Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోదీ అదిరిపోయే గిఫ్ట్.. మెక్రాన్‌కు సితార, ఆయన భార్యకు తెలంగాణ చీర
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. చందనపు చెక్కతో తయారు చేసిన సితార వాయిద్యాన్ని మోదీ కానుకగా అందించారు. అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడి సతీమణి బ్రిగెట్టికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను బహూకరించారు.

తెలంగాణ ఇక్కత్ చీర:
తెలంగాణ ఇక్కత్ చీరను చందనపు చెక్కతో చేసిన పెట్టేలో ఈ చీరను పెట్టిన బ్రిగెట్టి మెక్రాన్ కు మోదీ అందజేశారు. అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ చీర చూడగానే ఆకట్టుకునేలా ఉంది. పోచంపల్లి ఇక్కత్ అద్భుతమైన డిజైన్, ఆకట్టుకునే రంగుల్లో తయారు చేస్తారు. వారసత్వంగా వస్తున్న ఈ కళను పోచంపల్లి వాసులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
తెలంగాణ నల్గొండ జిల్లాలోని పోచంపల్లిలో పట్టు చీరలకు చాలా ప్రసిద్ధి చెందింది. పోచంపల్లికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. ఇక్కడ దారాలకే రంగులు అద్ది వాటినే డిజైన్లుగా మలుస్తారు. ఈ చీరలతో అందం మరింత అందంగా కనిపిస్తారు. ఈ చీరలపై ఉన్న డిజైన్ ను ఇక్కత్ డిజైన్ అని పిలుస్తారు. ఇవి కట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. పోచంపల్లిలో తయారైన పట్టు, కాటన్, ఇక్కత్ చీరలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.
చందనపు చెక్కతో చేసిన సితార:
చందనపు చెక్కతో తయారు చేసిన సితారను కూడా మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కు బహుకరించారు. అద్భుతమైన పనితీరుతో ఈ కళాఖండం ఆకట్టుకుంటుంది. రాజస్థానీ కళాకారులు పూర్తిగా చేతులతో ఈ చందనపు సితారను తయారు చేస్తారు. అత్యంత క్లిష్టమైన డిజైన్ తో చూడగానే మంత్రముగ్దులను చేస్తుంది.
అశోక చక్రాన్ని పోలిన డిజైన కింద ఉంటుంది. దానిపై ఇరు వైపుల రెండు నెమళ్లు అద్భుతంగా తీర్చిదిద్ది ఉన్నాయి. వినాయకుడు నాలుగుచేతులతో నర్తిస్తున్న భంగిమలో చిన్న విగ్రహాన్ని అద్భుతంగా చెక్కి పొందుపరిచారు. అలాగే పైన సరస్వతీ దేవి వీణను పట్టుకుని ఉంటుంది. అత్యద్భుతమైన ఈ కళాఖండాన్ని మోదీ మెక్రాన్ కు బహూకరించారు.
మార్బుల్ ఇన్‌లే వర్క్:
ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ కు కూడా మోదీ ఓ గిఫ్ట్ ఇచ్చారు. మార్బుల్ ఇన్‌లే వర్క్ టేబుల్ ను మోదీ బోర్న్ కు అందించారు. అద్భుతంగా పాలరాతిపై వివిధ రంగుల రాళ్లతో చేసిన పూల డిజైన్ అత్యద్భుతంగా ఉంది. రాజస్థాన్ లోని మక్రానా అనే పట్టణానికి చెందిన ఈ బేస్ మార్బుల్ పై రకరకాల డిజైన్లతో చేతులతో ఈ ఆకర్షణీయమైన డిజైన్ రూపొందిస్తారు. వీటిపై రంగురంగుల రాళ్లను రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాలు, అలాగే దేశంలోని వివిధ నగరాల్లోని రాళ్లను తీసుకువచ్చి చేస్తారు. ఈ రకమైన కళాఖండాలకు ఆగ్రా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రసిద్ధి.
సిల్క్ కశ్మీరీ కార్పెట్:
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యాయిల్ బ్రౌన్ పివెట్ కి పూర్తిగా చేతితో అల్లిన 'సిల్క్ కశ్మీరీ కార్పెట్'ను మోదీ బహూకరించారు. ఈ కశ్మీరి తివాచీలు మృదుత్వానికి, నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అత్యంత క్లిష్టమైన డిజైన్, నైపుణ్యంతో చేసిన ఈ తివాచీలు ఇతర వాటితో భిన్నంగా నిలుపుతాయి.
గంధపు చెక్కతో చేసిన ఏనుగు అంబారీ:
ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్ కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఈ ఏనుగు అంబారీ బొమ్మ స్వచ్ఛమైన చందనంతో తయారు చేశారు. సువాసనలు వెదజల్లే ఈ చెక్కతో చేసిన బొమ్మ.. చాలా అద్భుతంగా, చూడగానే మంత్రముగ్దులను చేస్తుంది. జ్ఞానం, బలం, అదృష్టాన్ని ఏనుగు అంబారీ సూచిస్తుంది.



Click it and Unblock the Notifications