Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కొత్త సంవత్సరం ఆనందంగా, ఐశ్వర్యంతో ఉండాలంటే ఈ వాస్తు చిట్కాలు పాటించండి
రాబోయే కొత్త సంవత్సరం బాగుండటానికి ఎలాంటి వాస్తు చిట్కాలు, నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో 2023లోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ హ్యాపీగా, సెక్సెస్‌ఫుల్‌గా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొత్త సంవత్సరం పొడవునా బాగుండటానికి వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటించాలి. నూతన సంవత్సరంలో ఈ వాస్తు నివారణలు పాటించడం ద్వారా ఆనందంగా, మంచి శ్రేయస్సుతో జీవించవచ్చు.

రాబోయే కొత్త సంవత్సరం బాగుండటానికి ఎలాంటి వాస్తు చిట్కాలు, నివారణలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయక విగ్రహం
ఏ పూజ కార్యక్రమం అయినా తొలి పూజ వినాయకుడికే చేయాలి. విఘ్నాలను తొలిగించే ఆ ఆదిగురువుకు మొక్కు చెల్లించుకున్నాకే మిగతా తతంగం. గణేశుడిని మనసారా పూజిస్తే జీవితంలోనే ఎలాంటి అడ్డంకులు ఉండవు. కొత్త సంవత్సరం బాగుండాలంటే వినాయకుడిని ప్రధాన ద్వారా వద్ద ఉంచడం మంచిది. ఇంటిపై పడే నరదృష్టికి కూడా ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. అలాగే ఇంటి ప్రధాన డోర్ వద్ద గుర్రపుడెక్క ఉంచాలి. గుర్రపుడెక్క ఉంచిన ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాలేవు. అదృష్టం కలిసివస్తుంది. అనుకున్న పనులు విజయవంతం అవుతాయి.

లక్ష్మీదేవి
ఇంట్లో అయినా, వ్యాపారం చేసే చోట అయినా లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచడం ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు పొడచూపవు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

లాఫింగ్ బుద్ధుడు
లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. 2023 సంవత్సరంలో ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలంటే ఇంట్లోనే ప్రధాన ద్వారానికి ఎదురుగా అందరికీ కనిపించేలా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచండి. దీని ద్వారా సంపద, శ్రేయస్సు సిద్ధిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.

వెదురు
ఫెంగ్ షుయ్ వాస్తు శాస్త్రంలో వెదురు మొక్క ఆనందాన్ని, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని తీసుకువస్తుంది. వెదురు మొక్క ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే వాస్తు దోషం వల్ల పడే ప్రభావాన్ని అది తీసుకుంటుందని శాస్త్రం చెబుతోంది. హాల్‌లో, వంటగది, డ్రాయింగ్ రూములో వెదురు మొక్కను పెంచుకోవచ్చు.

అక్వేరియం
చేపలను విలాసానికి, శుభానికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో అక్వేరియం లేదా ఫిష్ బౌల్ ఉంచినట్లైతే ఇంటి కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి కలహాలు రావు. అలాగే అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మానసిక సంక్షోభం తొలగిపోతుంది. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

విండ్ చైమ్
విండ్ చైమ్ అంటే గాలికి కదులుతూ శబ్ధం చేసే వస్తువులు. ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద, ఆకర్షణీయంగా ఉన్న చోట్ల విండ్ చైమ్ వేలాడదీయవచ్చు. విండ్ చైమ్ ను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది. విండ్ చైమ్ చేసే శబ్దం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి రాదు. ఆనందం, శ్రేయస్సు కోసం ఇంట్లో విండ్ చైమ్ వేలాడదీయవచ్చు. మెయిన్ డోర్, బాల్కనీ, విండోల వద్ద విండ్ చైమ్ లను వేలాడదీస్తే అటు వాస్తు ప్రకారం, ఇటు చూడటానికి బాగుంటుంది.



Click it and Unblock the Notifications