Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
మిస్టీరియస్ వ్యాధి.. సోకితే గంటల్లోనే మరణం ఖాయం, WHO ఏమంటుందంటే?
కరోనా మహమ్మారి తరువాత ఏదైనా కొత్త వ్యాధి పేరు వినపడిందంటే చాలు ప్రపంచం మొత్తం గడగడలాడిపోతుంది. ప్రజల్లో భ్రాయాందోళనలు మొదలవుతున్నాయి. ఎక్కడ ఇది మరో ప్రళయాన్ని సృష్టించబోతుందో అని కంగారు పడడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం, ఆఫ్రికాలో మరో కొత్త వ్యాధి బయటపడి ప్రజలలో ఆందోళనను రేపుతోంది. ఈ కొత్త వ్యాధి కారణంగా, కాంగో దేశంలోని నార్త్‌వెస్ట్ ప్రాంతంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు కొన్ని గంటలలోనే మరణిస్తున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏంటి ఆ వ్యాధి?
కాంగోలో కొత్త వ్యాధి ఉద్భవించింది. ఈ వ్యాధి ఏంటో తెలియదు కానీ, ఇది ఇప్పటి వరకు 400 మందికి సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 50 మంది ప్రాణాలు విడిచారు. దీంతో ఆ ప్రాంతంలో ఇది భయంకర పరిస్థితిని సృష్టించింది. వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత కొన్ని గంటల్లోనే బాధితులు మరణించడంతో ఈ వ్యాధి వ్యాప్తిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. కాంగో ప్రభుత్వం ఈ వ్యాధిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

మొట్టమొదటి కేసు
కాంగోలో ఈ వ్యాధి మొదటి కేసు 2025 జనవరి 21న, ఈక్వేటర్ ప్రావిన్స్‌లో గుర్తించబడింది. వ్యాధి ఉన్న గ్రామాలు ఒకదానితో మరొకటి దూరంగా ఉన్నప్పటికీ, వ్యాధి ఎంతో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు. వ్యాధి లక్షణాలు సర్వసాధారణంగా కనిపించడం వలన, మొదటగా ఇది ఎబోలాగా అనుమానించారు. కానీ, ల్యాబ్ టెస్టుల అనంతరం, ఈ వ్యాధి ఎబోలా కాకుండా, వేరే ఏదో కారణం వల్లే సంభవిస్తున్నట్లు తేలింది.
ఈ వ్యాధి ఎందుకు, ఎలా వ్యాపిస్తోంది, దాని అసలు కారణం ఏమిటి అన్న విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెనింజైటిస్, టైఫాయిడ్, మలేరియా, ఫుడ్ లేదా వాటర్ పాయిజనింగ్, మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నింటికీ సంబంధం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రత్యేక బృందాలను పంపి ఈ వ్యాధి విశ్లేషణను మొదలు పెట్టింది.
అక్కడే మొదటి కేసు..
కాంగోలోని బొలొకో అనే పట్టణంలో మొదటి కేసు నమోదు అయ్యింది. అక్కడ ముగ్గురు పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారు. వారు గబ్బిలం మాంసం తిన్నట్లు తేలింది. 48 గంటల తర్వాత వారు మరణించారు. అయితే, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి వ్యాపించడంతో, వ్యాధి యొక్క అసలు మూలం ఇంకా గుర్తించలేకపోయారు. ప్రపంచ దేశాలు ఈ వ్యాధిని చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి. మరణాలు వేగంగా జరుగుతుండటం మరియు వ్యాధి ఎలా వ్యాపిస్తుందో తెలియకపోవడం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం WHO దీనిపై పరిశోధనలు జరుపుతోంది.



Click it and Unblock the Notifications