Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ట్రంప్ అడ్డాలో అడుగుపెట్టిన మోదీ..షేక్ షేక్ ఆడిస్తున్నాడు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాలన్నా,ఆయన పక్కన కూర్చోవాలన్నా కూడా కొన్ని దేశాల అధ్యక్షులకే చెమటలు పడుతున్నాయి. దీనికి కారణం ట్రంప్ ఎప్పుడు,ఏం చేస్తారో,ఏమంటారో,తమ దేశాన్ని ప్రభావితం చేసే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే భయమే. ట్రంప్ 2.0లో మిత్రదేశం,శత్రుదేశం అని తేడాలేకుండా అన్నిదేశాలకు ప్రతీకార టారిఫ్ లు, ఆంక్షలతో వెన్నులో వణకు పుట్టిస్తున్నాడు. ట్రంప్ ఆంక్షల దెబ్బకు భయపడి కొన్నిదేశాలు తలవంచగా..ఇరాన్,చైనా,కెనడా వంటి దేశాలు మాత్రం ఏం చేసుకుంటావో చేసుకో పో నీకు తలవంచేదేలే అంటూ గర్జిస్తున్నాయి.
భారత్ అమెరికా రెండూ మిత్రదేశాలే అయినప్పటికీ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు నష్టం కలిగించే అనేక నిర్ణయాలు,ప్రకటనలు కూడా ట్రంప్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో భారత్ ఎక్కడా తగ్గకుండా తన ఆశక్తులను కాపాడుకుంటూనే ట్రంప్ విరోధానికి కూడా స్నేహానికే మొగ్గు చూపుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ,డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఒకసారి అధ్యక్ష హోదాలో ట్రంప్ భారత్ లోని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ లో కూడా పర్యటించారు. నరేంద్రమోదీ కూడా ప్రధాని హోదాలో పలుసార్లు అమెరికా పర్యటనలు చేపట్టారు. గత నెలలో కూడా అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ ట్రంప్ ను కలిసి అమెరికాకి మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికవడంపై ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఇరు దేశాల సంబంధాలు బలోపేతం చేసే దిశగా మోదీ ట్రంప్ ల మధ్య చర్చలు కూడా జరిగాయి.

2021లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి పాలైన తర్వాత ఆ దేశ రాజధాని వాషింగ్టన్ లో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనలకు ట్రంప్ కారణమంటూ ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ పాంలు అయిన ట్విట్టర్ ,ఫేస్ బుక్ ట్రంప్ అకౌంట్స్ ని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో 2022 ఫిబ్రవరిలో ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ సోషల్ ని ఏర్పాటుచేసుకున్నారు. అయితే కొద్ది మంది ప్రపంచ నేతలు మాత్రమే చేరిన ఈ సోషల్ మీడియాలో తాజాగా భారత ప్రధానమంత్రి కూడా అకౌంట్ ఓపెన్ చేశారు.
ట్రంప్ సోషల్ మీడియా ఫ్లాట్ పాం ట్రూత్ సోషల్ లో సోమవారం బారత ప్రధాని నరేంద్రమోదీ చేరారు. మోదీ తన ఫస్ట్ పోస్ట్ లో..2019లో అమెరికాలోని హోస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ తో కలిసి తీసుకున్న ఫొటోని షేర్ చేశారు. ట్రూత్ సోషల్ ఫ్లాట్ ఫాంలో చేరడం సంతోషంగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ట్రూత్ సోషల్ లో అకౌంట్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికే మోదీకి 25వేల కు పైగా పాలోవర్లు వచ్చారు. మోదీ మాత్రం ఆ ఫ్లాట్ ఫాంలో ట్రంప్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ని ఫాలో అవుతున్నారు.
మోదీ పాడ్ కాస్ట్ లింక్ షేర్ చేసిన మోదీ
సోమవారం డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్ లో..పోడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మాన్ తో మోదీ చేసిన ఇంటర్వ్యూ లింక్ ను షేర్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మోదీ తన జీవిత ప్రయాణంచ 2002 గుజరాత్ అల్లర్లు, చైనాతో భారత సంబంధాలు సహా అనేక అంశాలపై మాట్లాడారు.
సోమవారం, ట్రంప్ పోడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో మోడీ చేసిన ఇంటర్వ్యూ లింక్‌ను పంచుకున్నారు, అక్కడ భారత ప్రధాని తన జీవిత ప్రయాణం, 2002 గుజరాత్ అల్లర్లు మరియు చైనాతో భారతదేశ సంబంధం వంటి అనేక అంశాలపై మాట్లాడారు.
ట్రంప్ వాటా ఇదే
ట్రూత్ సోషల్ అనేది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్(TMTG)యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థలో ట్రంప్ దాదాపు 57శాతం వాటా కలిగి ఉన్నారు. గతేడాది మార్చిలో ట్రంప్ ఈ కంపెనీని పబ్లిక్‌గా తీసుకున్నారు.
ట్రంప్ కి ఎంతమంది పాలోవర్లు
అమెరికా అధ్యక్షుడికి ట్రూత్ సోషల్ లో 9.28 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, ఇది ట్విట్టర్ లో ఆయనకు ఉన్న 87 మిలియన్ల కంటే చాలా తక్కువ.
ట్విట్టర్ కంటే 400 రెట్లు
ట్రూత్ సోషల్ లో ట్రాఫిక్ దాని పోటీదారులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. దాని మొత్తం వినియోగదారుల సంఖ్య ట్విట్టర్ కంటే 400 రెట్లు వెనుకబడి ఉంది.



Click it and Unblock the Notifications