Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Pokలోకి ఎంటరైన భారత్! అల్లానే దిక్కంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న పాక్ ఎంపీ,ఆర్మీ మేజర్..వీడియో
పెహల్గామ్ లో ఏప్రిల్ 22,2025న పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతీకారం దెబ్బకి ఈ ఘటన వెనుక ఉన్న అందరికీ ఫ్యాంట్లు తడిచిపోతున్నాయి. పెహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తానే కారణం అని గుర్తించిన భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రవాదులను వరుసపెట్టి లేపేస్తోంది. లాహోర్, కరాచీ,పీఓకే,పాక్ పంజాబ్ ఎక్కడపడితే అక్కడ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడుల చేస్తుంది. ఈ క్రమంలో భారత్ పై దాడి చేయడం కోసం పాక్ పంపిన ఫైటర్ జెట్స్ ను,డ్రోన్స్ ని కూడా కూల్చేస్తోంది. జమ్మూ ఎయిర్ పోర్ట్ సహా భారత్ లోని 15 ప్రధాన నగరాల్లోని సైనిక ప్థావరాలే లక్ష్యంగా పాక్ వదిలిన మిసైల్స్, డ్రోన్స్ అన్నింటిని భారత్ పేల్చిపడేసింది.
పాకిస్తాన్ ఎయిర్ ఢిఫెన్స్ సిస్టమ్ ని కూడా భారత్ ధ్వంసం చేసింది. చైనా ఆయుధాలపైనే ఆధారపడి భారత్ ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ చైనా ఆయుధాలన్నీ తుస్సు మనడంతో ప్రపంచమం ముందు పరువు పోగొట్టుకుని ఇప్పుడు దేవుడు దిక్కు అంటూ ప్రార్థనలు చేస్తుంది. మరోవైపు సొంతదేశంలోని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(BLA) రెబల్స్ పాక్ ఆర్మీని టార్గెట్ చేసి దాడులకు పాల్పడుతున్నారు. బెలూచిస్తాన్ ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నినాదాలు చేస్తూ ఇన్నాళ్లు తమను వేధించిన పాక్ సైన్యాన్ని వరుసపెట్టి లేపేస్తూ కీలక నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్(POK)లోకి కూడా ఎంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

భారత్ ఉగ్రరూపం దెబ్బకు బిత్తరపోతున్న పాకిస్తాన్..ఏం చేయాలో అర్థంకాక అల్లా కాపాడయ్యా అంటూ వేడుకుంటోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని అధికార PML-N పార్టీకి చెందిన ఎంపీ తాహిర్ ఇఖ్బాల్ ఇస్లామాబాద్ లోని పార్లమెంట్ లో భారత్ నుంచి నువ్వే కాపాడాలి అల్లా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్ గా మారింది. పాక్ మాజీ ఆర్మీ మేజర్ కూడా అయిన తాహిర్ ఇఖ్బాల్..గురువారం ఇస్లామాబాద్ లోని పార్లమెంటల్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాము చాలా బలహీనులమని, తాము పాపాత్ములమని..అల్లా తమను కాపాడాలంటూ ఏడ్చారు.
పాకిస్తాన్ వేదనలో ఉందని..పాకిస్తాన్ ఎంపీలందరూ ఐక్యంగా ఉండి అల్లాని ప్రార్థించాలని కోరుకుంటున్నానని..పాకిస్తాన్ ని రక్షించాలని సర్వశక్తిమంతుడు అయినా అల్లాను తాను వేడుకుంటున్నట్లు వైరల్ వీడియోలో తామిర్ ఇఖ్బాల్ చెప్పాడు. ఓ అల్లా మేము మీ ముందు తలవంచి నమస్కరిస్తున్నాం..దయచేసి మా దేశాన్ని రక్షించు అంటూ ఏడ్చారు తాహిర్ ఇఖ్బాల్. ఈ వీడియో చూసిన నెటిజన్లు భారత్ దెబ్బకు తలవంచి తప్పు ఒప్పుకోండి అని కొందరు..మీకెందుకురా యుద్ధాలు అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక, భారత్ పాక్ మధ్య తాజా పరిస్థితులకు కారణమైన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విదేశాలకు పారిపోయాడని సమాచారం. భారత్ ప్రతీకార దాడులకు ముందే మునీర్ తన కుటుంబసభ్యులందరినీ విదేశాలకు పంపేయగా..తాజాగా ఆయన కూడా పారిపోవడంతో కొత్త ఆర్మీ చీఫ్ ని నియమించుకునే బిజీలో పాకిస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే పాక్ ప్రధాని నివాసానికి దగ్గర్లోనే జరిగిన దాడి భయంతో ప్రధాని షెషబాజ్ షరీఫ్ కూడా విదేశాలకు పారిపోయనట్లు వార్తలు వస్తున్నాయి.



Click it and Unblock the Notifications