Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
కొత్త సంవత్సరం చుట్టూ బోలెడు విశ్వాసాలు, గుడ్డిగా ఫాలో అయ్యేవాళ్లు ఎందరో..
ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరంతో ముడిపడి ఉన్న ఆ విశ్వాసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త ఏడాది రానే వచ్చేసింది. ఈరోజు ప్రతి చోట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జోరుగా జరగనున్నాయి. కొత్త సంవత్సరం తనతో పాటు కొత్త ఆశలు, కోరికలతో పాటు కొన్ని మూఢనమ్మకాలనూ, విశ్వాసాలనూ తీసుకువస్తుంది. కొత్త సంవత్సరం వేళ ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అలా చేస్తే జీవితంలో ఆనందం కోల్పోతామంటూ ప్రపంచవ్యాప్తంగా చాలానే విశ్వాసాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరంతో ముడిపడి ఉన్న ఆ విశ్వాసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ శబ్దం చేయడం
మన చుట్టూ దాగి ఉన్న దుష్టశక్తులను భయపెట్టడానికి ఎక్కువ శబ్దం చేయాలని అంటారు. దెయ్యాలను తరిమికొట్టేందుకు ఎక్కువ శబ్దం చేసే క్రాకర్లు పేల్చాలని, డప్పులు వాయిస్తూ సంబరాలు చేసుకోవాలని అంటారు. దుష్టశక్తులు పెద్ద శబ్దాలకు భయపడతాయి. అందుకే ప్రజలు బాణాసంచా పేలుస్తూ, దుష్టశక్తులను దూరంగా పంపించడానికి ఎక్కువ శబ్దం చేసేలా వేడుకలు జరుపుకుంటారు. అందుకే అర్ధరాత్రి చర్చి గంటలు మోగిస్తారు. దుష్టశక్తులకు దూరంగా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటారు.

కొత్తసంవత్సరం రోజున పుడితే అదృష్టవంతులు
నూతన సంవత్సరం రోజున పుడితే చాలా అదృష్టవంతులని నమ్ముతారు. జనవరి 1వ తేదీన పుట్టిన పిల్లలు జీవితంలో విజయాలు సాధిస్తారు. అంతే కాదు అలా పుట్టిన పిల్లల వల్ల కుటుంబానికీ అదృష్టం కలిసి వస్తుంది.

కొత్త సంవత్సరం వేళ ఏడవొద్దు
కారణం ఏదైనా కొత్త సంవత్సరం వేళ ఏడవద్దని అంటారు. న్యూ ఇయర్ మొదటి రోజు ఏడిస్తే అది ఏడాది పొడవునా ఉంటుందని బలంగా నమ్ముతారు. అందుకే కొత్త సంవత్సరం రోజున వీలైనంత సంతోషంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలని చెబుతారు పెద్దలు.

కొత్త బట్టలు వేసుకోవడం
కొత్త సంవత్సరం వేళ కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం చాలా రోజుల నుండీ వస్తుంది. తొలి రోజు కొత్త బట్టలు వేసుకుంటే సంవత్సరం పొడవునా అలాంటి బట్టలే వేసుకునే అవకాశం లభిస్తుందని విశ్వసిస్తారు.
అలాగే కొత్త సంవత్సరం రోజున రెడ్ కలర్ రంగులు వేసుకోవడానికే ఎక్కువ మంది ఇష్టపడతారు. రెడ్ కలర్ ఆనందాన్ని, ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది.

12 ద్రాక్షపండ్లు
కొత్త సంవత్సరం రోజు ద్రాక్షపండ్లను తినడం ఆనవాయితీగా వస్తోంది. 12 ద్రాక్షలను ఒక్కోదానిని ఒక్కో నెలకు ప్రతీకగా చూస్తారు. ద్రాక్ష తీయగా ఉంటే ఆ నెల కూడా ఆనందంగా, సంతోషంగా ఉంటుందని భావిస్తారు. ద్రాక్ష పుల్లగా ఉంటే ఆ నెల కూడా అలాగే ఉంటుందని అనుకుంటారు.

వేటినీ పగలగొట్టొద్దు
కొత్త సంవత్సరం వేళ వేటినీ పగలగొట్టవద్దని అంటారు. నూతన ఏడాది వేళ వస్తువులను పగలగొడితే సంవత్సరం పొడవునా అలాంటి పరిస్థితే ఉంటుందని అంటారు.

గత సంవత్సరాన్ని వెళ్లనివ్వాలి
పాత సంవత్సరాన్ని వెళ్లనివ్వడానికి ఇంటి తలుపులు, కిటికీలు అర్ధరాత్రి వేళ తెరిచి ఉంచాలని అంటారు. పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి, కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు అర్ధరాత్రి వేళ తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలని విశ్వసిస్తారు.

అప్పులు తీర్చేయాలి
కొత్త సంవత్సర వేడుకలు అప్పులతో ప్రారంభించకూడదు. కాబట్టి కొత్త సంవత్సరం వేళ అప్పులు అన్నింటినీ తిరిగి చెల్లించడానికి ప్రయత్నించాలి. రుణాలు, బిల్లులు, అప్పులను సున్నా చేయాలి. అలాగే కొత్త సంవత్సరం వేళ అప్పులు కూడా ఇవ్వొద్దని అంటారు.

డబ్బు, ఆహారం నిల్వ చేయడం
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేటప్పుడు పర్సులో డబ్బు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇంట్లో ఆహార పదార్థాలన్నీ ఎక్కువ మొత్తంలో ఉంచుకోవాలి. సంవత్సరం ప్రారంభ రోజు ఇలా చేస్తే ఏడాది పొడవునా అలాగే ఉంటుందని కొంతమంది నమ్ముతారు.



Click it and Unblock the Notifications