Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Martyrs' Day 2023: భారతదేశంలో జరుపుకునే 7 అమరవీరుల దినోత్సవాల వెనక చరిత్ర తెలుసా?
భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన అమర వీరులను తలచుకోవడానికి అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరంలో ఏడు సార్లు అమరవీరుల దినోత్సవం వెనక ఒక్కో చరిత్ర ఉంది. ఈ మార్టైర్స్ డే ల ద్వారా అమరవీరులను స్మరించుకుంటాం. స్వతంత్ర సమరంలో ప్రాణాలు వదిలిన వారిని గౌరవించుకుంటాం.
సంవత్సరంలో మొత్తం ఏడు సార్లు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాం. వాటి జాబితా, వాటి వెనక చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 30:
ఏటా ఏడుసార్లు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే. ఇందులో జనవరి 30వ తేదీ ప్రత్యేకమైనది. భారత స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ ప్రధాన పాత్ర పోషించారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అహింసాయుత పోరాటం చేశారు గాంధీ.
బ్రిటీష్ అధికారులు ఎన్నిసార్లు కవ్వింపులకు గురి చేసినా ఏమాత్రం సహనం కోల్పోకుండా అహింసా మార్గంలో పోరు సాగించారు. అలుపెరుగని రీతిలో చేసిన పోరాటానికి తలవంచిన బ్రిటీషర్లు దేశాన్ని విడిచి పలాయనం చిత్తగించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలోని బిర్లా హౌజ్ లో నాథూరామ్ గాడ్సే.. మహాత్మా గాంధీని ఛాతీపై మూడుసార్లు తుపాకీతో కాల్చి చంపాడు.
మహాత్మా గాంధీ మరణం తర్వాత జనవరి 30న అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
మార్చి 23:
భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను లాహోరో జైలులు మార్చి 23, 1930న ఉరి తీశారు.
1929 ఏప్రిల్ 8వ తేదీన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లు బాంబు దాడి చేశారు. ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వం ముగ్గురిని ఉరితీసింది.
స్వతంత్రం సిద్ధించిన తర్వాత మార్చి 23వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
మే 19:
అస్సాంలోని బెంగాలీ-ఆధిపత్యం గల బరాక్ వ్యాలీ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సామీ భాషను బలవంతంగా తమపై రుద్దుతుండటాన్ని తీవ్రంగా వ్యతిరేకంగా బెంగాలీలు.. సర్కారు విధానానికి వ్యతిరేకంగా పోరు సాగించారు.
1961 మే 19వ తేదీన సిల్చార్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసుల కాల్పుల్లో ఒక మహిళ సహా 11 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. షాహిద్ దివస్ ను భాషా అమరవీరుల దినోత్సవంగా పిలుస్తారు.
జులై 13:
కశ్మీర్ మహారాజా హరి సింగ్ కు వ్యతిరేకంగా నిరసనలు జరగ్గా.. రాజు సైనికులు 22 మందిని చంపారు. 1931 జులై 13వ తేదీన జరిగిన ఈ దుర్మార్గకాండకు వ్యతిరేకంగా, నిరసనకారులను స్మరించుకుంటూ జులై 13న కశ్మీర్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
నవంబర్ 17:
లాలా లజపతి రాయ్ వర్ధంతి సందర్భంగా, ఒడిశా సర్కారు నవంబర్ 17వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
1928లో సైమన్ కమిషన్ లాహోర్ ను సందర్శించినప్పుడు, రాయ్ దానికి వ్యతిరేకంగా అహింసాయుతంగా నిరసన నిర్వహించారు. అయితే పోలీసుల అత్యుత్సాహం కారణంగా అక్కడ ఆందోళన చెలరేగింది. పోలీసుల లాఠీ దెబ్బలకు లజపతిరాయ్ తీవ్రంగా గాయపడ్డారు. 1928 నవంబర్ 17న ప్రాణాలు కోల్పోయారు.
నవంబర్ 19:
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జన్మదినమైన నవంబర్ 19వ తేదీన అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1857 బ్రిటీషర్లపై గొప్ప తిరుగుబాటు చేసి ప్రాణాలు కోల్పోయారు రాణి లక్ష్మీబాయి.
నవంబర్ 24:
9వ సిక్కు గురువు తేజ్ బహదూర్ ను ఉరితీసిన నవంబర్ 24న అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ముస్లిమేతరుల బలవంతపు మతమార్పిడిని తేజ్ బహదూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తేజ్ బహదూర్ ను 1675లో మొఘల్ చక్రవర్తి ఔరంగేబు తేజ్ బహదూర్ ను ప్రజల ముందు ఉరితీశారు.



Click it and Unblock the Notifications