Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
వర్షాకాలంలో మన ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే ఆహారాలు
ఇండియన్ సమ్మర్ మద్యలో వచ్చే వర్షాకాలం అంటే చాలా మంది ఎక్కువ ఇష్టం ఎందుకంటే పడిపడనట్లు, వాతావరణం చల్లగా చిరుజుల్లులతో ఆహ్లాదపరుస్తుంటుంది.ముఖ్యంగా వేసవి సీజన్ మద్యలో చిరు జుల్లు లేదా దారాళంగా కురిసే వర్షం ఏదైనా సరే ఆహ్లాదపరుస్తూ, చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తూ,నోరూరిస్తుంటుంది. అంతేనా వేడి కాఫీ, వేడి వేడి పకోడీలు వర్షాన్ని మరికొంత సేపు ఎంజాయ్ చేయాలనిపించేలా అనిపిస్తుంది. అందుకే ఇటువంటి వర్షకాలంలో కొన్ని సులభంగా తయారుచేసుకొని తినగలిగినవి మరియు చాలా తేలికగా మార్కెట్లో అందుబాటులో ఉండే కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి....

మ్యాగి:
అకస్మాత్త్ గా వర్షం కురిసే సమయంలో మీ నోటికి రుచికరంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే ఆహారాల్లో ఒకటి మ్యాగి. వేడి వేడిగా పొగలు గక్కుతు, సూప్ టైప్ లో తీసుకొంటే మరింత టేస్ట్ గా ఉంటుంది. ంమ్యాగి మరింత టేస్ట్ గా మరియు హెల్తీ గా ఉండాలంటే అందులో అదనంగా కొన్ని కూరగాయలను వేయండి. వర్షకాలానికి మ్యాగి ఫర్ ఫెక్ట్ స్నాక్ లేదా డిష్.

ఉల్లిపాయ పకోడా:
వర్షం ఏ మోస్తరులో పుడుతున్నది అన్నది విషయం కాదు, వర్షం పడుతున్నది చిరుజల్లులైనా, గట్టి వానైనా సరే లోకల్ స్ట్రీట్స్ అమ్మకం దారులు మాత్రం వేడి వేడిగా క్రిస్పీగా మరియు కారంగా ఉండే పకోడాలను తయారుచేసేస్తుంటరు. అందులో ఉల్లిపాయ పకోడా ఒకటి మీ నోరూరిస్తుంటుంది.

మసాలా ఛాయ్:
వర్షం పడే సాయంత్రంలో ఒక కప్పు స్ట్రాంగ్ మసాలా ఛాయ్ త్రాగడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. అందులోనూ సువాసన కలిగించే మసాలా ఛాయ్ మరింత టేస్ట్ గా ఉంటుంది. మసాలా ఛాయ్ విత్ పకోడా వర్షాకాలంలో మరింత ఆహ్లాదపరుస్తుంది.

కచోరి:
వర్షాకాలంలో ఇష్టపడే మరో ఇష్టమైన స్నాక్ కచోరి. వర్షాకాలంలో కచోరి మరింత టేస్టీగా నోటికి రుచిని కలిగిస్తాయి. ముఖ్యంగా మసాలా కచోరి లేదా రాజ్ కచోరి, ఒక అద్భుతమైన రుచికరమైన వంట.

సమోసా:
చాలా వరకూ మన ఇండియన్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్ రిసిపి సమోసా. అయితే సమోసాలో స్టఫింగ్ మాత్రం ఘుమఘుమలాడుతు వర్షాకాలంలో నోరూరిస్తుంటాయి. ఏ మాత్రం వర్ష సూచన కనిపించినా సమోసాల మీద మనస్సు మళ్ళాల్సిందే...

సూప్స్:
మీరు ఖచ్చితంగా భోజనప్రియులైతే మీరు తినే ఆహారాలు మరింత టేస్ట్ గా ఎక్కడ దొరుకుతాయని వెతుకుతారంతేే. అంతే కాదు, మీరంతట మీరే తయారుచేసుకోగల సూపులను కూడా మీరు ట్రైచేయవచ్చు.వేడి వేడి సూప్ బయట వర్షం, టీవీలో మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది చెప్పండి..

మమూస్:
మమూస్ అనేవి అన్ని సీజన్లలోనూ రుచికరంగానే ఉంటాయి. అయితే ఆవిరిమీద ఉడికించే మమూస్, వాటికి గార్లిక్ సాస్ లేదా రెడ్ చట్నీ తో సర్వ్ చేస్తే ఆహా!ఎంత రుచిగా ఉంటుందో.

రోస్ట్ చికెన్:
చాలా మంది అబ్బాయిలు, డెడ్లీ సమ్మర్ హీట్ ను బ్రేక్ చేయడానికి, రైనీ సీజన్ లో అత్యంత ఇష్టమైన ఇండియన్ ఫుడ్స్ తందూరి చికెన్,ఫ్రైడ్ చికెన్, చికెన్ లాలిపప్, చికెన్ కబాబ్ తో సెలబ్రేట్ చేసుకుంటారు .క్రిస్పీగా ఉండే చికెన్ ఫుడ్స్ గ్రీన్ లేదా రెడ్ చట్నీతో సర్వ్ చేస్తే వర్షాకాలం వీటికి మించిన స్నాక్ మరోకటి ఉండదనిపిస్తుంది.

రమ్ :
ఎంజాయ్ చేయడానికి అబ్బాయిలకు ఇది ఒక సాకు. వర్షం పడుతోంది, వెచ్చగా బీర్, రమ్ త్రాగితే ఎలా ఉంటుందని ఆలోచన వెంటనే మనస్సులో మెదలవుతుంది .

మటన్ కర్రీ:
వేసివిలో ఇతర స్నాక్స్ తో పాటు మటన్ కర్రీ కూడా ఎక్కువగా ఇష్టపడే మాన్ సూన్ మటన్ కర్రీ.



Click it and Unblock the Notifications
