Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులను చేయవద్దు..!
ఆషాడ అమావాస్య రోజు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం మనకు చెబుతుంది. ఇక వేల చేసినట్లయితే చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఆషాడ అమావాస్య జులై 5 ఉదయం 4 గంటల 57 నిమిశాలకు రానుంది. తరువాతి రోజు జులై 6 శనివారం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిశాల వరకు అమావాస్య వుంటుంది. జులై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు. ఒక్కో అమావాస్యకు ఒక్కో ప్రాముఖ్యత వుంటుంది.

జులైలో వచ్చే ఆషాడ అమావాస్యను హలహరిణి అమావాస్య అని కూడా అంటారు. ఈ ప్రత్యేక రోజున రైతులు తమ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులకు పూజ చేస్తారు. అమావాస్య రోజున నీటిలో రాళ్ల ఉప్పు వేసి కలిపి దాంతో ఇంటిని తుడవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ వున్నా తొలగిపోయి సంతోషం పెరుగుతుందని నమ్ముతారు.
అమావాన్య వున్న రోజు సూర్యోదయం కాకముందే లేచి నదిలో స్నానం చేసి లేకపోతే ఇంట్లో నీళ్లతోనే స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. తరువాత పూజా మందిరంలో పూజ చేసి దీపం వెలిగించాలి. మీకు ఉపవాసం వుండగలిగే శక్తి వుంటే మీరు ఉపవాసం కూడా వుండవచ్చు.

ఇంట్లో ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ఎంతో మంచిది. అమావాస్య రోజున ఇంట్లో వుండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుడా తలస్నానం చేయాలి. తలస్నానం గనుక చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి తలస్నానం చేయడం చాలా ముఖ్యం. తలకు నూనె మాత్రం అస్సలు రాసుకోవద్దు.
ఇల్లూ వాకిలిని శుభ్రం చేసుకొని కల్లాపి చల్లాలి. అమావాస్య రోజున ఇంటిముందు ఎలాంటి ముగ్గూ వేయవద్దు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి అమావాస్య రోజున కచ్ఛితంగా లక్ష్మీదేవిని పూజించాల్సిందే.
లక్ష్మీదేవి ఫోటో ముందు దీపం, అగరబత్తీలు వెలిగించి బొట్టు పెట్టి పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య రోజున పితృదేవతలను తలుచుకుంటే వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. అమావాస్య రోజున ఇంటిముందు గుమ్మడికాయ కడితే చాలా మంచిదని పండితులు చెబుతున్న విషయం తెలిసిందే. గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రాకుండా వుంటుంది.
అమావాస్య రోజున పెద్దల పేర్లపైన నీల్లు వదలకపోతే దరిద్రం పడుతుందని శాస్త్రం చెబుతుంది. అమావాస్య రోజున అబద్ధాలు ఆడకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమవాస్య రోజున మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది. ముఖ్యంగా జమ్మి చెట్టును నాటితే సర్వ దేవతలు మీ ఇంట్లో కొలువై వుంటారు.
అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరిక కోరకలు నెరవేరుతాయ్. అమావాస్య రోజున ఆవులకు ఆహారం పెడితే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు. నువ్వులతో చేసిన ఆహారాన్ని దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్య మెరుగుపడాలంటే చేపలకు ఆహారం వేయాలని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున బిచ్చగాడు ఇంటికి వస్తే ఖాళీ చేతులతో తిరిగి వెనక్కి పంపకూడదు.



Click it and Unblock the Notifications