Latest Updates
-
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.!
అణుబాంబు కంటే డేంజర్..భారత్ పై పెద్ద దాడి చేసిన పాకిస్తాన్!..వీడియో చూస్తే ఏమైపోతారో
జమ్మూకశ్మీర్ లోని పెహల్గామ్ లో ఇటీవల పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఈ దాడికి కుట్ర పన్నింది పాకిస్తానే అని భారత్ గుర్తించింది. దీంతో పాకిస్ాన్, పీఓకేలోని పలు ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మిసైల్ దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్ దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చచ్చారని వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత భారత్ మీద దాడికి పాక్ ప్రయత్నించడం..తోక కత్తిరించేలా భారత్ చేపట్టిన చర్యలతో రక్షించండి మహాప్రభో అంటూ పాక్ అమెరికా,చైనా చుట్టు ప్రదిక్షణలు కొట్టింది.
భారత్,పాకిస్తాన్ దేశాల మధ్య ఇటీవల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది. అయినప్పటికీ పరిస్థితులు ఇంకా ఉద్రిక్తతంగానే ఉన్నాయి. అయితే ఈ సమయంలో పాకిస్తానీ గాయకుడు చాహత్ ఫతే అలీ ఖాన్ విడుదల చేసిన ఒక దేశభక్తి గీతం ఇంటర్నెట్ లో పెను సంచలనం సృష్టిస్తోంది. తనదైన విలక్షణ గాత్రంతో ఇప్పటికే సోషల్ మీడియాలో సుపరిచితుడైన చాహత్.. 'మేరే వతన్ మేరే చమన్' (నా దేశమా, నా ఉద్యానవనమా) అంటూ పాకిస్తాన్ పై తనకున్న దేశభక్తిని చాటుకుంటూ కొత్త పాటను ఆలపించారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా వేదికలపై విడుదలైన ఈ గీతం క్షణాల్లో వైరల్‌గా మారి నెటిజన్లను విస్మయానికి గురిచేసింది.

ఈ పాట వీడియోలో పాకిస్తాన్ సైన్యం, ఆ దేశంలోని కీలక ప్రదేశాలు నేపథ్యంగా కనిపిస్తుండగా చాహత్ ఫతే అలీ ఖాన్ తనదైన విలక్షణమైన గాత్ర శైలితో, ప్రత్యేకమైన సాహిత్యంతో గొంతు సవరించుకోవడం చూపరులను ఆకట్టుకుంది. ఆయన గానం, పాటలోని పదాలు నెటిజన్లకు కొత్త మీమ్ మెటీరియల్‌గా మారాయి. ఈ పాట ఇంటర్నెట్‌లో మీమ్స్ జాతరకు తెరలేపింది.
చాలామంది ఈ దేశభక్తి గీతం చూసి పాకిస్తాన్ సైన్యం కంటే ఈయనే పెద్ద దాడి చేశాడంటూ చమత్కరించారు. మరో నెటిజన్ అయితే పాకిస్తాన్ భారత్‌పై పూర్తిస్థాయి దాడిని ప్రారంభించింది, ఇది ఎలాంటి అణుదాడి కన్నా భయంకరమైనదని తాను లొంగిపోతున్నాను, భారత దళాలన్నీ పూర్తిగా బేషరతుగా లొంగిపోవాలని ఆదేశిస్తున్నాను.. ఇది భరించలేనంతగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
కొందరైతే దీన్ని పాకిస్తానీ గాయకుడి సంగీత దాడిగా అభివర్ణిస్తూ.. భారత్ కూడా ఇలాంటి సంగీత అస్త్రాలను ప్రయోగించాలని సూచించారు. దేశభక్తిని చాటాలన్న చాహత్ ఫతే అలీ ఖాన్ ప్రయత్నం ఇంటర్నెట్ లో నవ్వుల పువ్వులు పూయించి సరిహద్దులకు అతీతంగా చర్చనీయాంశంగా మారింది. సంగీతం ప్రశంసలతో అయినా,మీమ్స్ తో అయినా ఎలాగైనా సరిహద్దులు దాటుతుందని ఇది మరోసారి నిరూపించింది.



Click it and Unblock the Notifications
