Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వేప చెట్టుకు వేలాడుతున్న జ్యూపీ మామిడి పండ్లు, కలికాలంలో అద్బుతం !
ప్రకృతిలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింత ఈ మధ్య భోపాల్ లో జరిగింది. ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ వింత ఏంటంటారా ..?ఓమంత్రిగారి బంగ్లాలోని వేప చెట్టులో మామిడి పండ్లు వేలాడుతూ కనిపించడం చూపరులను ఆకర్షిస్తోంది. చుట్టు ప్రక్కల వారు ఈ వింతను చూడాటానికి ఎగబడ్డారు. గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలో నాటిన వేప చెట్టు ఈ రోజుల్లో వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వేప చెట్టుకు మామిడి పండ్లు కాస్తున్నాయంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వయంగా మంత్రి ఈ చెట్టుపై పండ్లను చూసి ఆశ్చర్యపోయారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ ఆశ్చర్యం చోటుచేసుకుంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, కార్మిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బంగ్లాలో నాటిన చెట్టు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది. కానీ ఆ చెట్టుకు మామిడి పండ్లు కాస్తున్నాయి. ఈ చెట్టును చూసిన మంత్రి కూడా ఆశ్చర్యపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఈ చెట్టుపై సర్వత్రా చర్చ మొదలైంది.

మంత్రి ప్రహ్లాద్ పటేల్ స్వయంగా వీడియోను తీసి కూడా సోషియల్ మీడియాతో పంచుకున్నారు. ఈ వీడియోల మామాడిపండ్లు గుత్తులుగా వేలడటం ఈ వీడియోలో చూడవచ్చు. మంత్రి ప్రహ్లాద్ పటేల్ నివాసం భోపాల్‌లోని ప్రొఫెసర్ కాలనీ సమీపంలోని సివిల్ లైన్స్‌లోని బి-7 బంగ్లాలో ఉంది. మంత్రి బంగ్లాలోచాలా రకాల చెట్లు ఉన్నాయి. వీటిలో వేప చెట్టు కూడా ఒకటి. ప్రస్తుతం ఈ బంగ్లాలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాగా, శనివారం పహ్లాద్ పటేల్ బంగ్లాను పరిశీలించేందుకు వెళ్లినప్పుడు . అక్కడ ఉన్న చెట్లను, మొక్కలను పరిశీలిస్తున్నప్పుడు అతని కళ్లు ఈ చెట్టుపై పడటంతో దాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్
సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్న మంత్రి ఇలా వ్రాశారు. భోపాల్ నివాసంలోని వేప చెట్టుపై మామిడి పండ్లను చూసినప్పుడు నేను మొదట షాక్ అయ్యాయని, తరువాత దగ్గరగా వెళ్లి వాటిని చూసి ఉప్పొంగిపోయానని అన్నారు. ప్రతిభ కలిగిన ఓ తోటమాలీలు ఈ ప్రయోగాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చేసి ఉండవచ్చు, ఇది ఒక అద్భుతం అని చెప్పడానికి ఏమాత్రం సరిపోదు అంటూ ఈ వీడియోను షేర్ చేయడంతో ఇది కాస్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
నిపుణులు ఏమంటారు
ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలకు అందించడంతో వారు వచ్చి పరిశీలించి ఈ చెట్టు చాలా ఏళ్ల నాటిదని అంచనా వేశారు. దాదాపు 20 నుండి 25 సంవత్సరాల వయస్సు ఉంటుందని అంచనా వేశారు. వేప చెట్టులో మామిడి కొమ్మ కూడా ఉండటం వల్ల, కొన్నిసార్లు మామిడి గింజ, పూతలు ఇతర చెట్టుపై పడటం వల్ల, మొక్క పెరిగి ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని, వేప కొమ్మకు ఆనుకుని ఉన్న భాగంపై కూడా మామిడి పండ్లు ఉన్నందున మామిడి కొమ్మను అంటుకట్టే అవకాశం కూడా ఉందని వివరించారు.
ప్రస్తుతం మామిడి కాయలు కాస్తున్న వేప కొమ్మపై కొన్నాళ్ల క్రితం తోటమాలి మామిడి కొమ్మను అంటు వేసి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది చెట్లు మరియు మొక్కలలో సాధ్యమే, కానీ మానవులలో ఇది సాధ్యం కాదు. ఇప్పుడు ఓ వేప చెట్టు మామిడి పండ్లను ఇవ్వడానికి ఇదే కారణం అని అంటున్నారు. అయితే ఇది చూసిన నెటిజన్లు మాత్రం దేవుడి మహిమ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు వేపచెట్టులోని మామిడిపండ్లు చేదుగా ఔషధగుణాలతో ఉంటాయి కాబట్టి షుగర్ తగ్గిస్తుందని అంటున్నారు.



Click it and Unblock the Notifications