Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
తిరుపతికి శంఖం, తాబేలు విగ్రహం ఇచ్చిన ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి.. అధిక శ్రావణంలో దానం ఎంతో శ్రేయస్కరం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి తిరుమల శ్రీవారికి బంగారు శంఖం, బంగారు తాబేలు విగ్రహం విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. బంగారు తాబేలు, శంఖానికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండింటిని దైవీకరణ శక్తిగా పరిగణిస్తారు. శ్రీమహా విష్ణువు సేవలో ముఖ్యమైనవిగా భావిస్తారు.
అధిక శ్రావణ మాసం మొదలైంది. ఆషాఢమాసం తర్వాత శ్రావణ మాసం మొదలు కావాల్సింది. కానీ ఈ సంవత్సరం శ్రావణం అధికంగా వచ్చింది. ఈ అధిక శ్రావణ మాసంలో ఎలాంటి శుభకార్యాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటివి పెట్టుకోరు. అయితే ఈ అధిక శ్రావణ మాసానికి కూడా విశిష్టత ఉంది. ఈ మాసంలో శుభకార్యాలు చేయడం నిషిద్ధం అయినప్పటికీ.. ఈ అధికమాసంలో దానం చేయడం ఎంతో శ్రేయస్కరమని శాస్త్రాలు చెబుతున్నాయి. మహా విష్ణువు అనుగ్రహం కోసం అధిక మాసంలో దానాలు చేయాలని చెబుతారు.

అధిక శ్రావణ మాసంలో ఏం దానం చేయాలి:
అధిక మాసంలో శంఖాన్ని దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మహా విష్ణువు శంఖం అంటే ఎంతో ప్రీతి. అలాగే శ్రీవిష్ణువుకు అధిక మాసంలో దానం చేయడాన్ని ఇష్టపడతాడు. అలా అధిక మాసంలో విష్ణువు ఇష్టమైన శంఖాన్ని ఏదైనా శ్రీవారి దేవాలయంలో విరాళం కింద ఇస్తే.. జీవితంలో సుఖసంతోషాలు కలుగుతాయని, ఐశ్వర్యం లభిసుతందని, శ్రీవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
తాబేలు విగ్రహం విరాళమిస్తే శ్రేయస్కరం:
శంఖంతో పాటు అధిక శ్రావణ మాసంలో వెండి లేదా బంగారంతో తయారు చేసిన తాబేలు విగ్రహాన్ని దానం చేయడం కూడా అత్యంత శ్రేయస్కరం. హిందూ పురాణాలు, ఇతిహాసాల ప్రకారం తాబేలు రూపంలో అవతరించిన మహా విష్ణువు సాగరమథనం సమయంలో అమృతాన్ని బయటకు తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషించాడు. అలా తాబేలును మహా విష్ణువుకు ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు. వెండి లేదా బంగారంతో తాబేలు చేయించే స్తోమత లేని వారు, రాగి, ఇత్తడి లోహాలతో చేసిన తాబేలు విగ్రహాలను కూడా దానం ఇవ్వవచ్చు.
ఇలా తాబేలును దానం చేయడం వల్ల జీవితంలోని సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. దేవతల బాధలను తొలగించడానికి విష్ణువు తాబేలు రూపంలో అవతరించాడు. అందుకే మహావిష్ణువు ప్రీతిపాత్రమైన అధికమాసంలో తాబేలును దానం చేయడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు.
అధికమాసంలో ఇంకేం దానం చేయవచ్చు:
అధిక శ్రావణ మాసంలో అవసరంలో ఉన్న వారికి, నిరుపేదలకు అవసరమైనవి దానం చేయాలి. అన్నదానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీ దేవి కూడా అన్నదానంతో సంతోషిస్తుందని నమ్మకం.
కొబ్బరికాయలను అధిక మాసంలో దానం చేస్తే మంచి జరుగుతుందని నమ్మకం. కొబ్బరి కాయలను దాయం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.
బంగారం లేదా కంచు పాత్ర, మినుములు, నెయ్యితో నింపిన వెండి దీపం, బెల్లం, పప్పు, రాగి పాత్ర, వెండి నంది, ఎండు కర్జూరం, ఎర్ర చందనం, కర్పూరం, పత్తి, వస్త్రాలు, బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, తేనే వీటన్నిటిని అధిక మాసంలో దానం చేయవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications