ఏయిర్‌పోర్టులను ఎంచుకునేవాడు. ఫ్లైట్లో దొంగతనం చేసే ముందు ఇదే తరహాలో రైళ్లో దొంగతనం చేసేవాడని.. అనేక సార్లు పట్టుబడ్డ తరువాత 2023 నుంచి ఫ్లైట్లో దొంగతనం చేయడం మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.



Click it and Unblock the Notifications