Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
Dhoni Bike Collection: బైకులంటే ధోనికి పిచ్చి, ఇంట్లో గ్యారేజ్ నిండా బైకులే.. ఏమేం ఉన్నాయో తెలుసా?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులంటే పిచ్చి అనే విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి వచ్చే హై ఎండ్ బైకులన్నీ తన గ్యారేజీలు ఉండాల్సిందే అన్నట్లుగా ఉంటుంది ధోని ఇష్టం. బైక్ పై రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లడం అంటే ధోనికి చాలా ఇష్టం.
ఎన్నోసార్లు తన పుట్టిన ఊరు రాంచీలో బైకులపై తిరుగుతూ కెమెరాలకు చిక్కాడు. క్రికెట్లోకి రాకముందు నుంచే ధోనికి బైక్ లు అంటే పిచ్చి. ఆ పిచ్చి పెరుగుతూ పోయిందే తప్పా తగ్గలేదు. మ్యాచుల్లో గెలుపొందిన తర్వాత సహచర ఆటగాళ్లను ఎక్కించుకుని మైదానంలోనే బైకులపై చక్కర్లు కొట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అంతగా బైకులను ఇష్టపడతాడు ధోని.
తన ఇంట్లోని గ్యారేజీలో ఎన్నో బైకులు ఉన్నాయి. యమహా ఆర్డీ 350 లాంటి తొలినాళ్ల బైకుల నుంచి కవాసాకి, కాన్ఫడరేట్, హార్లీ డేవిడ్‌సన్, యమహా లాంటి టాప్ ఎండ్ బైకులు కూడా ధోని కలెక్షన్ లో ఉన్నాయి. ధోని దగ్గర ఉన్న బైకులేంటో ఓ లుక్కేద్దామా..

1. కవాసాకీ - నింజా హెచ్2:
ఈ బైక్ ను ధోని 2015 లో కొన్నాడు. భారత్ లో ఈ బైక్ తీసుకున్న మొదటి వ్యక్తి ధోనియే. ఇది 11,500 rpm వద్ద 231 PS అలాగే 11,000 rpm వద్ద 141.7Nm. నాలుగు సిలిండర్‌లతో సూపర్ ఛార్జ్డ్ 998 cc ఇంజన్, 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ధర రూ. 35 లక్షలు.

2. కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్:
అత్యంత అరుదైన బైకుల్లో కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్ ఒకటి. ఈ బైక్ పై మొదటి బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్యూట్ లో కనిపించాడు ధోని. 2.2 లీటర్ V2 ఇంజిన్ ఉంటుంది. ఇది 5-గేర్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. 121 bhp మరియు 190 Nm టార్క్‌ను అందిస్తుంది.

3. కవాసాకి నింజా ZX-14R:
అత్యుత్తమ బైకుల్లో ఇదీ ఒకటి. నింజా ZX-14R గరిష్ఠ వేగం 335KMPH. ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 4 సిలిండర్ 1441 సీసీ ఇంజిన్ తో వస్తుంది. 197.39 బీహెచ్పీ పవర్ ను అందిస్తుంది.

4. హర్లే డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్:
1690సీసీ V-ట్విన్ ఇంజిన్ ఎయిర్ కూల్డ్ తో వస్తుంది ఫ్యాట్ బాయ్. సూపర్ స్ట్రాంగ్ ఇంజిన్ 5250 rpm 77.78 PS (56.8kW) వరకు మరియు 3250 rpm వద్ద 132Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.

5. డుకాటీ 1098:
డుకాటీ లిమిటెడ్ ఎడిషన్ డుకాటీ 1098 ధోని కలెక్షన్లలో ఒకటి. 160 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 1098 సీసీ ఇంజిన్ తో స్తోంది.

6. యమహా RD350:
350 సీసీ ఇంజిన్ సామర్థ్యంలో వస్తుంది యమహా RD350. 6750 rpm వద్ద 30.5 bhp ఉత్పత్తి చేయగలదు. 0.100 కిలీమీటర్ల వేగాన్ని 7 సెకన్లలోనే అందుకుంటుంది.

7. యమహా రాజ్‌దూత్:
ధోని మొట్టమొదటి బైక్ ఇది. 173 సీసీ ఇంజిన్ తో వచ్చే ఈ బైక్ 3-స్పీడ్ తో వస్తుంది. గరిష్ఠంగా 130 కిలోమీటర్ల స్పీడ్ వెళ్లగలదు.

8. BSA గోల్డ్‌స్టార్:
500 సీసీ సింగిల్ సిలిండర్ కలిగిన ఈ బైక్ పై చక్కర్లు కొడుతూ ధోని చాలా సార్లు కనిపించాడు. BSA గోల్డ్ స్టార్ గరిష్ఠంగా 48 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

9. నార్టన్ జూబ్లీ 250:
ఈ బైక్ 1961లో గ్రేట్ బ్రిటన్‌లో నార్టన్ యొక్క సిల్వర్ జూబ్లీ జ్ఞాపకార్థం తయారు చేశారు. ఇది 7,750 rpm వద్ద గరిష్టంగా 16 bhp పవర్ ను ఉత్పత్తి చేయగలదు. గరిష్ట వేగం 120 kph.

10. సుజుకి షోగన్:
2-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ తో వస్తుంది. 108.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. 8250 rpm వద్ద 11.4Nm టార్క్ తో.. 8500 rpm వద్ద 14 bhp పవర్ ను అందిస్తుంది.



Click it and Unblock the Notifications