Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Dhoni Birthday: న్యూమరాలజీ ప్రకారం ధోని వ్యక్తిత్వం ఎలాంటిది? అతడు నిజంగానే మిస్టర్ కూలా..
ఈ రోజు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని జన్మదినం. భారత క్రికెట్ కు నాయకత్వం వహించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోనిది ప్రత్యేక స్థానం. ధోని కెప్టెన్సీలో భారత కొత్త శిఖరాలను అధిరోహించింది. అన్ని ఐసీసీ ఫార్మట్లలో జట్టును ఛాంపియన్ గా నిలిపిన ఘనత ధోనికే దక్కుతుంది.
ఐపీఎల్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ను అత్యుత్తమ జట్టుగా నిలపడంలో ధోని పాత్ర కీలకం. 1981, జులై 7వ తేదీన జన్మించాడు ధోని. ఏడో నెలలో ఏడో తేదీన పుట్టిన ధోని వ్యక్తిత్వం న్యూమరాలజీ ప్రకారం ఎలాంటిదో చూద్దాం.

అడుగుఅడుగులో నాయకత్వ లక్షణం:
1981 సంవత్సరం 7వ నెల 7వ తేదీన జన్మించాడు ధోని. న్యూమరాలజీ ప్రకారం ఇది అద్భుతమైన సంఖ్యను సూచిస్తోంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ తేదీన పుట్టిన వారికి అపారమైన జ్ఞానం ఉంటుంది. తెలివితేటలు, విశ్లేషణ సామర్థ్యం అమోఘంగా ఉంటుంది. అద్భుతమైన పరిశీలన, పరిశోధన నైపుణ్యాలు ఉంటాయి. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తిత్వం వీరి సొంతం. వీరి అడుగులే మార్గదర్శకత్వాన్ని నిర్దేశిస్తాయి. వీరి తీరులోనే నాయకత్వం ఉంటుంది.
అలా చేస్తే మరింత అద్భుతమైన కెరీర్:
ధోని న్యూమరాలజీ ప్రకారం అతడు తన వృత్తి జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తాడు. గొప్ప పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు అందుకుంటాడు. అందరి ఆదరాభిమానాలను పొందుతాడు. అయితే ధోని పుట్టిన ఊర్లో కాకుండా వేరే చోట్ల ఉంటే తన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ప్రాంతాలు మారుతూ ఉంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.
ఆ సహజ నైపుణ్యంతో ప్రత్యేకమైన వ్యక్తిగా ధోని:
పుట్టిన తేదీ ప్రకారం ధోనీ మాస్టర్ డెస్టినీ నంబర్ 6. ఈ నంబరే ధోనిని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది పుట్టిన తేదీలోని అంకెల మొత్తం 33 ద్వారా ధోని సహజమైన శక్తియుక్తులను కలిగి ఉంటాడు. మానసికంగా బలంగా ఉంటాడు. ఒత్తిడి, ఆందోళన ప్రభావాలను తనపై పడకుండా ఉండగలిగే నేర్పు, నైపుణ్యం, ప్రతిభ ఈ వ్యక్తుల సొంతమని న్యూమరాలజీ చెబుతోంది. ఈ నైపుణ్యం వల్లే ధోని మంచి నాయకుడిగా, మిస్టర్ కూల్ కెప్టెన్ గా, ఒత్తిడిలోనూ మంచి నిర్ణయాలు తీసుకునే ఆటగాడిగా ఎదిగాడు.
అరుదైన నంబర్:
33తో వచ్చిన డెస్టినీ నంబర్ 6 ఇది చాలా అరుదైనది. ఈ అరుదైన కాంబినేషన్ ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఉన్నత స్థానాలు అధిరోహిస్తారు. అలాంటి వ్యక్తుల్లో ధోని ఒకడు. ధోని నంబర్ 7, మాస్టర్ నంబర్ 6.. అతని సామర్థ్యాన్ని మరొక స్థాయికి తీసుకెళ్లాయి. చాలా మందికి ఆదర్శంగా నిలవగల, ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలించగల వ్యక్తిగా మార్చాయి. విజయం, దేశభక్తిని కోరుకునే అతని సంకల్పంలో అది స్పష్టంగా కనిపిస్తుంది.
మొదట్లో ఆటుపోట్లు, తర్వాత విజయపరంపర:
సంఖ్యాశాస్త్రం ప్రకారం నంబర్ 7 ధోనిలో ఒకటి కంటే ఎక్కువ సార్లు కనిపిస్తోంది. ఈ నంబర్ వల్ల జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతాయి. ఈ సంఖ్య జీవితంలో ప్రేమలో వైఫల్యం, డబ్బు కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వేధించడం వంటి సమస్యలు ఉంటాయి. జీవితం మొదట్లో ఇలాంటి సమస్యలు ఆటుపోట్లు ఎదురయ్యాక జీవితంలో విజయాల పరంపర కొనసాగుతుంది. ఆ కష్టాలే వ్యక్తులను బలంగా మార్చి అన్ని నేర్పించి విజయానికి సిద్ధం చేస్తాయి. అయితే ఈ నంబర్ ప్రభావం మరో దఫా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ధోనికి చిన్న చిన్న సమస్యలు రావొచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications