Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Kumbh Mela: మహా కుంభమేళా భారీ అగ్నిప్రమాదం.. 30 టెంట్లు దగ్ధం! పదుల సంఖ్యలో మృతులు?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కుంభమేళాలో ఏర్పాటు చేసిన సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. దీని కారణంగా అక్కడ భారీ ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు అగ్నికీలలు మాదిరిగా భారీగా ఎగసిపడుతున్నాయి. సుమారు 50 మీటర్ల వరకు మంటలు వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ అగ్నిప్రమాదంలో సుమారు 30 టెంట్లు దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో భక్తులందరూ భయంతో పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో శిబిరంలో భక్తులు ఉన్నారా లేరా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అగ్నిమాపక సిబ్బంది అక్కడ పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

భారీ నష్టం
ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కుంభమేళాలో ఇంతటి భారీ అగ్నిప్రమాదం భారీ నష్టానికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. శిబిరాల్లో ఎవరైనా భక్తులు ఉంటే పదుల సంఖ్యలో మృత్యువాత పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు టెంట్లు, శిబిరాలు దగ్ధమవడంతో పెద్ద సంఖ్యలో ఆస్తి నష్టం కూడా జరగనుంది.
దీని కారణంగా కుంభమేళాకు వెళ్లే వ్యక్తుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. అగ్నిప్రమాదం వంటి భయాలు భక్తులను వెంటాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాదం వెనుక ఎవరైనా ఉన్నారా? ఏదైనా కుట్రకోణం దాగి ఉందా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఎవరు? దేనివల్ల ఇది జరిగింది? ఎంత నష్టం జరిగింది అనేది తెలియాల్సి ఉంది.



Click it and Unblock the Notifications