Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
తండ్రి సూపర్ స్టార్..సినిమా వద్దని సివిల్స్..ఇప్పుడు కలెక్టర్ గా అక్కడ డ్యూటీ!
సినిమా ఫీల్డ్ లో నెపోటిజం అనే పేరు తరచుగా వింటుంటాం.సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న వ్యక్తులు ఎవరైనా తన కొడుకుని లేదా తన కుటుంబంలోని మిగతావాళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి అవకాశాలను వేరే వాళ్లకు వెళ్లకుండా చేస్తుంటారని తరచుగా ప్రధాన మీడియాలో,సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంటది. స్టార్ హీరోలు లేదా నటుల పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లో సినీ ప్రపంచంలోకి వస్తారన్న డిబేట్ పాతదే అయినప్పటికీ అందరి అగ్ర నటుల పిల్లలు అందరూ అలా ఉండరు అని తరుచుగా అనేక మందిని ఉదాహరణగా చెబుతుంటాం.
ఓ స్టార్ నటుడు కుమారుడు తండ్రి బాటలో సినిమాల్లోకి రాకుండా సివిల్స్ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయ్యాడు. కృష్ణమూర్తి నారాయణ్ అలియాస్ చిన్ని జయంత్..ఈ పేరు తెలియని తమిళులు ఉండరు. కోలీవుడ్ లో అగ్రనటుడు. 1980లలో రజనీకాంత్ సహా అనేక అగ్ర నటులతో నటించి బాగా గుర్తింపు పొందాడు. తమిళ సినిమాల్లో సూపర్ స్టార్ గా మారారు. ఇతనికి శ్రుతంజయ్ నారాయణన్ అనే కొడుకు ఉన్నాడు. చిన్నతనం నుంచే శ్రుతుంజయ్ కి సినిమాల మీద ఇష్టం ఉండేది. అయితే క్రమంగా సినిమాల మీదనుంచి అతడి దృష్టి చదవుమీదకి మళ్లింది. ప్రముఖ అశోక యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు.

తండ్రిలా సినిమాల్లోకి వెళ్లాలని శత్రుంజయ్ లో ఉండేది కాదు. తాను ఐఏఎస్ అవ్వాలని కలలు కనేవాడు. క్రమంగా సివిల్స్ సర్వీసెస్ లోకి వెళ్లాలన్న కోరిక శ్రుతంజయ్ నారాయణన్ లో కలగడంతో సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం మొదలుపెట్టాడు. రోజుకు 10-12 గంటలు చదివేవాడు. పగలు సివిల్స్ పరీక్షకు ప్రిపేర్ అవడం..తన పాకెట్ మనీ కోసం కుటుంబం మీద ఆధారపడకుండా రాత్రిళ్లు జాబ్ చేసేవాడు.
తొలి ప్రయత్నంలో సివిల్స్ ఫెయిల్ అయ్యాడు. అయినా నిరుత్సాహపడకుండా 2019లో రెండోసారి సివిల్స్ పరీక్ష రాశాడు. 2020లో విడుదలైన సివిల్స్ ఫలితాల్లో శ్రుతంజయ్ నారాయణన్ 75 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శత్రుంజయ్ నారాయణన్ తమిళనాడులోని విల్లుపురం జాల్లా అడిషనల్ కలెక్టర్(development)కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.



Click it and Unblock the Notifications
