Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న డ్రింక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
తిండితో ప్రయోగాలు చేయడం చాలామందికి ఇష్టం ఉంటుంది. అయితే కొందరు ఆ ప్రయోగంలో సక్సెస్ అయితే, ఇంకొందరు ఫెయిల్ అవుతుంటారు. సక్సెస్ అయిన తిండిని కొందరు దేశ వ్యాప్తంగా ప్రచారం చేసి మంచి బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో ఇలాంటి వాటికి అసలు కొదువే లేదని చెప్పాలి. బొండాలు కాకుండా పునుగులు, బెల్లం టీ ఇలా ఎన్నో రకాల వంటకాలు మన ఇండియాలో ప్రసిద్ధి చెందాయి. చాలా ప్రాచుర్యం పొందాయి.
అయితే ప్రస్తుతం మన దేశంలో ఒక వినూత్నమైన కోలా బాగా వైరల్ అవుతుంది. అదే దూద్ కోలా. పాలు మరియు కోలా కలయికలో తయారయ్యే ఈ శీతలపానీయానికి దేశం మొత్తం ఫిదా అవుతుంది. ఇది ఎంతో రుచికరంగా ఉండడంతో పాటు తక్షణమే శక్తిని అందిస్తుందని చెబుతున్నారు. ఈ దూద్ కోలా స్టోరీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దూద్ కోలా..
మీకు కోకా కోలా తెలిసి ఉంటుంది. అలాగే పాలు కూడా. వీటికి వేరు వేరు లక్షణాలు ఉంటాయి. ఈ రెండిటి కలయికలో చేసేదే దూద్ కోలా. పాలను, కోలాను మిక్స్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన రుచితో ఇది ఏర్పడుతుంది. ఈ దూద్ కోలాకు విచిత్రమైన చరిత్ర ఉంది. కోల్‌కతాలో ఉంటున్న పంజాబ్‌కు చెందిన ఒక డాబా యజమాని.. బల్వంత్ సింగ్ తన కుమారుడితో కలిసి మండుతున్న ఎండలో కూల్ డ్రింక్ తాగేందుకు వెళ్లారు. అయితే ఆయనకు రుచికరమైన పానీయం లభించలేదు. దీంతో ఆయన పాలతో కలిపి, దూద్ కోలాను తయారు చేశారు. అప్పటి నుంచి ఇది క్రమంగా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీని ధర కూడా చాలా తక్కువ అని చెప్తున్నారు.
వేసవి కోసం ప్రత్యేకమైనది..
ఈ శీతలపానీయాన్ని ప్రత్యేకంగా వేసవి కోసం తయారు చేశామని ఈ శీతల పానీయాన్ని సృష్టించిన బల్వంత్ సింగ్ తెలిపారు. మండే ఎండలో దీనిని తాగడం వల్ల.. శరీరానికి తక్షణమైన ఓదార్పు లభిస్తుంది. అలాగే శక్తి కూడా అందుతుంది. కోల్‌కతాకు ఎవరైనా వెళ్తే.. కచ్చితంగా ఈ పానీయాన్ని రుచి చూడాలని అనుకుంటూ ఉంటారు.
ఇది ఆరోగ్యకరమైనదేనా?
ఈ డ్రింక్ ఆరోగ్యకరమైనదా అంటే కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాలలో కోలాను కలపడం వల్ల పాలలో ఉండే లక్షణాలు అన్నీ నాశనమైపోతాయి. పాలలో ఉండే పోషకాలు శరీరానికి ఏమాత్రం అందవు. అలాగే పాలలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి వంటపట్టవు. పైగా కోలాలో ఉండే సోడియం, షుగర్ శరీరంలో షుగర్ శాతాన్ని పెంచుతాయి. మధుమేహం, అధిక బరువు వంటి సమస్యల బారిన పడే విధంగా చేస్తాయి. ఇది రుచికరంగా ఉంటుంది కానీ, ఆరోగ్యకరం మాత్రం కాదు.
నెటిజన్స్ ఏమంటున్నారంటే?
ఈ వింత డ్రింక్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ డ్రింక్ రుచి చాలా బాగుందని అంటున్నారు. మరికొందరు ఇది వినాశనానికి ప్రారంభం అని, పాలలో ఎవరైనా కోలా కలుపుకొని తాగుతారా అని చెప్తున్నారు. ఇంకొందరు ఇలాంటి చెడు తిండి తినడం, ఇలాంటి చెత్త అలవాట్లు చేసుకోవడం వల్ల ప్రాణాపాయం అని, వీటిని ప్రోత్సహించకూడదని చెప్తున్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి.



Click it and Unblock the Notifications