Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికే గుండెపోటు ఎక్కువగా వస్తుందట.. అవి ఏవేవి అంటే?
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ మహమ్మారి బారిన పడి.. కొన్ని దేశాలు కూడా కోలుకోలేదు. ఆ మహమ్మారి సృష్టించిన విధ్వంసానికి దేశాల ఆర్ధిక పరిస్థితులే అతలాకుతలమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ మహమ్మారి సోకిన ప్రజల్లో మాత్రం ఇంకా దాని ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది.
కరోనా సోకిన వారికి గుండెపోటు, స్ట్రోక్ కారణంగా మరణించే అవకాశముందని అమెరికాలోని కొత్త పరిశోధన వెల్లడించింది. ఈ ప్రమాదం మూడేళ్లపాటు ఉంటుందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదో వారికే అధికంగా ప్రమాదకరంగా ఉంటుందని ఆ పరిశోధనలో తేలింది. దీంతోపాటు అనేక సంచలన విషయాలు ఆ పరిశోధనలో బయటపడింది. అవేంటో తెలుసుకుందాం..

పరిశోధనలో ఏం తేలిందంటే?
అమెరికా యొక్క అతిపెద్ద వైద్య పరిశోధనా సంస్థ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విడుదల చేసింది. ఈ పరిశోధనలో.. కరోనా సోకిన వారిలో మూడేళ్లపాటు ఈ సమస్య ఉంటుందని తేలింది. కరోనా మొదటి వేవ్‌లో ఎవరికైతే సోకిందో.. వారికే ఈ ముప్పు ఎక్కువగా ఉందని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకొని, వైరస్ సోకని వారికంట.. మొదటి వేవ్‌లో వైరస్ బారిన పడిన వారికే ఎక్కువగా ప్రమాదమని వెల్లడైంది.
దీనిని నిర్ధారించగలమా?
ఈ పరిశోధనపై ఎన్‌ఐహెచ్ యొక్క నేషనల్ హార్ట్, లంగ్, బ్లడ్ ఇన్స్టిట్యూట్(NHLBI)లో కార్డియోవాస్కులర్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ గో స్పందించారు. ఈ పరిశోధన దీర్ఘకాలిక గుండె జబ్బులు, కరోనా కారణంగా కలిగే సమస్యల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ పరిశోధనలను నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే కోవిడ్ సోకి గుండెపోటుతో మృతి చెందుతున్న వారికి తగిన చికిత్స అందించగలమని పేర్కొన్నారు.
ఏ ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువ ప్రమాదమంటే..
తీవ్రమైన కోవిడ్-19 రోగులలో బ్లెడ్ గ్రూప్, గుండెపోటు సమస్యలను పెంచడానికి మధ్య సాధ్యమయ్యే జన్యు సంబంధిత సమస్యలపై కూడా ఈ పరిశోధనలో సంచలన విషయాలు బయటికొచ్చాయి. కరోనా తరువాత A, B, AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. O బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని అందులో తేలింది.
ఎంతమంది కరోనా బారిన పడ్డారంటే?
కరోనా రోగులు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువనే అంటున్నారు పరిశోధకులు. టైప్ 2 డయాబెటిస్ వంటి ప్రమాద కారకాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వందల కోట్ల మంది కరోనా బారిన పడ్డారని, వారికి ఈ ముప్పు ఉండే అవకాశముందని పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications