Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
Nithyananda swamy : నిత్యానంద స్వామి కన్నుమూత?
భారతదేశం వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యత్మిక గురువు నిత్యానంద స్వామి కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా నిత్యానంద స్వామి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారని, దీంతో ఆరోగ్యం క్షీణించి ఆయన మరణించారని ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వర్ ఓ వీడియోలో చెప్పినట్లు సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వీడియో లింక్ మాత్రం ఎక్కడా లభించట్లేదు. ఇవాళ ఏప్రిల్ 1 కనుక ప్రజలను ఫ్యూల్స్ చేయడానికి అలాంటి ఫేక్ సమాచారాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారా లేదంటే నిత్యానంద నిజంగానే మరణించారా అన్నది ఇంకా నిర్థారణ కావాల్సింది ఉంది.
తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన నిత్యానంద స్వామి కర్నాటకలోని బిడిది వెళ్లి ఆశ్రమం స్థాపించాడు. దేశంలోని వివిధ ప్రదేశాలలో కూడా ఆశ్రమాలను స్థాపించాడు. ఒక కన్నడ హీరోయిన్ తో నిత్యానంద రోమాన్స్ చేస్తున్న వీడియో బయటపడటంతో వివాదంలో చిక్కుకున్నాడు. తర్వాత మహిళా శిష్యులతో నిత్యానంద అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. బెంగళూరులో లైంగిక వేధింపుల కేసు నమోదైన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

కిడ్నాప్ ,అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన తనకంటూ ఓ సొంతదేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ ఐలాండ్ ని కొనుగలు చేసిన నిత్యానంద దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస(United States Of Kailasa)పేరు పెట్టారు. హిందువుల కోసం ఈ దేశం ఏర్పాటు చేశానని, ప్రత్యేక కరెన్సీ, పాస్‌పోర్ట్, జెండాను సృష్టించానని ప్రకటించాడు. తమిళనాడు ప్రజలు వచ్చి వ్యాపారం ప్రారంభించాలని నిత్యానంద ఆహ్వానించారు. కైలాస దేశం నుంచి నిత్యానంద ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తున్నట్లుగా కొన్ని వీడియోలు కూడా గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు కైలాసను దేశంగా గుర్తించలేదు. 1933 మాంటెవీడియో ఒప్పందం ప్రకారం..ఏదైనా ఒక భూభాగాన్ని దేశం అని పిలవాలంటే, అది శాశ్వత జనాభా, ప్రభుత్వం, ఇతర దేశాలతో సంబంధాలను కలిగి ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంతర్జాతీయ వేదికలో తమ ఉనికిని తెలియజేసేందుకు, ఆమోదం పొందేందుకు నిత్యానంద కైలాస ప్రతినిధులను గతంలో ఒకసారి ఐక్యరాజ్యసమితికి పంపారు. అయితే నిత్యానంద తరపున వారు సమర్పించిన డాక్యుమెంట్స్ సంబంధం లేనివి అని అవి పరిగణించబడవని UN పేర్కొంది.
నిత్యానంద మరణించాడని ఇప్పుడు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన పేరిట ఉన్న దాదాపు రూ.4 వేల కోట్లు ఇప్పుడు ఎవరికి దక్కుతాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.
DISCLIAMER: Bold Sky Telugu has not confirmed whether Nithyananda's death is real or not. We are bringing to your attention the propaganda going on on social media. Bold Sky Telugu does not take any responsibility for this.



Click it and Unblock the Notifications











