Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈసారి పోలీసులు సిక్స్ కొట్టారు, విరాట్ కోహ్లి రెస్టారెంట్ అండ్ పబ్ మీద కేసు ఎందుకుంటే ?
భారత క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ఎవరికీ పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లి తాజాగా ప్రపంచకప్‌లో కూడా రాణించాడు.
క్రికెటర్ విరాట్ కోహ్లి తన క్రీడా నైపుణ్యానికి మాత్రమే కాకుండా తన వ్యాపారాలు విజయవంతంగా నిర్వహించడంలో కూడా సక్సస్ అయ్యాడు. విరాట్ కోహ్లి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్ లు ఉన్న రెస్టారెంట్‌లతో సహా అనేక వ్యాపారాలను చేస్తున్నాడు. అందులో బెంగళూరులోని విరాట్ కోహ్లి రెస్టారెంట్ కూడా ఒకటి.

బెంగళూరులోని వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం అనుమతించిన సమయానికి మించి విరాట్ కోహ్లికి చెందిన రెస్టారెంట్ అండ్ పబ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది, పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో రెస్టారెంట్ వన్8 కమ్యూన్ యజమాని విరాట్ కోహ్లి పేరు వార్తల్లో నిలిచింది.
బెంగళూరు నగరంలోని కస్తూరి బా రోడ్డులోని రత్నం కాంప్లెక్స్ పై అంతస్తులోని పబ్ అర్ధరాత్రి 1 గంట తర్వాత కూడా నిర్వహిస్తున్నారని కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారం అందింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కబ్బన్ పార్క్ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లను పరిశీలిస్తూ వెళ్లారు.
అర్ధరాత్రి 1 గంట తర్వాత పబ్ ల్లో గంటల తరబడి కస్టమర్లు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు విరాట్ కోహ్లికి చెందిన పబ్ లోకి వెళ్లారు. అనుమతి ఇచ్చిన సమయం తర్వాత కూడా కస్టమర్లకు సేవలు అందిస్తున్నారని పోలీసులు ప్రత్యక్షంగా చూశారు.
జూలై 6వ తేదీన తెల్లవారుజామున 1.20 గంటలకు పబ్ వినియోగదారులకు సేవలందిస్తున్నట్లు గుర్తించారు.పబ్ లు క్లోజ్ చేసే సమయానికి మించి కస్టమర్లకు మద్యం, ఆహారం అందిస్తున్నారని తెలుసుకున్న మరో మూడు పబ్‌లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
బెంగుళూరులో అర్ధరాత్రి 1 గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్ లు, పబ్ ల్లో కస్టమర్లు ఉండటానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన సమయం అర్దరాత్రి 1 గంట సమయం దాటిపోయిన తరువాత కూడా విరాట్ కోహ్లికి చెందిన వన్ 9 కమ్యూన్ రెస్టారెంట్ అండ్ పబ్ లో కస్టమర్లు ఉండటంతో కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.



Click it and Unblock the Notifications