Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆ చేపకు జీవం వస్తే యుగాంతమే.. ఆ చేప ఎక్కడుందో తెలుసా?
కలియుగం అంతానికి సమయం వచ్చేసింది అనే వార్తలు మనం వింటూ ఉంటాం. యాగంటి దేవాలయంలోని నందీశ్వరుడు పెరిగి రెంకలేస్తే కలియుగం అంతం అవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఇంకో నానుడి ఉంది. అయితే అది బసవన్న కాదు.. ఒక చేప. ఆ శీలా చేపకు జీవం వస్తే కలియుగం అంతం అయినట్లే అని పెద్దలు, నిపుణులు చెబుతూ ఉంటారు.
ఆ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయం ప్రత్యేకతలేంటి అలాగే ఆ చేప ఎలాంటిది? ఎందుకు ఆ చేపకు జీవం వస్తే కలియుగం అంతం అవుతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం
ఆ ఆలయం ఎక్కడుందంటే?
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో ఆ ఆలయం ఉంది. అది సౌమ్యనాథ స్వామి దేవాలయం. ఈ ఆలయాన్ని 11వ శాతాబ్దంలో 108 స్తంభాలతో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయంలో 108 ప్రదిక్షణలు చేసి, సౌమ్యనాథ స్వామికి తమ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.

ఈ ఆలయం చరిత్ర తెలుసుకుందామా?
ఈ సౌమ్యనాథ స్వామి ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఆలయ వాస్తుకళకు ఆదరణ పొందిన చోళ రాజవంశ పాలనలో ఈ ఆలయం నిర్మించబడిందని నమ్ముతారు. ఈ ఆలయ నిర్మాణం అద్భుతమైన ఆర్కిటెచర్‌తో జరిగింది. ఈ సౌమ్యనాథ స్వామి ఆలయంలోని గర్భగుడిలో ఎలాంటి దీపాలు లేకపోయినా.. ఆలయ మూల విరాట్టు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది.
ఈ ఆలయంలో శిల్పకళకు అమితంగా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆలయంలోని స్తంభాలపై మత్స్య, సింహ, తదితర శిల్పాలు చెక్కారు. వీటికి పురాణాల ప్రకారం అనేక ప్రాముఖ్యత నెలకొంది. ఈ ఆలయ స్తంభాలపై ఉండే మత్స్య ఆకారం.. కలియుగాంతానికి సంబంధం ఉందని చెబుతూ ఉంటారు.
కలియుగంతో చేపకు ఎలాంటి సంబంధం అంటే?
ఈ ఆలయంలోని చేప శిలకు అనేక ప్రత్యేకత ఉంది. కలియుగంలో రోజులు గడిచేకొద్దీ.. భారీగా వరదలు వస్తాయని, ఆ వరదలతో సౌమ్యనాథ్ స్వామి ఆలయం మునిగిపోతుందని, ఆ వరదలు రాతి స్తంభంపై ఉన్న రాతి చేప శిలను తాకగానే ఆ చేపకు జీవం వచ్చి ఆ వరదలో ఈదుతుందని, అప్పుడు యుగాంతం సంభవిస్తుందని నమ్మకం. ఇది పండితులతో పాటు అక్కడి స్థల పురాణం చెబుతుందని.. సౌమ్యనాథ స్వామిని కొలిచే భక్తులతో పాటు, అక్కడి స్థానికులు కూడా విశ్వసిస్తూ ఉంటారు.
అయితే ఆ చేపకు జీవం వస్తుందా లేదా, కలియుగం అంతం అవుతుందా లేదా అనేది శాస్త్రీయం. కాగా కలియుగాంతంపై అనేక కథలు ఉన్నాయి. పోతులూరి వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా తన శ్లోకాల్లో ఎన్నో విధాలుగా వివరించారు. అందులో ఇదీ కూడా ఒకటి.



Click it and Unblock the Notifications