Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
కన్యాదానం గొప్పతనం చెప్పిన నీతా అంబాని, కోటీశ్వరులు అయినా పద్దతి మారదు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12వ తేదీన రంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ గ్రాండ్ వెడ్డింగ్ పై దేశంలో ఇంకా చర్చ జరుగుతోంది. పెళ్లి పనులకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇంతలో ఇటీవల అనంత్, రాధికల పెళ్లికి సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఇది కన్యాదానం వేడుక. ఈ వీడియోలో నీతా అంబానీ హిందూ మతంలోని కన్యాదానం ఆచారానికి ఉండే అర్థాన్ని వివరించారు.

కన్యాదానానికి నీతా అంబాని ఇలా అర్థం చెప్పారు
వీడియోలో కన్యాదానం యొక్క ప్రాముఖ్యతను నీతా అంబాని వివరించారు. వివాహంలో అత్యంత ప్రత్యేకమైన ఆచారం కన్యాదానం అని, ఇందులో వధువు తల్లిదండ్రులు తమ కుమార్తె చేతిని వరుడికి అప్పగిస్తారని నీతా అంబాని చెప్పారు. నేను కూడా ఒకరి కూతురిని, ఒక కూతురికి తల్లిని, అలాగే కోడలికి అత్తగారిని. కాబట్టి ఏ తల్లితండ్రులు తమ పిల్లల నుండి దూరంగా ఉండరని నాకు బాగా తెలుసు అని నీతా అంబాని అన్నారు.
కేవలం నీ కూతుర్ని మాకు మీరు ఇవ్వడమే కాదు మీ కుటుంబంలోకి మా కొడుకుని కూడా మీకు ఇస్తున్నామని, మీరు నా కొడుకును మీ కుటుంబంలో చేర్చుకోవడానికి తాను అంగీకరిస్తున్నానని రాధిక తల్లిదండ్రులకు నీతా అంబాని వాగ్దానం చేస్తూ కనిపించారు. రాధిక మాది అయినట్లే అనంత్ మీవాడు అయ్యాడు, మీ రాధికను మా కూతురు ఇషాలా చూసుకుంటామని ముఖేష్ అంబాని, నేను మీకు హామీ ఇస్తున్నామని, ఆమెను అనంత్ అంబాని జీవిత భాగస్వామిగా మేము జీవితాంతం రాధికను భద్రంగా చూసుకుంటామని నీతా అంబాని ఆమె కుటుంబ సభ్యులకు మాట ఇచ్చారు.
హిందూ మతంలో కన్యాదానం యొక్క ప్రాముఖ్యత
హిందూ మత గ్రంథాలలో, హిందూ సాంప్రధాయంలో కన్యాదానాన్ని చాలా గొప్ప దానం అని అంటారు, ఎందుకంటే దీని కంటే పెద్ద దానం ఏదీ ఉండదు. ఆడపిల్లల తల్లిదండ్రులు సంపూర్ణ కర్మలతో కన్యాదానం చేస్తే వారి కుటుంబానికి కూడా సౌభాగ్యం కలుగుతుందని హిందూ శాస్త్రాలలో చెప్పబడింది. కన్యాదాన భాగ్యం పొందిన తల్లిదండ్రులకు ఇంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదన్నారు.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఆచారాన్ని నిర్వహించే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. కన్యాదానం తర్వాత మాత్రమే వధూవరులకు పవిత్ర వస్త్రాలు కట్టిస్తారు. దీని తరువాత అగ్ని ముందు ఏడు ప్రదక్షిణలు చేసి వివాహం పూర్తవుతుంది.
కన్యాదానం ఆచారం ఎలా మొదలైంది?
పురాణాల ప్రకారం విశ్వంలోని 27 నక్షత్రాలు చంద్రుడిని వివాహం చేసుకున్న తరువాత ప్రజాపతి కుమార్తెలుగా చెప్పబడింది. దక్షుడు తన కుమార్తెలకు వివాహం చేసి చంద్రునికి అప్పగించాడు. అప్పటి నుంచి ఆ సంప్రదాయం కొనసాగుతోంది. నేటికి భారతదేశంలోని ప్రతి హిందువు ఇంట్లో వాళ్ల ఆడపిల్లకు పెళ్లి చేస్తున్న సమయంలో వాళ్లవాళ్ల ఆచారాల ప్రకారం కన్యాదనం చేస్తుంటారు.



Click it and Unblock the Notifications