Latest Updates
-
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.!
లక్ అంటే నీదే గురూ: జస్ట్ రూ.39 పెట్టి..రూ.4 కోట్లు గెల్చుకున్నాడు
అదృష్టం ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు రోడ్డు మీద చెత్త ఏరుకునే వాళ్లు కూడా అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. కొంతమందికి లాటరీలో వందల కోట్లు వచ్చి పడుతుంటాయి. తాజాగా ఓ యువకుడికి రూ. 4 కోట్లు వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. అది కూడా కేవలం 39 రూపాయలు ఖర్చు పెట్టి రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలోని ఘసి రామ్ కా పూర్వ గ్రామంలో నివసించే మంగల్ సరోజ్ ఈ ఏడాది మార్చి నెల నుంచి డ్రీమ్ 11 లో గేమ్ ఆడటం ప్రారంభించాడు. ఏదో ఒక రోజు డ్రీమ్ 11లో కోట్లు గెలవాలని అనుకునేవాడు. ఈ క్రమంలో డబ్బులు పోతున్నా సరే డ్రీమ్ 11 గేమ్ ఆడుతూనే ఉన్నాడు. 77 ఏడుసార్లు డ్రీమ్ 11లో డబ్బులు పెట్టినా రాలేదు..అయితే 78వ సారి సరోజ్ ని అదృష్టం వరించింది. డ్రీమ్ 11లో 78వ సారి కేవలం రూ.39 పెట్టి గేమ్ ఆడి రూ.4 కోట్లు గెల్చుకున్నాడు. దీంతో డ్రీమ్ 11 లో కోట్లు సంపాదించాలనే సరోజ్ కల నెరవేరింది.

రాత్రికి రాత్రే సరోజ్ కోటీశ్వరుడయ్యాడని తెలుసుకున్న అతని బంధువులు,ఫ్రెండ్స్, గ్రామస్థులు అందరూ సరోజ్ కి అభినందనలు తెలిపేందుకు అతడి ఇంటికి క్యూ కట్టారు. సరోజ్ నివసించే గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో కూడా సరోజ్ పేరు మార్మోగుతుంది.
వచ్చే డబ్బుతో ఆ పని
రెండు నెలల నుంచి రోజూ రూ. 49 పెట్టుబడి పెట్టి డ్రీమ్ 11లో గేమ్ ఆడేవాడినని..ప్రతి గేమ్ లో తాను ఓడిపోయానని,అయినా నిరుత్సాహపడకుంటా ప్రయత్నిస్తూనే ఉండేవాడినని మంగల్ సరోజ్ చెప్పాడు. ఏప్రిల్ 30న పంజాబ్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన అకౌంట్ లో చూసుకుంటే కేవలం రూ.39 రూపాయలు ఉన్నాయని,ఈ సారి కూడా ట్రై చేద్దామని ఆ రూ.39ని పంజాబ్, చెన్నై మ్యాచ్ లో పెట్టుబడిగా పెట్టానని..దీంతో తాను కలలో కూడా ఊహించని విధంగా రూ.4 కోట్లు తాను గెల్చుకున్నట్లు సరోజ్ చెప్పాడు.
సంతోషంలో తనకు మాటలు రావడం లేదని,అందరూ తనను అభినందిస్తున్నారని..ఇదంతా నిజంగా తన లక్ అని తెలిపారు. ట్యాక్సులు పోగా వచ్చే డబ్బుతో ఏ వ్యాపారం పెట్టుకొని బతుకుతానని చెప్పాడు. తన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుంటానని చెప్పాడు.
తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఇదే
మంగల్ సరోజ్ ది పేద వ్యవసాయ కుటుంబం. తండ్రి కౌలుకి పొలం తీసుకొని వ్యవసాయం చేస్తుంటాడు. పొలంలో ఏ పంట పండించినా అందులో మూడింట ఒక వంతు పొలం యజమానికి ఇచ్చిన మిగిలిన దాంతో తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబంలోని 8మంది బాధ్యతను వ్యవసాయం చేసి కష్టపడుతూ చూసుకుంటున్నాడు. కొడుకు ఇప్పుడు కోట్లు గెల్చుకోవడంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోతున్నాడు.



Click it and Unblock the Notifications