Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
సాఫ్ట్ వేర్ జాబ్ వదిలి బిజినెస్..కేవలం రూ. 3.5 లక్షల పెట్టుబడితో రూ.500 కోట్లు సంపాదించింది!
ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారు. మగాళ్లతో సమానంగా అన్ని రంగాల్లో తమ సత్తా చూపెడుతున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా మహిళ పాత్ర గత కొంతకాలంగా భారీగా పెరుగుతోంది. ఎన్నో పెద్ద పెద్ద బ్రాండ్ ల కంపెనీలకు సీఈవోలుగా,ఇతర ఉన్నత పదవులు చేపట్టడమే కాకుండా సొంతంగా కంపెనీలు కూడా పెద్ద వేల మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. చాలా మంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్‌లలో విజయం సాధించారు. ఇలాంటివారిలో నిధి యాదవ్ ఒకరు.
23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలి కేవలం రెండు గదుల ఇంట్లో బట్టల బిజినెస్ ప్రారంభించిన నిధి యాదవ్ నేడు కోట్ల విలువైన కంపెనీకి ఓనర్ గా మారింది. రూ.3.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన ఆమె దుస్తుల బ్రాండ్ నేడు రూ.200 కోట్ల బ్రాండ్ విలువను కలిగి ఉంది, త్వరలో రూ.500 కోట్లు దాటవచ్చని సమాచారం.

నిధి యాదవ్ ఎవరు?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు చెందిన నిధి యాదవ్ డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. కంప్యూటర్ ఇంజనీర్ గా వృత్తిని ప్రారంభించినప్పటికీ ఆమె మనస్సు ఎప్పూడూ ఫ్యాషన్ ప్రపంచం మీద ఉండేది. దీంతో ఆమె తన ఉద్యోగంతో సంతృప్తి చెందలేకపోయింది. తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవడానికి నిధి ఉద్యోగానికి రాజీనామా చేసి ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్ లో ఒక సంవత్సరం కోర్సు కూడా చేసింది. ఆమెకి ఇటలీలో ఉద్యోగం కూడా వచ్చింది కానీ తన కుటుంబంతో కలిసి జీవించడానికి భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది.
తన కలను నెరవేర్చుకోవడానికి నిధి 2014 మే నెలలో 'Aks Clothings'పేరుతో ఒక కంపెనీని ప్రారంభించింది. అందులో ఆమె రూ. 3.5 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఆ సమయంలో నిధి గురుగ్రామ్‌లోని డబల్ బెడ్ రూమ్ ఇంట్లో నివసించింది, ఆ ఫ్లాట్ లో ఆమె తన బట్టల బిజినెస్ ప్రారంభించింది. నిధి కంపెనీ 18- 35 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సరసమైన ధరలకు దుస్తులను అందిస్తుంది
200 కోట్ల రూపాయల విలువైన కంపెనీ
కేవలం ఒక సంవత్సరంలోనే ఆ కంపెనీ రూ.8.50 కోట్ల ఆదాయాన్ని ఇచ్చింది. 2018లో కంపెనీ ఆదాయం రూ.48 కోట్లకు పెరిగింది. నిధి కష్టపడి పనిచేయడంతో ఐదు సంవత్సరాలలో కంపెనీ విజయం సాధించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో నిధి కంపెనీ రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. 2021 సంవత్సరం చివరి నాటికి నిధి యాదవ్ కంపెనీ విలువ రూ.200 కోట్లకు పైగా పెరిగింది. కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగింది.



Click it and Unblock the Notifications