Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఛీఛీ ఏం బతుకులు రా: భారత్ ను ఎదుర్కోడానికి..అమెరికన్ల దగ్గరికి అందమైన పాక్ అమ్మాయిలు!..వీడియో
జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మోదీ సర్కార్..ఉగ్రవాదుల స్వర్గధామం పాకిస్తాన్ కు ఎలాంటి బుద్ధి చెబుతుందో అని భారతీయులందరూ ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో శుత్రువుల నుంచి దాడులు ఎదురైన సమయంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై మే 7న దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
భారత్ మిలటరీ యాక్షన్ కి దిగితే చస్తాం అని భయపడి పాక్ ఆర్మీలోని చాలామంది రిజైన్ చేసి వెళ్లిపోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. భారత్ ను ఎదుర్కోవాలంటే అమెరికన్ల దగ్గరకి పాక్ అమ్మాయిలను పంపాలని పాకిస్తాన్ కు చెందిన జర్నలిస్ట్ నజీమ్ సేథీ ఓ టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ కు చెందిన ఉర్దూ న్యూస్ ఛానెల్ సమా టీవీ(Samaa TV)ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ నజీమ్ సేథీ మాట్లాడుతూ..అమెరికాలో భారతీయల లాబీ ఎక్కువగా ఉంటుందని, వారు అక్కడ అన్ని రంగాలను ప్రభావితం చేసే వ్యక్తులుగా ఉన్నారన్నారు. ఎమ్ఎన్ సీల్లో, కార్పొరేషన్స్ లో, సెనేట్ లో భారతీయ అమెరికన్లు కీలక స్థానాల్లో ఉన్నారన్నారు. పెద్ద ఇండియన్ లాబీ అమెరికాలో ఉందన్నారు. అయితే పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వెనుకబడిందన్నారు. పాకిస్తాన్ దౌత్యవేత్తలను పిరికివాళ్లగా నజీమ్ అభివర్ణించారు. వాళ్లు రెడ్ లైన్ దాటరని అన్నారు. అమెరికాలో పాక్ యాక్టివ్ అవ్వాల్సిన అవసరముందని, భారత్ పై దౌత్య దాడికి తాము సిద్దంగా లేమన్నారు.
అమెరికాలోకి కొంచెం దూకుడుగా,ఆకర్షణీయంగా ఉండేవాళ్లను పంపాలన్నారు. కొన్నిసార్లు వీళ్లు వెళ్లి పబ్బుల్లో కూర్చోవాలని, కొన్ని సమయాల్లో పార్కుల్లో వాక్ చేయాలని, కొన్ని సమయాల్లో కొంచెం హాస్యం, కొంచెం వ్యంగ్యంతో ప్రవర్తించాలన్నారు. ఇది వ్యక్తి నుంచి వ్యక్తి దౌత్యం అని అన్నారు. ఆయితే ఆకర్షణీయత చాలా ముఖ్యం అని నజీమ్ సేథీ అన్నారు.
యూఎస్ లో పాకిస్తాన్ ప్రబావాన్ని పెంచడానికి నజీమ్ సేథీ చేసిన సూచనలు, ముఖ్యంగా ఆకర్షణీయమైన వ్యక్తులను పంపడం గురించిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. అయితే నజీమ్ సేథీ మహిళలు అని నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన వ్యాఖ్యల్లోని అర్థం అమ్మాయిలను అమెరికన్ల దగ్గరకి పంపాలి అనేనని సృష్టంగా అర్థమవుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక నేషనల్ న్యూస్ ఛానెలో ఇలాంటి ఆలోచన పాకిస్తాన్ మాత్రమే చేయగలదని, తక్కువ ఐక్యూ ఉన్న పాకిస్తానీల నుంచి ఇలాంటి తక్కువ ఐక్యూ ఆలోచనలు తప్పు ఇంకేముంటాయి అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, నజీమ్ సేథీ వ్యాఖ్యల వీడియో క్లిప్ ని భారత సమాచార ప్రసార మంత్రిత్వశాఖ సీనియర్ సలహాదారు కాంచన్ గుప్తా కూడా ఎక్స్ లో షేర్ చేశారు. పాకిస్తాన్ అవసరమైతే ఎంతకైనా తెగించే రకం అంటూ ఈ వీడియో క్లిప్ ని అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో నెటిజన్లు షేర్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications